కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ ప్రయోజం కోసమే ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్పాల్ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ పట్టాణాభివృద్ది శాఖ మంత్రి అజాం ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉనికిని కొల్పోయిన ఆ పార్టీ తన ప్రభావాన్ని తిరిగి పొందే క్రమంలో రాజకీయ క్రీడలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన రాంపూర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి విషయంలో సోనియా గాంధీ ప్రధాని మన్మోహాన్ సింగ్కు లేఖ రాయాడాన్ని ఆయన ఈ సందర్భంగా తప్పుపట్టారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేతలతోపాటు విదేశీయురాలు సోనియా నేతృత్వంలో నడుస్తుందన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అతి సున్నితమైన వ్యక్తి అని ఈ సందర్భంగా చెప్పారు. ఆయన దుర్గాశక్తి సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. అయితే సోనియాగాంధీపై అజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి ఖండించారు. ఆ పార్టీ నేతలతో చెప్పించుకునే పరిస్థితి సోనియాకు లేదని రీటా వ్యాఖ్యానించారు.
రాజకీయ ప్రయోజం కోసమే సోనియా జోక్యం
Published Sat, Aug 10 2013 10:25 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement