న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేబినెట్ నోట్ అంశం చర్చకు రాలేదు. శుక్రవారం ఉదయం సమావేశం అయిన కేంద్ర కేబినెట్ ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డీఏ పెంపుపై ఆమోదం తెలిపింది. దీంతో 80 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అధికార వర్గాలు ముందుగా చెప్పినట్లే తెలంగాణ ముసాయిదా నోట్ చర్చకు రాలేదు.