అమెరికాలో మరో భారతీయుడి ప్రభ | Vivek Murthy appointed as America's surgeon general | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో భారతీయుడి ప్రభ

Published Wed, Feb 5 2014 5:11 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో మరో భారతీయుడి ప్రభ - Sakshi

అమెరికాలో మరో భారతీయుడి ప్రభ

వాషింగ్టన్: అమెరికాలో భారతీయల ప్రభ వెలిగిపోతోంది. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగుతేజం సత్య నాదెళ్లను నియమించిన మరుసటి రోజే.. కర్ణాటక యువ కిశోరం వివేక్ మూర్తిని అమెరికాలో కీలకమైన సర్జన్ జనరల్ పదవికి సిఫారసు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మూర్తి నియామకాన్ని సెనెట్ ఆమోదించాల్సివుంది. అమెరికాలో ప్రజారోగ్యానికి సంబంధించి ఆయన ముఖ్య ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తారు. యూఎస్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్ దళానికి చీఫ్గా ఉంటారు. ఈ కమిషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్స్ దళాలకు వైద్య సేవలందిస్తుంది.  

ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్ 36 ఏళ్ల వివేక్ కావడం విశేషం. అంతేగాక అతి  పిన్న వయస్కుడు కూడా ఆయనే కావడం మరో వివేషం. వివేక్ బోస్టన్లో ఫిజిషియన్గా పనిచేయడంతో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఇన్స్ట్రక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2008లో 'డాక్టర్స్ ఫర్ ఒబామా' అనే సంస్థను ఆరంభించి ఒబామా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఒబామా హెల్త్కేర్'కు మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement