251 రూపాయల స్మార్ట్ ఫోన్లు రెడీ | Two lakh of Rs 251 phones ready, says Ringing Bells; | Sakshi
Sakshi News home page

251 రూపాయల స్మార్ట్ ఫోన్లు రెడీ

Published Fri, Jun 24 2016 5:51 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

251 రూపాయల స్మార్ట్ ఫోన్లు రెడీ

251 రూపాయల స్మార్ట్ ఫోన్లు రెడీ

ప్రపంచంలోనే అత్యంత చౌకయిన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లు రెడీ అయ్యాయి. దాదాపు 2 లక్షల మొబైల్ ఫోన్లను తయారు చేసినట్టు రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు అందిస్తామని రింగింగ్ బెల్స్ గతంలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

వినియోగదారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ గోయెల్ చెప్పారు. ఈ నెల 30 నుంచి ఫోన్లను డెలివరీ చేస్తామని తెలిపారు. మొదటి విడత (2 లక్షల ఫోన్లు) డెలివరీ పూర్తయిన తర్వాత ఫోన్ల అమ్మకాలకు మళ్లీ  రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. 4 అంగుళాల, డ్యుయల్ సిమ్ ఫోన్లు నలుపు, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమకు నష్టం వచ్చినా, పేదలకు, గ్రామీణులకు చౌకధరకు ఫోన్లు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. చౌకధరకు ఎల్ఈడీ టీవీలను ఫ్రీడమ్ పేరుతో  అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు.

జూన్ 30లోపు 25 లక్షల స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేయాలని రింగింగ్ బెల్స్ కంపెనీ గత ఫిబ్రవరిలో యోచించింది. ఈ ఫోన్ల ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించగానే మూడు రోజుల్లోనే సైట్ క్రాష్ అయ్యింది. ఈలోపు ఏడు కోట్ల మంది ఈ ఫోన్లను బుక్ చేసుకున్నారు.  అప్పట్లో ఈ కంపెనీపై అనేక ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement