త్వరలో ఎస్‌జీఎస్‌టీ, యూటీజీఎస్‌టీ చట్టాలు రాష్ట్రాలకు | UT-GST along with SGST will be on lines of CGST law; Council to consider them at March 16 meeting, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

త్వరలో ఎస్‌జీఎస్‌టీ, యూటీజీఎస్‌టీ చట్టాలు రాష్ట్రాలకు

Published Sat, Mar 4 2017 4:24 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

UT-GST along with SGST will be on lines of CGST law; Council to consider them at March 16 meeting, says Arun Jaitley

ముంబై: జీఎస్‌టీ  కౌన్సిల్‌  సమావేశం వివరాలను కేంద్ర  ఆర్థికమంత్రి అరుణజైట్లీ మీడియాకు వివరించారు. ఒకే దేశం  ఒక పన్ను చట్టం  వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)  అమలులో మరో కీలక అంకం ముగిసినట్టు  చెప్పారు. జీఎస్‌టీ చట్టంలో  అమలులో మొత్తం  5 ( కాంపన్‌సేషన్‌ లా, సీజీఎస్‌టీ,  ఐజీఎస్‌టీ,  ఎస్‌జీఎస్‌టీ, యూటీజీఎస్‌టీ) చట్టాలను ఆమోదించాల్సి ఉందనీ. ఇటీవల జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ 10 వ సమావేశంలో  ఇప్పటికే    కాంపన్‌సేషన్‌ లా చట్టాన్ని అమోదించినట్టు చెప్పారు. తాజాగా మరో రెండు చట్టాలు సీజీఎస్‌టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీలను అమోదించినట్టుచెప్పారు.   వీటిపై  ముంబైలో శనివారం జరిగిన  సమావేశంలో విస్తృతమైన  చర్చ జరిగిన అనతరం కౌన్సిల్‌ వీటికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు.   దీనికి సంబంధించి  రాష్ట్రాల నుంచి ఏకగ్రీవంగా ఫార‍్మల్‌ ఆమోదం లభించినట్టు మీడియాకు తెలిపారు.  కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయితే ఇంకా రెండు ప్రధానమైన  ఎస్‌జీఎస్‌టీ, యూటీజీఎస్‌టీ  చట్టాలను రాష్ట్రాల్లో ఆమోదించాలన్నారు.  ఈ ఆమోదానికి ముందు జీఎస్‌టీ చట్టాలు ఎస్‌జీఎస్‌టీ, యూటీజీఎస్‌టీ  ప్రతిపాదనలను  మూడు రోజుల్లో లీగల్‌ కమిటీ ఫైనల్‌ చేయనుందని జైట్లీ చెప్పారు.అనంతరం వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని తెలిపారు.  ఢిల్లీ, పుదుచ్చేరి  సహా అన్ని రాష్ట్రాలకు వీటిని పంపిస్తామని చెప్పారు.   అలాగే మార్చి 15-16న ఢిల్లీలో జరగబోయే కౌన్సిల్‌ సమావేశంలో ఫిట్‌మెంట్‌ రేట్లపై తుది నిర్ణయం ఉంటుందని  అరుణ్‌ జైట్టీ  స్పష్టం చేశారు. అనంతరం  వీటిని మార్చి 9 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల (ద్వితీయార్థంలో)ముందు ఉంచనున్నట్టు జైట్లీ చెప్పారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement