ఉత్తరాఖండ్‌లో 68, యూపీలో 66
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ రెండో దశ, ఉత్తరాఖండ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఉత్తరాఖండ్‌లో 68 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 66 శాతం ఓటింగ్ నమోదైంది.
ఉత్తరాఖండ్‌లో 69 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లో 67 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించగా, ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికి రెండు దశల పోలింగ్ ముగిసింది. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశిస్తోంది. ఇక యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీ పోరాడుతున్నాయి. వచ్చే నెల 11న కౌంటింగ్ జరగనుంది. ఇటీవల పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.