సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్ | tripura to peel off afspa, says manik sarkar | Sakshi
Sakshi News home page

సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్

Published Wed, May 27 2015 8:26 PM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM

సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్ - Sakshi

సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్

ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని సమస్యాత్మక రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదంగా ఉన్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తమ రాష్ట్రంలో ఉపసంహరించాలని త్రిపుర సర్కారు నిర్ణయించింది. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు గత 18 ఏళ్లుగా ఈ చట్టం ఆ రాష్ట్రంలో అమలవుతోంది. రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల పరిస్థితిని తాము సమీక్షించామని, రాష్ట్ర పోలీసులు, భద్రతా దళాలతో కూడా ఈ అంశంపై చర్చించామని మాణిక్ సర్కార్ చెప్పారు. ఇక ఇప్పుడు ఈ చట్టంతో అవసరం లేదనే అందరూ భావించారని ఆయన అన్నారు. దాంతో.. వివాదాస్పదంగా ఉన్న ఆ చట్టాన్ని ఎత్తేయాలని నిర్ణయించామని, త్వరలోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పారు. 1997 ఫిబ్రవరి 16 నుంచి త్రిపురలో ఈ చట్టం అమలవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement