
'అఖిలపక్ష సమావేశాన్నిఏర్పాటు చేయండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మొత్తం కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం కేవలం 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఇంతకంటే మోసం మరొకటి లేదని అన్నారు. బుధవారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పచ్చటి పొలాలు బీళ్లుగా మారాయని వాసిరెడ్డి పద్మ చెప్పారు. కరువుపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. కరువుపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.