ఘనంగా ఎగిరిన త్రివర్ణ పతాకం
సాక్షి, హైదరాబాద్/గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు శనివారం స్వాతంత్య్రదినోత్సవాన్ని నిర్వహించాయి. నేతలు జాతీయ పతాకావిష్కరణ చేసి స్వాతం త్య్ర యోధులకు నివాళులు అర్పిం చారు.
శాసనసభ ఆవరణలో స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబ్కేదర్‌లకు నివాళులు అర్పించారు. శాసనమండలి ఆవరణలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇందిరాభవన్‌లో వేడుకలు
హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం జాతీయ పతాకావిష్కరణ చేశారు. పలువురు కాంగ్రెస్ నేతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పతాకావిష్కరణలో వెంకయ్యనాయుడు
వెంకటాచలం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుర స్కరించుకొని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు పతాకాన్ని ఆవిష్కరించారు.
నేవీ ఆధ్వర్యంలో
విశాఖపట్నం: దేశ సార్వభౌమాధికార పరిరక్షణకు నేవీ సన్నద్ధంగా ఉండాలని తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్‌సోనీ అన్నారు. నావల్ బేస్‌లోని ఈఎన్‌ఎసీ పెరేడ్ గ్రౌండ్‌లో పతాకావిష్కరణానంతరం ఆయన మాట్లాడారు. గౌరవ వందనం స్వీకరించారు.