నన్ను ఢిల్లీలో చంపి కోల్‌కతాలో పడేస్తామన్నారు! | Trinamool MP gets life threats, Mamata cries vendetta | Sakshi
Sakshi News home page

నన్ను ఢిల్లీలో చంపి కోల్‌కతాలో పడేస్తామన్నారు!

Published Wed, Dec 23 2015 4:00 AM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

నన్ను ఢిల్లీలో చంపి కోల్‌కతాలో పడేస్తామన్నారు! - Sakshi

నన్ను ఢిల్లీలో చంపి కోల్‌కతాలో పడేస్తామన్నారు!

తృణమూల్ ఎంపీ సుదీప్
తనను చంపుతామని బెదిరింపులు వచ్చాయని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ లోక్‌సభలో చెప్పారు ‘నన్ను చంపుతామంటూ సోమవారం గుర్తుతెలియని నంబర్ నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. ఢిల్లీలో చంపేసి కోల్‌కతాలోని కాళిఘాట్‌లో మృతదేహాన్ని పడేస్తామన్నారు’ అని చెప్పారు. దీన్నితీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిని కోరారు.  సభ్యుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలను చేపడతామని ప్రభుత్వం చెప్పింది.

తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ  మిడ్నాపూర్‌లో స్పందిస్తూ..  తృణమూల్.. అసహనంతోపాటు పలు అంశాలపై పార్లమెంటులో గళం విప్పినందుకే సుదీప్‌కు బెదిరింపులు వచ్చాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement