ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం | UP girl abducted, gang raped in Nepal for 20 days | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం

Published Mon, Jun 23 2014 4:55 PM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం - Sakshi

ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం

సిద్ధార్థనగర్: ఉత్తరప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి... నేపాల్ లో ఆమెను అమ్మేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపాల్, అతని మేనల్లుడు చింకు.. ఎత్వా ప్రాంతం నుంచి బాలికను అపహరించి నేపాల్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెపై 20 రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడ్డారు.

చింకు తండ్రి తకావు, బరాన్సి అనే వ్యక్తితో కలిసి బాలికను మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. విజయపాల్, చింకులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement