దుండగులు కాల్పులు : ఇద్దరు పోలీసులు మృతి | Two policemen shot dead in Pakistan's Quetta | Sakshi
Sakshi News home page

దుండగులు కాల్పులు : ఇద్దరు పోలీసులు మృతి

Published Tue, Jul 14 2015 9:57 AM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM

Two policemen shot dead in Pakistan's Quetta

కరాచీ: పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావిన్స్లోని క్వట్టా నగరంలో గస్తీ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరోకరు ఆస్పుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. క్వట్టాలోని శాటిలైట్ నగరంలో సోమవారం సాయంత్రం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు రెహ్మాన్, హఫీజుల్లాపై బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు.

అనంతరం దుండగులు పరారైయ్యారని చెప్పారు. రెహ్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. హఫీజుల్లా మాత్రం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. నగరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై విచక్షణరహితంగా కాల్పుల జరిపిన ఘటనలో ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement