న్యూఢిల్లీ : కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. కానీ భయపడకండని ప్రధాని నరేంద్ర మోదీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యుహంపై సార్క్ దేశాలు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘సార్క్ దేశాలలో 150 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రపంచ జనాభాలో ఐదవ వంతు జనాభా మన దేశాల్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. మన ప్రాంతంలోని వైద్య సౌకర్యాలకు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కరోనాను ఎదుర్కొవడానికి మనందరం కలిసి సిద్ధం కావాలి, కలిసి పనిచేయాలి, అలాగే ఉమ్మడిగా విజయం సాధించాలి.
కరోనాను ఎదుర్కొవడానికి అనుగుణంగా దేశంలోని వైద్య సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి భారత్ వేగంగా చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం కరోనాను తక్కువగా అంచనా వేయకుండా జాగ్రత్త వహించింది. చాలా యాక్టివ్‌గా వ్యవహరించడంతోపాటు, జనవరి మధ్య భాగంలోనే స్క్రీనింగ్ చేయడం ప్రారంభించాం. కరోనా వైరస్ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలే ముఖ్యం’ అని తెలిపారు.
చదవండి : కరోనా: ఇటలీలో రికార్డుస్థాయి మరణాలు
Comments
Please login to add a commentAdd a comment