మూర్తిని కాదని అమెరికన్‌కే ట్రంప్ పట్టం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పరిపాలన వర్గంలో కొత్త వ్యక్తిని సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికాగా నియమించారు. ఇందుకోసం ఇప్పటి వరకు ఆ స్థానంలో బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తిని తొలగించారు. ఈ మేరకు శ్వేతసౌదం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ ఇండియానా ఆరోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ జెరోమ్ ఆడమ్స్‌తోను అమెరికా ప్రధాన సర్జన్‌గా నియమించారు’ అని ఆ ప్రకటనలో వివరించింది.
ఈయన అమెరికా చీఫ్ వైద్యుడిగా ఉంటూ ప్రస్తుతం హెచ్‌ఐవీ వైరస్‌ను నిర్మూలించేందు పరిశోధనలు చేస్తున్న వారికి కీలక సలహాదారుగా వ్యవహరిస్తారు. అలాగే, దేశ జనాభా ఆరోగ్య భద్రత కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆయన ట్రంప్‌కు సలహాసహకారాలు అందిస్తారు. అనెస్తీషియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆడమ్స్ ఇండియానా హెల్త్ కమిషనర్‌గా 2014లో బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఇండియానా గవర్నర్‌గా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వివేక్ మూర్తిని డోనాల్డ్ ట్రంప్ ఆ బాధ్యతల నుంచి తప్పించారు. మూర్తిని 2014లో ఒబామా నియమించారు.