న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రజల కు ముప్పుగా మారిన కరోనా (కొవిడ్–19) వైరస్‌పై పోరాడేం దుకు సార్క్ దేశాలన్ని కలసి ఉమ్మడి వ్యూహం రూపొందించా లని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రతిపాదించారు. ప్రజలందరి ఆరోగ్యం కోసం సార్క్ దేశాధినేతలందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించుకోవాలని కోరారు. ‘ప్రస్తుతం మన గ్రహం కొవిడ్ –19 వైరస్‌తో పోరాడుతోంది. ప్రభుత్వాలు, ప్రజలు దీన్ని ఎదుర్కొనేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు’అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ప్రధాని పిలుపు భూటాన్, మాల్దీవులు, శ్రీలంక సానుకూలంగా స్పందించాయి.
Comments
Please login to add a commentAdd a comment