చర్చల రద్దు; అమెరికా నిరుత్సాహం
వాషింగ్టన్: భారత్ - పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) చర్చలు రద్దు కావడం నిరుత్సాహం కలిగించిందని అమెరికా పేర్కొంది. చర్చలు జరగకపోవడంతో తాము నిరుత్సాహానికి గురయ్యామని అమెరికా ప్రకటించింది. చర్చల పునరుద్ధరణకు భారత్, పాకిస్థాన్ ముందడుగు వేయాలని సూచించింది. రెండు దేశాల మధ్య చర్చలు తర్వలోనే జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
రష్యాలోని యుఫాలో భేటీ కానున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చర్చల పునరుద్ధరణకు చొరవ చూపాలని అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కోరారు. భారత్ తో సోమవారం జరగాల్సిన ఈ చర్చలను పాక్ రద్దు చేసుకుంది. పాక్ ఎన్‌ఎస్‌ఏ ఢిల్లీలో కశ్మీర్ వేర్పాటువాదులను కలవరాదని, చర్చల్లో ఉగ్రవాదం మినహా మరే అంశాన్నీ లేవనెత్తరాదని భారత్ స్పష్టంచేసిన అనంతరం.. ఆ దేశం తన నిర్ణయాన్ని ప్రకటించింది.