పరారీలో ఉన్నా దర్జాగా మ్యాచ్‌ చూశాడు! | Vijay Mallya spotted watching India vs Pakistan match at Edgbaston | Sakshi
Sakshi News home page

పరారీలో ఉన్నా దర్జాగా మ్యాచ్‌ చూశాడు!

Published Mon, Jun 5 2017 8:45 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

పరారీలో ఉన్నా దర్జాగా మ్యాచ్‌ చూశాడు!

పరారీలో ఉన్నా దర్జాగా మ్యాచ్‌ చూశాడు!

లండన్‌: బ్రిటన్‌లో తలదాచుకుంటున్న వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అనూహ్యంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శేనమిచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ మైదానంలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అతను వీక్షించాడు. బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకొని, వాటికి ఎగనామం పెట్టడంతో విజయ్‌ మాల్యాపై ఆర్థిక అక్రమాల కేసులో నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులలో విచారణ, అరెస్టు తప్పించుకోవడానికి అతను బ్రిటన్‌ పారిపోయాడు. పలు కేసులు ఎదుర్కొంటున్న అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇటీవల అతన్ని లండన్‌ స్కాట్‌లాండ​ యార్డ్‌ పోలీసులు అరెస్టు చేసినా, వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన దాయాదుల సమరాన్ని స్టాండ్స్‌లో కూర్చొని వీక్షించాడు. అతను మ్యాచ్‌ చూస్తున్న విషయాన్ని గుర్తించి.. పలువురు అతని ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. పరారీలో ఉన్నా కూడా దర్జాగా నిర్భయంగా మాల్యా మ్యాచ్‌ చూడటం నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement