Trinamool chief Mamata Banerjee
-
మోదీతో దీదీ భేటీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం కోల్‌కతాలో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర సమస్యలను ప్రస్తావించినట్టు అనంతరం మీడియాకు చెప్పారు. రూ.1.18 లక్షల కోట్లు బకాయిలు రావాలంటూ మమత రెండు రోజుల పాటు ధర్నాకు దిగడం, అంతేగాక జాతీయ ఉపాధి హామీ కూలీలకు మమత సర్కారే చెల్లింపులు చేయడం తెలిసిందే. -
కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత?
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ యూత్ వింగ్ నిర్వహించిన ర్యాలీ సందర్బంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే నిరంకుశత్వం రాజ్యమేలుతుందని ఈ ఏడాది చివర్లోగాని వచ్చే ఏడాది ప్రారంభంలో గాని లోక్‌సభ ఎన్నికలు ఉంటాయని అధికార బీజేపీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రత్యర్ధులు గెలుపుకోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తారని.. ఇటీవల పర్గణాస్ జిల్లా 24 నార్త్‌లో బాణాసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం లాంటి దురాగతాలకు పాల్పడటానికి కూడా వెనకడుగు వేయరని. అలాంటివారికి వారికి కొంతమంది పోలీసులు కూడా సహకరిస్తుండటం సరికాదన్నారు. చాల మంది పోలీసులు తమ పనిని తాము చిత్తశుద్ధితో చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రమే దుష్టశక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. ర్యాగింగ్ నిరోధక విభాగం ఉన్నట్లే అవినీతి నిరోధక విభాగం కూడా ఉందని వారికి గుర్తు చేస్తున్నానన్నారు. కాషాయం బాణాసంచాతో ఏమి ప్రయోజనం ఉంటుంది? పచ్చ బాణాసంచాతో అయితే వాతావరణానికి కూడా మేలు కలుగుతుంది కదా అన్నారు. ఇప్పటికే కాషాయ పార్టీ ఎన్నికల కోసం తన అమ్ములపొదిలో అస్త్రాలన్నిటినీ సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే వారు దేశమంతటా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. మళ్ళీ వారు అధికారంలోకి వస్తే దేశాన్ని ద్వేషపూరితంగా మార్చేస్తారు. బీజేపీ ఇతర పార్టీల వారికి అవకాశం లేకుండా ఎన్నికల కోసం మొత్తం హెలికాఫ్టర్లన్నిటినీ బుక్ చేసేశారన్నారు. ఇదే క్రమంలో ఆమె బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ని కూడా లక్ష్యం చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వొద్దు. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాలు రాజ్యమేలిన కమ్యూనిస్టుల కంచుకోటకు బీటలు వారేలా చేసిన ఘనత నాదని పరోక్షంగా గవర్నర్‌ని ఉద్దేశించి అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో 'గోలీ మారో' అంటూ నినాదాలు చేస్తున్న ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను కటకటాలోకి నెట్టామని, మళ్ళీ లాంటి నినాదాలు చేసేవారంతా ఇది యూపీ కాదు బెంగాల్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: ఆ లెక్చరర్ని ఎందుకు సస్పెండ్ చేశారు.. సుప్రీంకోర్టు -
తృణమూల్‌లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
-
నన్ను ఢిల్లీలో చంపి కోల్‌కతాలో పడేస్తామన్నారు!
తృణమూల్ ఎంపీ సుదీప్ తనను చంపుతామని బెదిరింపులు వచ్చాయని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ లోక్‌సభలో చెప్పారు ‘నన్ను చంపుతామంటూ సోమవారం గుర్తుతెలియని నంబర్ నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. ఢిల్లీలో చంపేసి కోల్‌కతాలోని కాళిఘాట్‌లో మృతదేహాన్ని పడేస్తామన్నారు’ అని చెప్పారు. దీన్నితీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిని కోరారు. సభ్యుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలను చేపడతామని ప్రభుత్వం చెప్పింది. తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ మిడ్నాపూర్‌లో స్పందిస్తూ.. తృణమూల్.. అసహనంతోపాటు పలు అంశాలపై పార్లమెంటులో గళం విప్పినందుకే సుదీప్‌కు బెదిరింపులు వచ్చాయన్నారు.