Saarc
-
Sujata Seshadrinathan: ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్
సార్క్ రీజన్ ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని స్వీకరించిన సుజాత శేషాద్రినాథ్ వ్యాపార అనుభవాలే తన పాఠాలు అని చెబుతుంది... సాఫ్ట్వేర్, ఫైనాన్స్,అకౌంటింగ్ స్పెషలిస్ట్‌గా తనదైన ముద్ర వేసింది సుజాత శేషాద్రినాథన్. ఫండ్ బిజినెస్‌లో అకౌంటింగ్ అప్లికేషన్స్ కోసం ఆటోమేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్స్ క్రియేట్ చేసింది. ‘అద్భుతమైన పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా ప్రయాణంలో సహకరించిన వ్యక్తులు, సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న భారతీయ మహిళలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. శ్రీలంక కేంద్రంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటయిన సంస్థ ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. భవిష్యత్తరం మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. ఈ ఉద్యమంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది’ అంటుంది సుజాత శేషాద్రినాథన్. ఎస్పీజైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మెనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన సుజాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ చేసింది. సాఫ్ట్వేర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులలో సుజాతకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బసిజ్ ఫండ్ సర్వీస్ ప్రైవెట్ లిమిటెడ్‌కు సుజాత డైరెక్టర్. ఫండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వరకు ఈ సంస్థ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. రకరకాల విషయాలలో క్లయింట్స్‌కు సంబంధించి జటిలమైన సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది. -
ప్రతి పల్లెలోనూ రాయల్ ఎన్ఫీల్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాయల్ ఎన్ఫీల్డ్.. పేరుకు తగ్గట్టే హుందా ఉట్టిపడే ఈ మిడ్ సెగ్మెంట్ బైక్స్‌కు ఇప్పుడు దేశంలో ప్రతీ పల్లెలోనూ కస్టమర్ ఉన్నారు. భారత్‌లో ఏటా కంపెనీ సుమారు 6,00,000 వాహనాలను విక్రయిస్తోంది. ఇందులో 60 శాతం యూనిట్లు ప్రధాన నగరాల్లో అమ్ముడవుతుండగా మిగిలిన 40 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదార్లకు చేరుతున్నాయని రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా, సార్క్ బిజినెస్ హెడ్ వి.జయప్రదీప్ తెలిపారు. 75 శాతం విక్రయ కేంద్రాలు మెట్రోయేతర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 10 శాతం ఉందని వివరించారు. హైదరాబాద్ మార్కెట్లో హంటర్ 350 బైక్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడారు. స్టూడియో ఫార్మాట్లో.. సంస్థకు దేశంలో 2,150 విక్రయశాలలు ఉన్నాయని జయప్రదీప్ వెల్లడించారు. ‘ఇందులో పట్టణాలు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లను దృష్టిలో పెట్టుకుని స్టూడియో ఫార్మాట్లో సగం స్టోర్లను తెరిచాం. 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. మూడేళ్లలోనే స్టూడియోల సంఖ్య 1,075కు చేరుకుందంటే మెట్రోయేతర ప్రాంతాల్లో బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. అమ్మకాల వృద్ధి 50 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతంలో ఇది ఏకంగా 60 శాతం ఉంది. ఎనిమిది మోడళ్లలో నాలుగు 350 సీసీ సామర్థ్యం గలవి. విక్రయాల్లో 350 సీసీ మోడళ్ల వాటా అత్యధికంగా 80 శాతం ఉంది. 250–750 సీసీ మిడ్ సెగ్మెంట్లో దేశంలో అన్ని కంపెనీలవి కలిపి నెలకు 60,000 బైక్స్ అమ్ముడవుతున్నాయి. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్కు 85 శాతం వాటా ఉంది’ అని ఆయన వివరించారు. నెలకు రూ.4,999లతో.. హంటర్‌ను 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ జె-సిరీస్ ఇంజన్‌తో రూపొందించారు. 5 స్పీడ్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ప్రీమియం డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుపరిచారు. బరువు 181 కిలోలు. వేరియంట్‌నుబట్టి హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.1,49,900 నుంచి ప్రారంభం. 8రంగుల్లో లభిస్తుంది. నెల వాయిదా రూ.4,999లతో హంటర్‌ను సొంతం చేసుకోవచ్చు. వాయిదా పద్ధతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య 55% ఉంది. -
అమెరికా బాటలో మరో 30 దేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే మహ్మమారి కరోనా వైరస్ భారత్‌పై ప్రభావం చూపినా.. కొంతమేర కట్టడి చేయగలిగాం అనేది అందరికీ తెలిసిందే. వైరస్ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రశంసలు కురిపించింది. అయితే కోవిడ్-19కు ఇప్పటి వరకు విరుగుడు కనిపెట్టకపోవడం ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మలేరియా నిరోధానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌తో పాటు పారాసిట్మాల్ ఔషధాన్ని కరోనా బాధితులకు అందిస్తున్నారు. (మూడోదశకు కరోనా: ఎయిమ్స్) ఈ క్రమంలోనే వైరస్ విజృంభణతో వేలసంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్న అమెరికాకు భారత్ ఆపద్భాందవుడిలా కనిపింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మెడిసిన్‌ను తమకు కూడా ఎగుమతి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రభుత్వానికి కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి.. ఈ మెడిసిన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అమెరికన్ కంపెనీలు మెడిసిన్ కోసం భారత్‌కు అర్డర్ కూడా పెట్టుకున్నాయి. అయితే భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజరోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందుగానే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధ అవసరాన్ని గుర్తించింది. ఇతర దేశాలకు ఆ మెడిసన్ ఎగుమతులను నిషేధిస్తూ మార్చి 24న ఉత్తర్వులు జారీచేసింది. (భారత్ సహాయాన్ని కోరిన ట్రంప్) మరోవైపు అమెరికా, సార్క్ దేశాలతో పాటు మరో 30 దేశాలు భారత్ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మేరకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు సహాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే వీటికి కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ప్రస్తుతం టాబ్లెట్ల వినియోగం పెద్ద ఎత్తున ఉండటంతో.. వీలైనంత స్టాక్‌ను తమ వద్ద ఉంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కాగా భారత్‌లో కరోనా బాధితులకు ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మెడిసిన్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే -
సార్క్ పునరుద్ధరణ సాధ్యమేనా?
కరోనా వైరస్ ప్రపంచంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో సార్క్ దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రధాని నరేంద్రమోదీ సరైన సమయంలో చొరవ తీసుకోవడం ప్రశంసనీయం. దక్షిణాసియాలో కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధిని నిర్మూలించడంలో మోదీ తీసుకున్న చొరవ ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు కూడా. కానీ సార్క్‌ని తిరిగి పట్టాలెక్కించే విషయంలో అది హామీ కల్పించింది. మరోవైపున ప్రాంతీయ వేదికలపై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించకుండానే.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను మరిన్ని బాలాకోట్ ఘటనలు పునరావృతం చేయడం ద్వారా భారత్ శిక్షించవచ్చు. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా చైనా సాగిస్తున్న ప్రాంతీయ వ్యూహాత్మక ఆక్రమణను సవాలు చేయడానికి భారత్ తన పొరుగుకు ప్రాధాన్యతను ఇవ్వడం అనే విధానంలో భాగంగానే సార్క్‌ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమితి (సార్క్) పునరుత్తేజానికి, పునరుద్ధరణకు ప్రాణాంతక కోవిడ్–19 సాంక్రమిక వ్యాధి ఒకరకంగా మార్గం కల్పించింది. ప్రధాని నరేంద్రమోదీ కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టేందుకు ఒక పరస్పర సమన్వయ వ్యూహం కోసం సార్క్ దేశాల సహ ప్రధానులతో కలిసి పనిచేయడానికి సాహసోపేతమైన, సానుకూల చర్య విషయంలో చొరవ తీసుకున్నారు. సార్క్ 2015 నుంచి ఐసీయూలో ఉంటూ వస్తోందన్నది తెలి సిందే. ప్రాంతీయ అనుసంధానంతో ముడిపడిన ప్రాజెక్టుల విషయంలో సహకారం అందించడానికి పాకిస్తాన్ తిరస్కరించడం, పాకిస్తాన్‌తో సంబంధాల కొనసాగింపునకు భారత్ నిరాకరించడమే దీనికి ప్రధాన కారణం. ప్రజారోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో పేలవమైన విధానాలు కొనసాగడం, మౌలిక వసతుల కొరతతోపాటు అధిక జనసాంధ్రతతో కూడిన దక్షిణాసియాలో కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధిని నిర్మూలించడంలో మోదీ తీసుకున్న చొరవ ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు కూడా. కానీ సార్క్‌ని తిరిగి పట్టాలెక్కించే విషయంలో అది హామీ కల్పించింది. కోవిడ్–19 వ్యాధి నిర్మూలన కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను, సార్క్ అధినేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వాగతించారు. పాకిస్తాన్ కూడా దీంట్లో భాగమైంది. ఈ సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ తనవంతుగా కోటి అమెరికన్ డాలర్లను ఇస్తానని ప్రతిపాదించింది కూడా. సార్క్ దేశాల అధినేతలు తమ తమ దేశాల్లో వైరస్‌తో పోరాటంలో కలిసి పనిచేయడానికి, తమ అనుభవాలను, తాము సాగిస్తున్న ఉత్తమమైన విధానాలను పరస్పరం పంచుకోవడానికి అంగీకారం తెలిపారు. అంతే కాకుండా కరోనా వైరస్ దీర్ఘకాలంలో కలిగించనున్న ఆర్థిక, సామాజిక ప్రభావాలను ఉపశమింపజేయడానికి కూడా వీరు ఆమోదం తెలిపారు. భారత్ నిజాయితీకి నిదర్శనం భారత్ చేపట్టిన ఈ చొరవ వెనుక తన పొరుగుదేశాలకు అది ఇచ్చిన అప్రకటిత సందేశం చాలా స్పష్టంగా, గంభీరంగా ధ్వనించింది. అంతర్గతంగా కాకుండా బయటి ప్రపంచం నుంచి వచ్చి తమ మీద పడిన ఉత్పాతాలను ఎదుర్కోవడంలో సార్క్ దేశాలకు బాసటగా నిలుస్తానని భారత్ స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సమయంలో భారత్ నిజాయితీని, అది అందించే నిర్ణయాత్మక మద్దతును ఈ చొరవ నొక్కి చెప్పింది. ప్రపంచ శ్రేయస్సును పరిరక్షించడంలో తన వంతు బాధ్యతలను నెరవేర్చడానికి, అదే సమయంలో తనకున్న వనరులు, సమర్థతల పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తన సంసిద్ధత పట్ల కూడా భారత్ ప్రపంచానికి సందేశం ఇచ్చినట్లయింది. విశ్వసనీయత కలిగిన ప్రపంచ శక్తిగా మారడంలో భారత్ నిబద్ధతను తన ఈ చొరవ స్పష్టంగా తెలియచెప్పింది. అదేసమయంలో మరో రెండు అంశాలలో తన వైఫల్యాన్ని కూడా భారత్ పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమైంది. ఒకటి: ఇరుగుపొరుగు దేశాలతో మొదట సఖ్యత సాధించడం అనే విదేశీ విధానాన్ని 2014లో ప్రధాని మోదీ అత్యంత ఉత్సాహంతో చేపట్టారు. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవడాన్ని తిరస్కరిస్తున్న పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడం. సార్క్ స్తంభించిపోవడానికి ఇదే కీలకమైన కారణం. రెండు: సార్క్ సదస్సును పాకిస్తాన్ 2016లో నిర్వహించాల్సి ఉండగా దాంట్లో పాల్గొనడానికి భారత్ తిరస్కరించింది. పాక్‌ను ఒంటరి చేయడంలో వైఫల్యం అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌ను ఒంటరిని చేయలేదు. పాకిస్తాన్‌కు ఇప్పటికీ చైనా సంఘీభావాన్ని తెలుపుతూనే ఉంది. కశ్మీర్ సమస్యను ఇస్లామిక్ దేశాల సంస్థ ఓఐసీ ఎజెండాగా ఉంచాలంటూ పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను సౌదీ అరేబియా ఆమోదించింది. వీటన్నిం టికీ మించి ఆప్ఘనిస్తాన్‌తో సహా అన్ని చోట్లా ఉగ్రవాద సంబంధిత అంశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికీ పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తూనే ఉంది. చివరకు ఇటీవల భారత్ పర్యటన సమయంలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ఆందోళనలకు దూరం జరిగారు. పైగా సీమాంతర ఉగ్రవాదంతో వ్యవహరించే శక్తిసామర్థ్యాలు భారతప్రధాని ఉన్నారని, అమెరికా 8 వేలమైళ్ల దూరంలో ఉన్నందున ఇతర ప్రాంతీయ దేశాలు ఈ అంశంలో భారత్‌కు తగిన సహాయసహకారాలు అందించాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు ట్రంప్. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలోనే ట్రంప్ పాకిస్తాన్ ప్రధానిని బహిరంగంగా ప్రశంసించడం, ప్రాంతీయ శాంతి, సుస్థిరతపై కృషి చేయాలంటూ ట్రంప్ భారత్‌కు పిలువునివ్వడం అనేది చమత్కారంతో కూడిన జిత్తులమారితనం తప్ప మరేమీకాదు. పైగా పాకిస్తాన్‌తో సంభాషించకపోవడం ద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనుకున్న భారత విధానం పట్ల అమెరికా చివాట్లు పెట్టినట్లే లెక్క. పైగా పాకిస్తాన్‌ను సాకుగా చూపుతూ సార్క్‌ను ప్రతిష్టంభనకు గురిచేయడం ఎవరి ప్రయోజనాలనూ నెరవేర్చదని చెప్పాలి. పొరుగుకు ప్రాధాన్యత ఫలిస్తోందా? మరొక అంశం ఏమిటంటే, బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ పేరిట బహుళ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకార వ్యవస్థ (బిమ్స్టెక్)ను నిర్మించడంలో భాగంగా భారత్ పొరుగుకు ప్రాధాన్యత అనే విధానాన్ని ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చింది. ఇది కచ్చితంగా సార్క్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పథకం అనే చెప్పాలి. భారత సముద్ర ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధకతతోసహా పలు రంగాల్లో ఈ బిమ్స్టెక్ను భారత్ క్రియాశీలకంగా ప్రోత్సహిస్తూ, బలోపేతం చేస్తూ వచ్చింది. కానీ ఈ విధానంలోనూ కొన్ని పరిమితులు ఉన్నాయని భారత విధాన నిర్ణేతలు క్రమంగా గ్రహిస్తూ వచ్చారు. ఎందుకంటే థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కూడా చైనాకు సన్నిహితం అయ్యాయి. పైగా నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు కూడా చైనాతో విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమవుతూనే భారత, చైనా మధ్య సమతుల్యతను పాటించే ఎత్తుగడలను అవలంభించడంలో తలమునకలవుతున్నాయి. వీటిలో కొన్ని దేశాలు కోవిడ్–19తో పోరాడటంపై సార్క్ సదస్సు విషయంలో కూడా మృదువుగానే చైనాను రంగంలోకి తీసుకురావడానికి వెనుకాడలేదు. దూరమవుతున్న పొరుగు దేశాలు భారత్–పాకిస్తాన్ మధ్య పెనవేసుకున్న ఈ ద్విబంధనం సార్క్‌కు మాత్రమే హాని చేయడం లేదు. భారత్‌కు సమీపంలో ఉన్న పొరుగుదేశాలు కూడా ప్రాంతీయ సమగ్రతా ప్రతిపాదనల పట్ల చాలా జాగరూకతతో వ్యవహరిస్తున్నాయి. పైగా భారత్‌తో సన్నిహితంగా ఉండటం అంటే మరీ సన్నిహితంగా ఉండటమా అనే అంశాన్ని కూడా ఈ దేశాలు తేల్చుకోలేక పోతున్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ (బీబీఐన్) దేశాల మధ్య ఉప ప్రాంతీయ ప్రోత్సాహక చర్యలు నెమ్మదిగా సాగుతున్న విషయం దీన్నే తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో సార్క్ దేశాల సహకార సమితిని పునరుద్ధరించడం వైపుగా భారత్ సరైన చర్యను చేపట్టింది. ప్రాంతీయ ప్రాజెక్టులలో భాగం కావడానికి తిరస్కరించడం ద్వారా పాకిస్తాన్ తనకు తానే ఒంటరి అయితే కానివ్వండి. భారత ప్రధాని చొరవతో తలపెట్టిన కోవిడ్–19 వీడియో కాన్ఫరెన్స్‌కు దిగువస్థాయి అధికారులతో కూడిన ప్రాతినిధ్య బృందాన్ని పంపించడం ద్వారా పాకిస్తాన్ తన సంకుచిత బుద్ధిని తనకు తానుగా ప్రదర్శించుకుంది. పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ పైగా తగుదునమ్మా అటూ కరోనా వైరస్ నిరోధక చర్యల కోసం తలపెట్టిన ఆ వీడియో కాన్ఫరెన్సులో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తినా ఇతర భాగస్వామ్య దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ఆప్ఘనిస్తాన్ సరిహద్దులను పాకిస్తాన్ మూసివేయడంపై ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని నేరుగా పాకిస్తాన్నే ప్రశ్నిస్తూ ఢిఫెన్స్లో పడేశారు. మరోవైపున ప్రాంతీయ వేదికలపై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించకుండానే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను మరిన్ని బాలాకోట్ ఘటనలు పునరావృతం చేయడం ద్వారా భారత్ శిక్షించవచ్చు. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా చైనా సాగిస్తున్న ప్రాంతీయ వ్యూహాత్మక ఆక్రమణను సవాలు చేయడానికి భారత్ తన పొరుగుకు ప్రాధాన్యతను ఇవ్వడం అనే విధానంలో భాగంగానే సార్క్‌ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: ఎస్డి ముని, ప్రొఫెసర్ ఎమిరేటస్, జేఎన్‌యూ, భారత మాజీ రాయబారి, భారత ప్రభుత్వ ప్రత్యేక దూత -
‘సిద్దంగా ఉండండి.. కానీ భయపడకండి’
న్యూఢిల్లీ : కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. కానీ భయపడకండని ప్రధాని నరేంద్ర మోదీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యుహంపై సార్క్ దేశాలు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘సార్క్ దేశాలలో 150 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రపంచ జనాభాలో ఐదవ వంతు జనాభా మన దేశాల్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. మన ప్రాంతంలోని వైద్య సౌకర్యాలకు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కరోనాను ఎదుర్కొవడానికి మనందరం కలిసి సిద్ధం కావాలి, కలిసి పనిచేయాలి, అలాగే ఉమ్మడిగా విజయం సాధించాలి. కరోనాను ఎదుర్కొవడానికి అనుగుణంగా దేశంలోని వైద్య సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి భారత్ వేగంగా చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం కరోనాను తక్కువగా అంచనా వేయకుండా జాగ్రత్త వహించింది. చాలా యాక్టివ్‌గా వ్యవహరించడంతోపాటు, జనవరి మధ్య భాగంలోనే స్క్రీనింగ్ చేయడం ప్రారంభించాం. కరోనా వైరస్ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలే ముఖ్యం’ అని తెలిపారు. చదవండి : కరోనా: ఇటలీలో రికార్డుస్థాయి మరణాలు 'నేను రావడం లేదు.. మీరు రావద్దు' -
సార్క్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రజల కు ముప్పుగా మారిన కరోనా (కొవిడ్–19) వైరస్‌పై పోరాడేం దుకు సార్క్ దేశాలన్ని కలసి ఉమ్మడి వ్యూహం రూపొందించా లని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రతిపాదించారు. ప్రజలందరి ఆరోగ్యం కోసం సార్క్ దేశాధినేతలందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించుకోవాలని కోరారు. ‘ప్రస్తుతం మన గ్రహం కొవిడ్ –19 వైరస్‌తో పోరాడుతోంది. ప్రభుత్వాలు, ప్రజలు దీన్ని ఎదుర్కొనేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు’అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ప్రధాని పిలుపు భూటాన్, మాల్దీవులు, శ్రీలంక సానుకూలంగా స్పందించాయి. -
ఆగని మాటల తూటాలు
సైన్యం మెరుపుదాడుల తరువాత పాకిస్తాన్, భారత్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఒకవైపు భారత్ ఆరోపిస్తుండగా... మరోవైపు పాకిస్తాన్ ఎదురుదాడికి దిగింది. 13 ఏళ్ల క్రితం కుదుర్చకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని, 2016లో ఏకంగా 90 పర్యాయాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. స్వీయవిధానాలే పాక్‌కు శాపం: ఎంఈఏ బెనాలిం (గోవా): స్వీయ విధానాల కారణంగా పాకిస్తాన్ ఏకాకిగా మారిందని, దీంతో భారత్‌కు ఎటువంటి సంబంధమూ లేదని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన వాతావరణం కొరవడడంతో ఇస్లామాబాద్‌లో ఈ ఏడాది జరగాల్సిన సదస్సులో పాల్గొనకూడదని సార్క్ సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయన్నారు. ‘ఎవరైనా ఒంటరిగా మారారంటే అందుకు కారణం ఆ దేశం అనుసరించే విధానాలే. దాంతో భారత్‌కు ఎటువంటి సంబంధమూ లేదు. ఉగ్రవాదంతో కలుషితమైన వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరపడం సాధ్యం కాదని సభ్య దేశాలు ముక్తకంఠంతో చెప్పాయి’ అని అన్నారు. భారత్ 90సార్లు ఉల్లంఘించింది: పాక్ ఇస్లామాబాద్: 13 ఏళ్లనాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్...90 పర్యాయాలు ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపించింది. ‘2016లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొంభైసార్లు ఉల్లంఘించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగిపోవాలి’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జక్రియా సోమవారం ట్వీటర్లో పేర్కొన్నారు. ‘ప్రాంతీయ శాంతికి భారతదేశమే ప్రధాన అడ్డంకి. పాకిస్తాన్ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం నిందా క్రీడ, ప్రతికూల ప్రకటనల వంటివాటికి పాల్పడుతోంది’ అని ఆరోపించారు. ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఏనాడూ ఉల్లంఘించలేదు. కాల్పుల ఉల్లంఘనలపై ప్రతిసారీ భారత్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది’ అంటూ సమర్థించుకున్నారు. -
పాక్ కొత్త ఎత్తుగడ
సార్క్‌కు పోటీగా మరో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు ఇస్లామాబాద్: సార్క్ దేశాల్లో భారత్ ప్రాభవాన్ని సహించలేకపోతున్న పాక్.. దీనికి పోటీగా గ్రేటర్ సౌత్ ఏసియన్ ఎకనామిక్ అలయన్స్(విశాల దక్షిణాసియా ఆర్థిక కూటమి)ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో చైనా, ఇరాన్‌లతో పాటు మరికొన్ని మధ్య ఆసియా దేశాలను భాగస్వాములను చేయాలనుకుంటోంది. భారత్ కూడా ఈ కూటమిలో చేరవచ్చని పాక్ చెబుతున్నప్పటికీ దీని అసలు ఉద్దేశం మాత్రం భారత్‌ను దెబ్బకొట్టడమే. ప్రస్తుతం న్యూయార్క్‌లో పర్యటిస్తోన్న పాకిస్తాన్ పార్యమెంటరీ బృందం కొత్త కూటమిపై చర్చిస్తున్నట్లు పాకిస్తాక్‌కు చెందిన డాన్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఆ బృందంలో సభ్యుడైన ముషాహిద్ హుస్సేన్ అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాసియా ఆర్థిక కూటమి ఏర్పాటు యత్నాలు నిజమేనని ధ్రువీకరించారు. ఈ కూటమి ఇప్పటికే మనుగడలో ఉన్నప్పటికీ ఆయా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య పరమైన సహకారం లేదని ఆయన చెప్పారు. ఈ కూటమిలోకి భారత్‌ను కూడా ఆహ్వానిస్తున్నామని.. కానీ సార్క్ వల్ల లబ్ధి పొందుతున్నందున వాళ్లు చేరకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. -
పాకిస్థాన్ కొత్త ఎత్తుగడ
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ను దౌత్యపరంగా చావుదెబ్బ కొడుతూ దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) సమావేశాలను బహిష్కరించిన భారత్‌పై అంతకంతకూ ప్రతీకారం తీర్చుకునేలా దాయాది దేశం భారీ ప్రణాళికలు రచిస్తోంది. సార్క్ ఏర్పడిననాటి నుంచీ కూటమిలో ఇండియానే ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించిన పాక్.. సార్క్‌కు పోటీగా 'గ్రేటర్ సౌత్ ఏసియన్ ఎకనామిక్ అలయెన్స్'(విశాల దక్షిణాసియా ఆర్థిక కూటమి)ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఇందులో చైనా, ఇరాన్ లతోపాటు మరికొన్ని మధ్య ఆసియా దేశాలనూ భాగస్వాములు చేయాలనుకుంటోంది. 'భారత్ కూడా ఈ కూటమిలో చేరొచ్చు' అని పైకి చెబుతున్నప్పటికీ 'గ్రేటర్ అలయెన్స్' అసలు ఉద్దేశం ఇండియాను ఇబ్బందిపెట్టడమే! ప్రస్తుతం న్యూయార్క్ లో పర్యటిస్తోన్న పాకిస్థాన్ పార్లమెంటరీ బృందం ఈ మేరకు కొత్త కూటమి విధివిధానాలపై చర్చిస్తున్నట్లు ప్రముఖ పాకిస్థానీ మీడియా సంస్థ బుధవారం ఒక రిపోర్టును ప్రచురించింది. పాకిస్థాన్ పార్లమెంటరీ బృందంలో సభ్యుడైన ముషాహిద్ హుస్సేన్ సయీద్.. మంగళవారం అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ సౌత్ ఏసియా అలయెన్స్ ఏర్పాటు ప్రయత్నాలు నిజమేనని ధృవీకరించారు. 'నిజానికి ఈ కూటమి ఇప్పటికే మనుగడలో ఉన్నప్పటికీ ఆయా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య పరమైన సహకార ఒప్పందాలేవీ లేవు. గ్రేటర్ సౌత్ ఏసియన్ ఎకనామిక్ అలయెన్స్ ఏర్పాటుతో అన్ని సభ్యదేశాలు అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. భారత్ ను కూడా కూటమిలోకి ఆహ్వానిస్తాం.. కానీ వాళ్లు చేరకపోవచ్చు' అని ముషాహిద్ హుస్సేన్ అన్నారు. సార్క్‌లో తన ఆధిపత్యం కొనసాగుతుండగా.. భారత్ కొత్త కూటమిలోకి చేరకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మరి కొద్ది రోజుల్లో (నవంబర్ లో) ఇస్లామాబాద్ వేదికగా జరాగాల్సిఉన్న 19వ సార్క్ సదస్సును బహిష్కరిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన భారత్.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందునే తామీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర సభ్యదేశాలైన బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు సైతం భారత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ పాక్ లో జరగాల్సిన సార్క్ సమావేశాలను బహిష్కరించారు. దీంతో పాక్ దక్షిణాసియాలో ఒంటరైపోయింది. తన మిత్రులైన చైనా, ఇరాన్ లతో గ్రేటర్ అలయెన్స్ ఏర్పాటుచేసి తన మళ్లీ అందరితో కలవాలని పాక్ ప్రయత్నిస్తోంది. కాగా, ఒక్క అఫ్ఘానిస్థాన్ కు తప్ప సార్క్ లోని ఏ దేశానికి ఈ కొత్త కూటమి వల్ల ఎలాంటి ప్రయోజం ఉండదు. కాబట్టి అవేవీ పాక్ కూటమిలో చేరే అవకాశం లేదు. అఫ్ఘానిస్థాన్ ఉన్నదే మధ్య ఆసియాలో కాబట్టి ఆర్థిక ప్రయోజనాల రీత్యా అటువైపు మొగ్గుచూపొచ్చు. అప్పుడు కూడా భారత్ సూచనలమేరకే అఫ్ఘాన్ నడుచుకుంటుందని పాక్ మీడియా రిపోర్టులో పేర్కొన్నారు. -
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే.!
-
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
-
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ సదస్సు నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్ దారిలోనే సాగుతూ బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, భూటాన్ కూడా సార్క్ సదస్సును బహిష్కరించాయి. దీంతో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ దాడి నేపథ్యంలో పాక్‌ను ఎంతమాత్రం ఉపేంక్షించరాదని మోదీ సర్కార్ నిర్ణయించింది. పాక్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు వీలున్న అన్నీ మార్గాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సింధు నది ఒప్పందంపై సమీక్ష నిర్వహించడంతోపాటు పాక్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేయాలని నిర్ణయించింది. తాజాగా సార్క్ సదస్సును బహిష్కరించడం ద్వారా పాకిస్థాన్‌పై భారత్ ప్రాంతీయంగా ఆధిపత్యం సాధించింది. ఈ నిర్ణయం ద్వారా భారత్ దక్కిన సానుకూలతలు ఏమిటంటే.. ప్రాంతీయ సహకారంలోనూ ఉగ్రవాద కోణాన్ని జోడించడం! 'ప్రాంతీయ సహకారం, అనుసంధానత, సంప్రదింపుల విషయంలో భారత్ కట్టుబడి ఉంది. కానీ, ఇది ఉగ్రవాద రహిత వాతావరణంలోనే ముందుకు సాగుతుందని భావిస్తోంది'.. పాక్‌లో 19వ సార్క్ సదస్సును బహిష్కరిస్తూ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన ద్వారా పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం ఒక్క భారత్‌కే కాదు.. దక్షిణాసియా ప్రాంతీయ సహకారానికి పెను ముప్పుగా మారిందనే విషయాన్ని మన దేశం తేల్చిచెప్పింది. ఒకప్పుడు భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చల సందర్భంలోనే ఉగ్రవాద రహిత వాతావరణం ప్రస్తావన వచ్చేది. కానీ ఇప్పుడు ప్రాంతీయ చర్చల్లోనూ ఈ అంశాన్ని ప్రధాన అంశంగా భారత్ ముందుకు తెచ్చింది. పాక్‌ను ఇరుకునపెట్టడంలో భారత్‌కు కొత్త మిత్రులు! పాక్‌ను ప్రాంతీయంగా ఇరుకున పెట్టడంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విజయం సాధించింది. ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారా? లేదా? అన్నది సందేహాస్పదంగా ఉండగానే బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ ముందుకొచ్చి.. తాము ఆ దేశానికి వెళ్లబోమని తేల్చిచెప్పాయి. ఇప్పుడు భారత్ అధికారికంగా చెప్పడంతో బంగ్లా, ఆఫ్గన్‌తో మన పొరుగు దేశం భూటాన్ కూడా జతకలిసి.. పాక్‌కు షాకిచ్చింది. సార్క్ పునరుద్ధరణ! 1985లో దక్షిణాసియాలోని ఎనిమిది సభ్యదేశాలతో ఏర్పాటైన సార్క్‌తో విస్తృత సంబంధాలు కొనసాగించేందుకు ఎన్డీయే సర్కారు తపిస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం అడ్డుపుల్ల వేస్తోంది. సార్క్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కొర్రిలు పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మినహాయించి ఇతర సార్క్ దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడం, పాక్‌ను బ్లాక్ చేసేలా సబ్-రిజినల్ కనెక్టివిటీని పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. రాజకీయంగా కీలకమే! సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ పాకిస్థాన్‌ను నియంత్రించడం గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హామీలపై నిలబడాల్సిన పరిస్థితి ఎన్డీయే ప్రభుత్వానిది. అంతేకాకుండా కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పాక్‌పై కఠినంగా వ్యవహరించక తప్పదు. ఆ సంకేతాలు ఇచ్చే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇక పాకిస్థాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలన్న విధానం కూడా అమలవుతున్నదన్న సంకేతాలను సార్క్ సదస్సు బహిష్కరణ ద్వారా భారత్ ఇచ్చినట్టు అయింది. దీనికితోడు బంగ్లా, ఆఫ్గన్ వ్యవహారాల్లో పాక్ జోక్యాన్ని నివారించి ఆ దేశాలను తనవైపు తిప్పుకోవడంలోనూ అడ్వాంటేజ్ సాధించింది. నిజానికి దక్షిణాసియాలో మిత్రదేశాలు కావాలని పాక్ కోరుకోవడం లేదు. చైనా, అమెరికా, సౌదీ అరేబియలతో దౌత్య సంబంధాలకే ఆ దేశం అధిక ప్రాధాన్యమిస్తోంది. అయినా సార్క్ సదస్సును నిర్వహించే అవకాశాన్ని పాక్ కోల్పోవడం నిజంగా ఆ దేశానికి నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
'హవ్వా.. అణుదాడులేంటి.. పాక్ ఉగ్ర దేశమే'
న్యూఢిల్లీ: భారత్ నేరుగా పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశం అని ప్రస్తావించడంతో మరో దేశం పాక్ ను ఉగ్రవాద దేశమంటూ ప్రత్యక్షంగా సంబోధించింది. భారత్ తో తన గొంతు కలిపింది. ఐక్యరాజ్య సమితి పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిందేనంటూ బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ మువాజెమ్ అలీ డిమాండ్ చేశారు. భారతదేశంలో బంగ్లాదేశ్ తరుపున హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న ఆయన నేరుగా ఈ ప్రకటన చేశారు. 'తొలిసారి సార్క్ సభ్యత్వ దేశాల్లో సగం దేశాలు ఇస్లామాబాద్ లో నిర్వహించే దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) శిఖరాగ్ర సదస్సును బహిష్కరించాలని నిర్ణయించాయి. ఇదే బలమైన సందేశం' అని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ భవిష్యత్తులో విదేశాంగ విధానం ఎలా కొనసాగిస్తుందో చూడాలని చెప్పారు. బంగ్లాదేశ్ లోని ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసే చర్యలను ఇప్పటికైనా పాక్ ఆపేయాలని మండిపడ్డారు. అణుదాడులు చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఎం అసిఫ్ నేరుగా బెదిరిస్తున్న ప్రాంతంలో ఎలా సమావేశం నిర్వహిస్తారోనని తనకు ఆయన ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. సార్క్ సమావేశానికి ఏ విధమైన వాతావరణం ఉందో ఆ మంత్రి సందేశం తెలియజేస్తుంది. యుద్ధం, అణుదాడులు వంటివి మాట్లాడకూడదు' అని అలీ వివరించారు. -
పాక్‌పై వేటుకు భారత్‌కు తోడుగా మరిన్ని దేశాలు
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను ఒంటరి చేయాలన్న భారత్ ప్రయత్నంలో తొలి అడుగుపడింది. త్వరలో ఇస్లామాబాద్ లో జరగనున్న సార్క్ సమావేశానికి హాజరవడం లేదని ఇప్పటికే భారత్, అప్ఘనిస్థాన్ స్పష్టం చేయగా అదే వరుసలో ఇప్పుడు మరో రెండు దేశాలు చేరనున్నాయి. తాము కూడా సార్క్ సమావేశాలకు వెళ్లడం లేదని బంగ్లాదేశ్ ప్రకటించినట్లు అధికార వర్గాల సమాచారం. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ పదేపదే జోక్యం చేసుకుంటుందని, తమ నిరసన తెలియజేసేందుకు ఇదే తగిన సమయం అని పేర్కొంటూ ఆ దేశం సార్క్ సమావేశానికి హాజరుకావడం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో దక్షిణాసియా దేశాలకు తాము ఎప్పటికీ సహకరిస్తుంటామని ఒక ప్రకటనగా చెప్పింది. ఇదే బాటలో భూటాన్ నిలిచింది. కొన్ని సార్క్ దేశాలు ఇప్పుడు ప్రాంతీయ ప్రశాంతతను, భద్రతను ఉగ్రవాదం కారణంగా కోల్పోతున్నాయని భూటాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్రాంతంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతుండంతోపాటు సార్క్ లో సభ్యత్వం ఉన్న కొన్నిదేశాల్లో శాంతియుత వాతావరణాన్ని ఉగ్రవాదం చెడగొడుతున్న కారణంగా తాము కూడా ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారికంగా వారు బంగ్లాదేశ్, భూటాన్ లేఖలు కూడా పంపించినట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో పాకిస్థాన్ పిల్లిమొగ్గలు!
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ న్యూఢిల్లీలో పిల్లిమొగ్గలు వేసేందుకు ప్రయత్నించింది. ఢిల్లీలో జరుగుతున్న సార్క్ సదస్సుకు కేవలం జూనియర్ స్థాయి అధికారులను పంపించి.. భారత్‌ను చిన్నబుచ్చే ప్రయత్నం చేసింది. 18 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యపరంగా ఏకాకిని చేయాలని భారత్ నిర్ణయించడంతోపాటు, ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకునే దిశగా సాగుతున్న నేపథ్యంలో పాక్ ఈ చర్యకు పాల్పడింది. దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో సార్క్‌కు చెందిన అత్యున్నత నిపుణుల బృందం ఢిల్లీలో రెండురోజుల సదస్సు నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు పాకిస్థాన్ సీనియర్ దౌత్యవేత్తలను కాకుండా కౌన్సెలర్ స్థాయి జూనియర్ అధికారులను పంపించి ఈ సదస్సుకు పెద్దగా ప్రాధాన్యం లేదన్నట్టు వ్యవహరించింది. సార్క్ సదస్సును అవమానించేలా పాకిస్థాన్ తీరు ఉండటం గమనార్హం. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్)లో భారత్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మల్దీవులు సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ దినేశ్వర్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు పాకిస్థాన్ మినహా అన్ని దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను పంపించాయి. పాక్ నుంచి ఈ సదస్సుకు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ స్థాయి అధికారి హాజరుకావాల్సి ఉండగా ఇద్దరు జూనియర్లను ఆ స్థానంలో పంపించి.. దురుసుగా వ్యవహరించింది. సార్క్ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక యంత్రాంగం ఏమేరకు పనిచేస్తున్నదో సమీక్షించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
‘సహకారం’లేని సార్క్
సాధారణంగా దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్)వంటి సంస్థ లకు సంబంధించి శిఖరాగ్ర సదస్సులకు తప్ప మంత్రుల స్థాయి సమావేశా లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. శిఖరాగ్ర సదస్సుల్లో తీసుకునే ప్రధాన నిర్ణయాలకు కొనసాగింపుగా లేదా అలాంటి సదస్సులకు అవసరమైన ప్రాతిపది కలను ఖరారు చేయడానికి వీటిని నిర్వహించడమే ఇందుకు కారణం. కానీ ఇస్లామా బాద్‌లో గురువారం జరిగిన సార్క్ హోంమంత్రుల ఒక రోజు సదస్సు చుట్టూ మాత్రం చాలా హడావుడి చోటు చేసుకుంది. మన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సదస్సునుద్దేశించి మాట్లాడిన ప్రసంగం ప్రసారాన్ని పాకిస్తాన్ నిలిపేసిందని వచ్చిన వార్త కాసేపు సంచలనం సృష్టించింది. ‘పిరికి పాకిస్తాన్ రాజ్‌నాథ్ ఉపన్యా సాన్ని బ్లాకవుట్ చేసింద’ని చానెళ్లు చాలాసేపు హడావుడి చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహ సందేశాలు వెల్లువెత్తాయి. సార్క్ సమావేశాల్లో ఆతిథ్య దేశం తరఫున చేసే ప్రసంగాన్ని మినహా మిగిలిన కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచటం మొదటినుంచీ పాటిస్తున్న సంప్రదాయమని మన విదేశాంగ శాఖ ప్రతి నిధి వివరణనిచ్చాక ఇదంతా సద్దుమణిగింది. అయితే ఇలాంటి అపోహలు తలెత్త డానికి ప్రధాన బాధ్యత పాకిస్తాన్‌దే. సదస్సు విశేషాలను అందించేందుకు వెళ్లాలను కున్న మన పాత్రికేయులకు ఆ దేశం అనుమతి నిరాకరించడం వల్లనే ఈ స్థితి ఏర్ప డింది. భారత్‌నుంచి పాత్రికేయులు రాకూడదనుకుంటే సార్క్ సమావేశాలను వేరే దేశంలో జరుపుకుందామని పాక్ ప్రతిపాదించాల్సింది. ఒకపక్క సమావేశాల నిర్వహణకు అంగీకరించి, మీడియాపై మాత్రం ఆంక్షలు విధిస్తామనడం దేనికి సంకేతం? వాస్తవానికి సభ్య దేశాల మధ్య మరింత సమన్వయాన్ని, సహకారాన్ని పెం పొందించేందుకు...వాటిమధ్య అపోహలను, ఉద్రిక్తతలను తొలగించేందుకు ఇలాంటి సమావేశాలు దోహదపడాలి. 1985లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక తదితర ఏడు దేశాలు సభ్యులుగా అవతరించిన సార్క్‌లో ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ చేరింది. అమెరికా, యూరపియన్ యూనియన్(ఈయూ), జపాన్, చైనావంటివి పరిశీలక తీసుకున్నాయి. సార్క్ ప్రాంత దేశాల్లో ప్రపంచంలోని నాలుగోవంతు జనాభా నివ సిస్తోంది. సహజ వనరులకు లోటే లేదు. వీటిమధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందితే ఈ దేశాల రూపురేఖలే మారిపోతాయి. ఆర్ధికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. వీటిని పట్టిపీడిస్తున్న దారిద్య్రం, నిరుద్యోగం, శిశుమరణాలు చిత్తగిస్తాయి. పిల్లల, మహిళల అక్రమ తరలింపులు అంతమవుతాయి. ఉగ్రవాద బెడద, మాదకద్రవ్యాల రవాణా, నకిలీ కరెన్సీ ప్రవాహం ఆగుతాయి. ప్రజల జీవనప్రమాణాలు పెరుగు తాయి. కానీ సార్క్ దురదృష్టమేమోగానీ అది మొదలయిననాటినుంచీ సమావే శాలు నిర్వహించుకోవడం, తీర్మానాలు చేసుకోవడమే తప్ప ఆచరణ అంతంత మాత్రమే. ఈ దేశాలమధ్య పరస్పర అనుమానాలు, అపనమ్మకాలు ఉన్నమాట వాస్తవమే అయినా...వాటన్నిటినీ మించి భారత్-పాక్‌ల మధ్య తరచు తలెత్తే వివాదాలు, ఉద్రిక్తతలు మొత్తంగా సార్క్ నడతను నిర్దేశిస్తున్నాయని చెప్పాలి. ఈ రెండు దేశాలమధ్యా ఏదో మేరకు సుహృద్భావ వాతావరణం ఏర్పడితేనే ఇదంతా సర్దుకుంటుందన్న భావన అందరిలో ఏర్పడింది. సార్క్ ఏర్పడేనాటితో పోలిస్తే కశ్మీర్ సమస్య మరింత ఉగ్రరూపం దాల్చింది. కశ్మీర్ కోసం పోరాటమనే పేరుతో పాక్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు ఇస్తోంది. చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ద్వైపాక్షిక సమస్యలను ఇలాంటి ప్రాంతీయ వేదికలపై ప్రస్తావించరాదన్న నియమాన్ని గతంలో చాలాసార్లు ఉల్లంఘించినా ఈసారి మాత్రం పాక్ దాన్ని పాటించింది. కాకపోతే దాన్ని పరోక్షంగా ప్రస్తావించింది. భారత్‌కూడా ఆ దోవ లోనే జవాబిచ్చింది. సంఘటిత నేరాలనూ, ఉగ్రవాదాన్ని, అవినీతిని ఈ ప్రాంతం నుంచి పారదోలేందుకు మిగిలిన సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ప్రారంభోప న్యాసంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పినా...ఆ తర్వాత మాట్లాడిన ఆ దేశ హోంమంత్రి చౌధ్రి నిసార్ ‘అమాయకులైన పిల్లలను చిత్రహింసలకు గురిచేయడం, పౌరులపై హింసకు పూనుకోవడం ఉగ్రవాదం కిందకే వస్తుంద’ని చెప్పారు. ‘తీవ్ర వాద మనస్తత్వాన్ని విడనాడి ప్రాంతీయ సమస్యలను చర్చలతో పరిష్కరించాల’ని హితవు కూడా పలికారు. ఇదంతా ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ అనంతర పరిణామాలపైనే అన్నది సుస్పష్టం. కనుకే రాజ్‌నాథ్ కూడా ఉగ్రవాదుల్ని అమరవీ రులుగా చిత్రించే ధోరణిని వదులుకోవాలని తెలిపారు. అంతేకాదు...ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతోపాటు వారికి ప్రోత్సాహాన్నందించే వ్యక్తులు, సంస్థలు, దేశా లపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం అవసరమన్నారు. ఉగ్రవాదంపై ఉన్న అంత ర్జాతీయ ఒడంబడికలను గౌరవిద్దామన్నారు. ఇరు దేశాల హోంమంత్రుల మధ్య మర్యాదపూర్వక చర్చలు లేవు. నిసార్ ఇచ్చిన విందుకు రాజ్‌నాథ్ హాజరుకాలేదు. షరీఫ్‌తోనూ విడిగా సమావేశం లేదు. ఇరు దేశాలమధ్యా పరిష్కరించుకోవలసిన అంశాలు ఎన్నో ఉండగా ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఎంత దురదృష్టకరం! రెండేళ్లక్రితం నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి మిగిలిన సార్క్ దేశాల అధినేతలతోపాటు నవాజ్ షరీఫ్ కూడా వచ్చారు. నిరుడు డిసెంబర్లో మోదీ రష్యా పర్యటన ముగించుకుని అఫ్ఘాన్ వెళ్లి అక్కడినుంచి తిరిగొస్తూ పాక్‌లో అడుగు పెట్టారు. అందరినీ సంభ్రమాశ్చర్యపరిచారు. అయినా పాక్‌తో సంబంధాలు అం తంతమాత్రంగానే మిగిలాయి. ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్‌లో వైమానిక దళ కేంద్రంపై ఉగ్రవాదుల దాడి ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించి సాక్ష్యాలిచ్చినా పాక్ స్పందన నామమాత్రం. అయితే ఇలాంటి సమస్యల కార ణంగా ఆ దేశంతో చర్చలకు తలుపులు మూసేయాలనడం సరిగాదు. సమస్యలు న్నాయి గనుకే చర్చల అవసరం మరింత ఉంటుంది. ఆ దేశం అనుసరిస్తున్న ధోరణులను ప్రపంచానికి వెల్లడించేందుకు అది దోహదపడుతుంది. పాక్‌లాంటి మొండి ఘటాన్ని దోవకు తీసుకురావడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. -
నేపాల్ చేరుకున్న సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ : సార్క్ సమావేశాల కోసం భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం నేపాల్ చేరుకున్నారు. రేపటి నుంచి నేపాల్ లో జరగనున్న విదేశాంగ మంత్రుల స్థాయి సార్క్ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. సుష్మా నేపాల్ లోని పొఖారా చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ట్వీట్ లో తెలిపారు. మరోవైపు సార్క్ సమావేశాల సందర్భంలో పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సుష్మాస్వరాజ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని పాకిస్తానీ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి కారణంగా వాయిదాపడిన ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలపై సుష్మా, అజీజ్ లు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
షరీఫ్‌తో మోడీ భేటీ లేదు
కాట్మాండ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య ప్రస్తుతానికి ఎలాంటి భేటీ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ బుధవారం నేపాల్ రాజధాని కాట్మాండ్‌లో స్పష్టం చేశారు. ఇరు దేశాల నేతల మధ్య భేటీకి ఇప్పటి వరకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు. 18వ సార్క్ సమావేశాలు కాట్మాండ్‌లో ఈ రోజు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ దేశాల ప్రధానులతోపాటు మరో ఆరు దేశాధినేతలు ఈ సమావేశాలకు హాజరయ్యరు. దీంతో భారత్, పాక్ నేతలు ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించే అవకాశం ఉందా అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సయ్యద్ అక్బరుద్దీన్‌పై విధంగా స్పందించారు. ఇటీవల కాలంలో భారత్‌పై పాకిస్థాన్ తరచుగా కాల్పులకు తెగబడుతు గతంలో ఇరుదేశాలు మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇరుదేశాల ప్రధానులు సార్క్ సమావేశాలలో భాగంగా భేటీ అయి చర్చించ వచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్: సుష్మాస్వరాజ్
కఠ్మాండు: దక్షిణాసియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఉగ్ర భూతాన్ని తరిమికొట్టేందుకు సార్క్ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే దక్షిణాసియా మరింత శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లేందుకు సంస్కతి, వాణిజ్యం, దేశాల మధ్య అనుసంధానం కీలకమన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో మంగళవారం జరిగిన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మ ప్రసంగించారు. అఫ్ఘానిస్థాన్‌లో రెండు రోజుల కిందట వాలీబాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 50 మందికిపైగా హతమార్చడాన్ని ఆమె గుర్తు చేశారు. దక్షిణాసియాకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ అని ఈ ఘటన మరోసారి నిరూపించిందన్నారు. ఉగ్రవాద సమస్యను అధిగమించేందుకు సభ్య దేశాల మధ్య సమష్టి కృషి అవసరమన్నారు. అలాగే ఆర్థిక వృద్ధిరేటును పెంచేందుకు సభ్య దేశాల మధ్య రోడ్డు, రైల్వే, విమాన సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌లోని తమ ప్రభుత్వం 'అందరితో కలసి, అందరి అభివద్ధి' అనే నినాదంతో ముందుకు వెళ్తోందని చెప్పారు. సార్క్ దేశాల ప్రాంతీయ ఏకీకరణకు కూడా ఇదే తమ దేశ విధానమని సుష్మా అన్నారు. ఇదిలా ఉండగా, ఈ సమావేశం సందర్భంగా విదేశీ వ్యవహరాలు, జాతీయ భద్రతకు సంబంధించి పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్‌ను సుష్మాస్వరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ** -
ఉగ్రవాదంతో దక్షిణాసియాకు సవాళ్లు!
కఠ్మాండు: అఫ్ఘానిస్థాన్ నుంచి విదేశీ బలగాలు వైదొలగిన తర్వాత దక్షిణాసియాకు ఉగ్రవాదులనుంచి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. ఉగ్రవాదుల బెడదను అరికట్టేందుకు కొత్త వ్యూహాలు రూపొందించుకోవలసిదిగా దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) సభ్య దేశాలకు సూచించింది. నేపాల్ రాజ ధాని కఠ్మాండులో శుక్రవారం సార్క్ అంతర్గత వ్యవహారాల, హోం మంత్రుల ఆరవ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అప్ఘానిస్థాన్‌నుంచి విదేశీ సేనలు వైదొలగడంతో దక్షిణాసియాకు ఎదురయ్యే ఉగ్రవాదం బెడదను దక్షిణాసియా దేశాలు జాగ్రత్తగా అంచనా వేయాలన్నారు. ఉగ్రవాదాన్ని, హింసాకాండను రెచ్చగొట్టే వ్యక్తులు, సంస్థలు, ప్రచురణల విషయంలో కఠినమైన శిక్షలు విధించేందుకు అనుగుణంగా దక్షిణాసియా దేశాలన్నీ తగిన చట్టాలు చేయాలన్నారు. ప్రజల సంక్షేమంకోసం కలసికట్టుగా పనిచేయడమే తొలి ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని, హిమాలయాల్లోని రెండు పొరుగుదేశాల్లో ఆయన తొలిపర్యటన జరిపారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. -
మూడు రోజుల్లో లెసైన్స్
హైదరాబాద్, బిజినె స్ బ్యూరో: వ్యాపార లెసైన్సును మూడు రోజుల్లో జారీ చేస్తామని భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి శైదా మొహమ్మద్ అబ్దాలి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వ్యాపార అవకాశాలు అన్న అంశంపై సీఐఐ ఆధ్వర్యంలో గురువారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తయారీ, నిర్మాణ, వ్యవసాయం, గనులు, ఎగుమతులు తమకు ప్రాధాన్య రంగాలని వివరించారు. పన్ను విరామం, దీర్ఘకాలిక లీజుపై స్థల కేటాయింపు, పన్ను మినహాయింపులు వంటి ప్రయోజనాలను కల్పిస్తామన్నారు. పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. ‘సీమాంతర ఉగ్రవాదం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ బాధిత దేశమైంది. మూడు దశాబ్దాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రస్తుతం భద్రత విషయంలో పరిస్థితులు మెరుగు పడ్డాయి. ఇందుకు ఇటీవల ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలే నిదర్శనం’ అని తెలిపారు. 3 ట్రిలియన్ల కంటే.. భారత్‌కు చెందిన 100 కంపెనీలు మాత్రమే అఫ్గనిస్తాన్‌లో అడుగు పెట్టాయి. ఈ సంఖ్య అతి స్వల్పం అని శైదా మొహమ్మద్ అబ్దాలి అన్నారు. ఖనిజ నిక్షేపాల విలువ 3 ట్రిలియన్ల కంటే అధిక ంగా ఉంటుందని చెప్పారు. కొత్తగా 18,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయి. 80 లక్షల టన్నుల సిమెంటును పొరుగు దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. వైద్యం కోసం మా దేశం నుంచి భారత్‌కు వెళ్తున్నారు. నిల్వ సామర్థ్యం లేక ఆహారోత్పత్తులు వృధా అవుతున్నాయి. సరిపడ పాఠశాలలు, కళాశాలలు లేవు. దేశప్రజలందరికీ ఎలక్ట్రానిక్ ఐడీ కార్డులు ఇవ్వబోతున్నాం. 3జీ, ఇంటర్నెట్ విషయంలో 5 ఏళ్ల ప్రణాళిక ఉంది. విమానయాన సేవలు విస్తరించనున్నాం. అవకాశాలు అందుకోవడమే తరువాయి’ అని పారిశ్రామికవేత్తలను ఉద్ధేశించి అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన చొరవ కారణంగా సార్క్ దేశాల మధ్య మైత్రి బలపడుతుందని అన్నారు. పోర్టు విస్తరణతో.. భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ.3,600 కోట్లుంది. రూ.600 కోట్ల వ్యయంతో చేపడుతున్న చాబహార్ నౌకాశ్రయం విస్తరణ ప్రాజెక్టు పూర్తి అయితే కొన్నేళ్లలో ఈ విలువ రూ.18 వేల కోట్లను మించుతుందని చెప్పారు. భారత్‌తో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యామని పేర్కొన్నారు. తుర్క్మెనిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్-ఇండియా పైప్‌లైన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని భద్రతా సమస్యల కారణంగా ఆఫ్ఘనిస్తాన్- భారత్‌ల మధ్య సరుకు రవాణా ప్రభావితమవుతోందని వివరించారు. -
ఇస్రో విజయాలు జాతికి గర్వకారణం
ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంస ► సార్క్‌కు ఉపగ్రహాన్ని నిర్మిద్దాం ► అంతరిక్ష పరిజ్ఞానం ఫలాలు పొరుగు దేశాలకు అందిద్దాం ► అంతరిక్ష ప్రయోగాలతో సామాన్యుడి జీవితాన్ని మార్చొచ్చు శ్రీహరికోట నుంచి సాక్షి ప్రతినిధి: స్వశక్తితో అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసుకున్న భారతదేశం మున్ముందు మరిన్ని ఎత్తులు అందుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. పేదరికం, ఉపాధి అవకాశాలు, ఆహార భద్రతలపై పోరాడుతున్న ఇరుగుపొరుగు దేశాలకు కూడా అంతరిక్ష పరిజ్ఞానం ఫలాలను అందించేందుకు ‘సార్క్’ ఉపగ్రహాన్ని నిర్మించాలని ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. సార్క్ సభ్యదేశాలకు భారత్ అందించే అతిగొప్ప కానుక ఇదే అవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగం విజయవంతమైన తర్వాత శ్రీహరికోటలోని షార్‌లో మిషన్ కంట్రోల్ రూం నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇచ్చిన స్ఫూర్తితో చందమామపైకి ఉపగ్రహాన్ని పంపగలిగామని గుర్తుచేశారు. ఇటీవల మార్స్ గురించి తీసిన హాలీవుడ్ సినిమా ‘గ్రావిటీ’కి అయిన ఖర్చు కంటే మనం ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు పెట్టిన ఖర్చు చాలా తక్కువేనని ప్రధాని చతురోక్తులు విసిరారు. అంగారకుడిపైకి ప్రయోగించిన ఉపగ్రహం కొన్ని నెలల్లోనే అక్కడికి చేరుకోబోతోందని చెప్పారు. ఈ ప్రయోగాల విజయాలతో భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దాదాపు 26 నిమిషాల పాటు సాగిన ప్రధాని ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కొంతసేపు ఇంగ్లిష్, మరికొంతసేపు హిందీలో ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఉపనిషత్ల నుంచి ఉపగ్రహాల దాకా... ‘‘సైకిల్ మీద రాకెట్‌ను తీసుకెళ్లి ప్రయోగించే స్థాయి నుంచి ప్రారంభమైన మన అంతరిక్ష ప్రయోగాలు వాణిజ్యపరంగా విజయాలు అందించే స్థాయికి చేరడం భారత జాతికే గర్వకారణం. భారతీయ సంస్కృతిలో అంతరిక్షంపై, గ్రహగతులపై లోతైన అవగాహన ఉంది. అందువల్లనే ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకూ దేశం ప్రస్థానం విజయవంతంగా సాగింది. ఈ దేశం వేల ఏళ్ల కిందటే ‘సున్నా’ను ప్రపంచానికి అందించింది. అదే లేకపోతే ప్రస్తుత విజ్ఞానం, ప్రగతి సాధ్యమయ్యే ప్రశ్నే ఉండేది కాదు. ఐదు దశాబ్దాల చరిత్రలో ఇస్రో వంద మైలురాళ్లను దాటి 71 ఉపగ్రహాలు, 43 ప్రయోగాలు కలిపి 114 ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. సామాన్యుడి జీవితాన్ని మార్చే శక్తి ఉంది... అంతరిక్ష రంగం సమాజంలోని ఉన్నత వర్గాల వారికోసమే అన్న అపోహ కొందరిలో ఉంది. కానీ ఈ రంగానికి సామాన్యుడి జీవితాన్ని మార్చే శక్తి ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. జీఐఎస్ టెక్నాలజీ, స్పేస్ ఇమేజరీల ద్వారా మారుమూల కారడవుల్లో ఉన్న వారికి కూడా విద్య, వైద్యం అందించే అవకాశమేర్పడింది. భూ రికార్డులకూ స్పేస్ టెక్నాలజీ ఇస్రో శాస్త్రవేత్తలు జీపీఎస్ తరహాలో భారతీయ నావిగేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. మనె ఏడాది లోపు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి దేశంలోని భూమి తాలూకు రికార్డులన్నింటినీ స్పేస్ టెక్నాలజీ ద్వారానే సిద్ధం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి. మానవ వనరుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని యువతను అంతరిక్ష రంగంవైపు ఆకర్షితులను చేసేందుకు తగిన కార్యక్రమాలు రూపొందించాలి. ఇందుకోసం ఇంటరాక్టివ్ డిజిటల్ స్పేస్ మ్యూజియాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలి’’ అని ప్రధాని తన ప్రసంగంలో సూచనలు చేశారు. శాస్త్రవేత్తలతో ఉత్సాహంగా.... ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరంకంట్రోల్ రూమ్‌లోని శాస్త్రవేత్తలను కలసి ముచ్చటించారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సీనియర్ శాస్త్రవేత్తలను ఒకొక్కరిని పరిచయం చేయగా ప్రధాని వారితో కరచాలనం చేస్తూ నవ్వుతూ పలుకరించారు. పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం సాయంత్రమే షార్కు చేరుకున్న ప్రధాని స్పేస్ టెక్నాలజీపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. రాత్రి 7:15 గంటల నుంచి షార్‌లోని పలు విభాగాలను సందర్శించి విశేషాలు తెలుసుకున్నారు. మొదట ప్రయోగవేదికపై నింగిలోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ సీ23, రెండో ప్రయోగ వేదికపై అనుసంధాన దశలో ఉన్న జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌తో పాటు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను పరిశీలించారు. ప్రయోగం పూర్తయ్యాక చెన్నైకి రాకెట్ ప్రయోగం ముగిసిన తర్వాత ఉదయం 10.30 గంటలకు నేరుగా హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన ఆయన హెలికాప్టర్లో చెన్నైకి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబుు, ఇస్రో రాధాకృష్ణన్, షార్ డెరైక్టర్ డాక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్‌లు వీడ్కోలు పలికారు. -
మళ్లీ స్నేహ వీచిక!
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే పనిలోకి దిగిపోయారు నరేంద్ర మోడీ. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన సార్క్ దేశాల అధినేతలతో చర్చల పరంపర కొనసాగించి కొత్త సంప్రదాయానికి శ్రీకారంచుట్టారు. అయితే, వీరందరిలోనూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఆయన జరిపిన భేటీకి సహజంగానే ఎనలేని ప్రాముఖ్యత వచ్చింది. ఇతర దేశాలతో ఎలాంటి సమస్యలున్నా, వాటి పరిష్కారానికి మన ప్రభుత్వం ఏంచేస్తున్నా పెద్దగా పట్టనివారికి కూడా పాకిస్థాన్‌తో సంబంధాల విషయమై అంతటి ఆసక్తి ఉండటానికి కారణం... అది మన దాయాది దేశం కావడమే. పాకిస్థాన్‌తో మన సంబంధాలు నిలకడగా, ఒకేలా ఎప్పుడూ లేవు. ఎప్పుడూ ఆటుపోట్లే. ఆశారేఖ తళుక్కున మెరిసిన ఉత్తర క్షణంలోనే అధీనరేఖ వద్ద ఏదో ఒక ఘర్షణ లేదా చొరబాట్లు. ఈ రెండూ లేకపోతే జమ్మూ-కాశ్మీర్లో మిలిటెంట్ల దాడులు. మళ్లీ పరస్పర ఆరోపణలు, హెచ్చరికలు. కొన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ చర్చల పేరిట ఏదో కదలిక. మళ్లీ కొత్త ఆశలు...చెలిమి ఊసులు. అటు తర్వాత షరా మామూలే. గత ఆరు దశాబ్దాలనుంచీ ఇదే పదే పదే పునరావృత మవుతున్నది. అయితే, ఈ స్థితి మారగలదని, రెండు దేశాలూ వైషమ్యాలను విడనాడి కలసి ముందుకు సాగడానికి, ఎదగడానికి సమష్టిగా ప్రయత్నిస్తాయని ఇరు దేశాల్లోని శాంతి కాముకులు విశ్వసిస్తూనే ఉన్నారు. అలాంటివారి విశ్వాసాన్ని పెంచేలా మోడీ తొలి అడుగులున్నాయి. ఇరుగుపొరుగుతో, ముఖ్యంగా పాకిస్థాన్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి తాము కృషి చేస్తామన్న సందేశాన్ని దేశ ప్రజలకే కాదు...ప్రపంచానికి కూడా చాటిచెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు. కనుకనే ప్రమాణ స్వీకారోత్సవాన్ని మోడీ ఇందుకు ఒక సందర్భంగా ఉపయోగించుకున్నారు. భారత్‌లో అడుగుపెడుతూ తాను శాంతి సందేశంతో వచ్చానని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. 1999లో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇరుదేశాల మధ్యా మెరుగైన సంబంధాలున్నాయని, ప్రస్తుత ప్రధాని మోడీ కూడా బీజేపీకి చెందినవారే కావడంవల్ల మళ్లీ ఆనాటి స్థితి ఏర్పడవచ్చునని ఆయన అంచనావేశారు. అయితే, వాజపేయి నెరపిన బస్సు దౌత్యం తర్వాతే కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి వగైరా జరిగాయన్న సంగతిని ఎవరూ మరిచిపోలేరు. ఇరుప్రాంతాల్లోనూ పరస్పర విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులు ఉన్నాయి. మోడీ ఆహ్వానాన్ని నవాజ్ షరీఫ్ అంగీకరించడానికి వీల్లేదంటూ లష్కరే తొయిబావంటి సంస్థలు డిమాండ్ చేయడం, కొన్ని సంస్థలైతే ఢిల్లీకి వెళ్లి మళ్లీ తిరిగి రావొద్దని హెచ్చరించడం అందులో భాగమే. అయితే, పాకిస్థాన్‌తో వచ్చిన సమస్యేమంటే ఇలాంటి శక్తులు అక్కడి సైన్యంలోనూ, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐలోనూ పుష్కలంగా ఉన్నాయి. పలు ఉగ్రవాద సంస్థలు వారి చెప్పుచేతల్లో నడుస్తాయి. సాధారణ సంబంధాలు ఏర్పడతాయని ఆశించిన ప్రతిసారీ శాంతిని భగ్నంచేసేలా సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకోవడం ఇందువల్లే. అక్కడి సైన్యం రాజకీయ నాయకత్వానికి లోబడి కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని చూస్తుంటుంది. భారత్‌తో సంబంధాల విషయమై తన మాటే నెగ్గాలనుకుంటుంది. ఇది ఇరు దేశాల సంబంధాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. నిరుడు పాక్‌లో నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక న్యూయార్క్‌లో ఇరు దేశాల ప్రధానులమధ్యా చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడటానికి సమష్టిగా కృషిచేద్దామని ఆ చర్చల్లో నిర్ణయించారు. అధీనరేఖ వద్ద కాల్పుల విరమణ కొనసాగించడానికి, శాంతి నెలకొల్పడానికి ఏం చేయాలో తేల్చడానికి ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్స్ (డీజీఎంఓలు) సమావేశంకావాలని నిర్ణయించారు. కానీ, అలాంటి సమావేశం జరిగేలోపే పాక్ భూభాగం వైపునుంచి చొచ్చుకొచ్చిన మిలిటెంట్లు రెండుచోట్ల దాడిచేసి నలుగురు జవాన్లతోసహా 12మందిని కాల్చిచంపారు. సహజంగానే ఇరుదేశాల సంబంధాలూ మళ్లీ మొదటికొచ్చాయి. పాకిస్థాన్‌తో గతంలో ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నందువల్లే ఇప్పుడు జరిగిన చర్చలపై పెదవి విరుస్తున్నవారున్నారు. అయితే, ఇరుగుపొరుగు దేశాలన్నాక ఇలాంటి సమస్యలు తప్పవు. వాటి పరిష్కారానికి వివిధ మార్గాల్లో ఓపిగ్గా కృషి చేయడమే పరిష్కారం తప్ప అవి మరింతగా విషమించేలా వ్యవహరించకూడదు. ఆ కోణంలోనుంచి చూస్తే ఇప్పుడు జరిగిన చర్చలు వెనువెంటనే ఫలితాన్నివ్వకపోయినా ఆ దిశగా ఎంతో కొంత ముందడుగు అవుతాయని చెప్పవచ్చు. సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోవాలని, అధీనరేఖ వద్ద ఘర్షణల అంతానికి కృషిచేయాలని, ముంబై దాడులకు బాధ్యులైన వారిపై సాగుతున్న విచారణ ఒక కొలిక్కివచ్చేలా చూడాలని షరీఫ్‌కు మోడీ సూచించారంటున్నారు. పాకిస్థాన్ తన వంతుగా కాశ్మీర్‌తో సహా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటిపైనా చర్చలు సాగాలని కోరినట్టు తెలుస్తున్నది. ఇందుకోసమని ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులు త్వరలోనే సమావేశం కావాలని కూడా ప్రధానులిద్దరూ నిర్ణయించారు. ఈ సమావేశం స్ఫూర్తితో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు, ముఖ్యంగా వాణిజ్యబంధానికి కృషిచేద్దామని షరీఫ్ అంటున్నారు. రెండు దేశాల సంబంధాలకూ ముఖ్య అవరోధంగా ఉన్నది ఉగ్రవాదమే. దీన్ని అరికట్టడానికి షరీఫ్ చిత్తశుద్ధితో కృషిచేస్తే మిగిలిన సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. రెండు దేశాల ప్రగతికీ బాటలు పరుస్తాయి. ఇరుదేశాల సంబంధాల్లోనూ నూతనాధ్యాయం ఆవిష్కృత మవుతుంది. రాగలరోజుల్లో పాకిస్థాన్ దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తుందని ఆశిద్దాం. -
మోడీని కలిసిన విదేశీ ప్రముఖులు
-
మోడీ ప్రమాణస్వీకారం
-
మోడీ ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతలు
తన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని నరేంద్ర మోడీ పంపిన ఆహ్వానానికి ఆయా దేశాలు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. ఇప్పటికే అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మారిషస్ తరఫున ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులామ్, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్షేలు తాము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయ్యూమ్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మరో వైపు నేపాల్ ప్రధాని, భూటాన్ కొత్త ప్రధాని కూడా రానున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున పార్లమెంటు స్పీకర్ రానున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం ఆహ్వానంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. మోడీ సార్క్ దేశాలను ఆహ్వానించడం ఒక కొత్త ఒరవడిని మొదలుపెట్టినట్టయింది. బంగ్లాదేశ్ తో తీస్తా నది జలాల పంపకం, పాకిస్తాన్ తో ఉగ్రవాదం, ఇతర సమస్యల పరిష్కారం వేగవంతం చేసే దిశగా మోడీ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం కలుగుతోందని సార్క్ దేశాల విశ్లేషకులు అంటున్నారు. -
సార్క్ వీసా నిబంధనల సరళీకరణ!
న్యూఢిల్లీ: సార్క్ కూటమి దేశాల్లో వ్యాపారవేత్తల వీసా నిబంధనల సరళీకరణకు భారత్ తెరతీసింది. సార్క్ దేశాల్లో వాణిజ్యం, పెట్టుబడుల పెంపు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ చెప్పారు. ఇక్కడ జరిగిన సార్క్ (దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య)బిజినెస్ లీడర్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. సార్క్ దేశాల్లో వృత్తిగత నిపుణులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు విశ్వాసపూరితమైన వాతావరణం నెలకొనేలా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు తోడ్పడేందుకు ప్రతీ సార్క్ దేశం మిగిలిన అన్ని సార్క్ దేశాల్లో బ్యాంక్ బ్రాంచీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వివరించారు. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల వాణిజ్య, ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. పేదరికం, నిరుద్యోగం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలపై కలసికట్టుగా పోరాడాల్సిన అవసరముందని ఈ మంత్రులు అభిప్రాయపడ్డారు. భారత్, పాక్ల్లో బ్యాంక్ బ్రాంచీలు పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఎస్బీఐ, బీఓఐలకు అనుమతి లభించగా, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించడానికి నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకి స్థాన్, యునెటైడ్ బ్యాంక్‌లకు అనుమతి లభించింది.