Voting End
-
ప్రశాంతంగా మహారాష్ట్ర ఎన్నికలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 288 స్థానాల్లో బుధవారం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సాయంత్రం 5 గంటలకల్లా 60 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలీ చిల్లాలో 69.63 శాతం, ముంబైలో 51.41 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,100 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నాగపూర్‌లో ఓటు వేశారు. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన మేనల్లుడికి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడికి ఓటు వేయడం విశేషం. మాహిమ్‌లో రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్నారు. బాంద్రా ఈస్ట్ స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీకి దిగారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బుధవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి మృతి మహారాష్ట్ర ఎన్నికల్లో బీడ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే(43) బుధవారం మృతిచెందారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగానే ఆయన ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం సృష్టించింది. బీడ్ పట్టణంలోని ఛత్రపతి సాహూ విద్యాలయ పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జార్ఖండ్ రెండో విడతలో 67.59 శాతం ఓటింగ్ జార్ఖండ్‌లో రెండో/చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండో విడతలో భాగంగా బుధవారం 38 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలవరకు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం 12 జిల్లాల్లో 14,218 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల్కు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించారు. మిగిలిన కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ కొనసాగింది. సమయం ముగిసినప్పటికీ వరుసులో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. జాంతారా జిల్లాలో అత్యధికంగా 76.16 శాతం ఓటింగ్ నమోదైంది. బొకారో జిల్లాలో అతి తక్కువగా 60.97 శాతం ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య వేడుకలో ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని చెప్పారు. జార్ఖండ్‌లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
హిమాచల్ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం
-
రాజస్తాన్‌లో 75% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందాక తుది పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ప్రవీణ్ గుప్తా అన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.06% పోలింగ్ నమోదైంది. ఈ దఫా కనీసం ప్రతి నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు పోలింగ్ జరిపారు. ఓటర్ల సంఖ్య 5.25 కోట్లు. మొత్తం 51వేల పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అప్పటికే క్యూల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశమిచి్చనట్లు అధికారులు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయానికి 68.2శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జైసల్మీర్, ఆ తర్వాత హనుమాన్‌గఢ్, ధోల్పూర్ జిల్లాల్లో భారీ పోలింగ్ నమోదైనట్లు సీఈవో గుప్తా తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకస్మిక మృతితో శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. భద్రత కోసం 1.70 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. శనివారం ఉదయం ఓటు హక్కు మొదటగా వినియోగించుకున్న ప్రముఖుల్లో సీఎం అశోక్ గెహ్లోత్, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కైలాశ్ చౌదరి, మాజీ సీఎం వసుంధరా రాజె, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తదితరులున్నారు. గెహ్లోత్, షెకావత్ జోథ్‌పూర్‌లో, చౌదరి బలోత్రాలో, రాజె ఝలావర్‌లో, పైలట్ జైపూర్‌లోనూ ఓటేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది. స్వల్ప ఘటనలు.. దీగ్ జిల్లా కమన్ గ్రామంలో రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీస్ అధికారి సహా ఇద్దరు గాయపడ్డారు. ‘గుమికూడిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది’అని దీగ్ జిల్లా ఎస్పీ చెప్పారు. సికార్ జిల్లా ఫతేపూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వడంతో ఒక జవాను గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ధోల్పూర్ బారి నియోజకవర్గంలోని ఓ బూత్ వద్ద పోలింగ్ ఏజెంట్, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయినట్లు కలెక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. టోంక్ జిల్లా ఉనియారాలో 40 మంది వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు యతి్నంచగా అడ్డుకున్నట్లు ఎస్పీ రాజశ్రీ రాజ్ చెప్పారు. సుమేర్పూర్ స్థానం బీజేపీ అభ్యర్థి తరఫు ఏజెంట్ శాంతి లాల్, ఉదయ్‌పూర్‌లో సత్యేంద్ర అరోరా(62) అనే ఓటరు పోలింగ్ బూత్‌ల వద్దే గుండెపోటుతో చనిపోయారు. కొద్ది చోట్ల రీపోలింగ్ చేపట్టే విషయంలో పరిశీలకుల నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామని సీఈవో గుప్తా వివరించారు. పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొన్ని బూత్‌లలో ఈవీఎంలు మొరాయించినట్లు ఫిర్యాదులు వచి్చనా అవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి యువ ఓటర్ల కోసం పోలింగ్ బూత్‌ల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
ఉత్తరాఖండ్‌లో 68, యూపీలో 66
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ రెండో దశ, ఉత్తరాఖండ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఉత్తరాఖండ్‌లో 68 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 66 శాతం ఓటింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్‌లో 69 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లో 67 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించగా, ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికి రెండు దశల పోలింగ్ ముగిసింది. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశిస్తోంది. ఇక యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీ పోరాడుతున్నాయి. వచ్చే నెల 11న కౌంటింగ్ జరగనుంది. ఇటీవల పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.