'వ్యాపమ్ స్కామ్ సిల్లీ ఇష్యూ'
ఉదయ్ పూర్: మధ్యప్రదేశ్ లో మృత్యుగీతం ఆలపిస్తున్న వ్యాపమ్ కుంభకోణంను 'సిల్లీ ఇష్యూ'గా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వర్ణించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, సంబంధిత శాఖల మంత్రులతో పాటు తమ పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా కూడా దీనిపై స్పందించారని గుర్తు చేశారు. అన్ని అంశాలకు సమాధానాలిచ్చారని చెప్పారు.
ప్రతి చిన్న విషయానికి ప్రధాని జవాబు చెప్పాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజయోనాలకు సంబంధించిన సీరియస్ విషయమైతే స్పందించాలని ప్రధాన మంత్రిని విజ్ఞప్తి చేయవచ్చని చెప్పారు. వ్యాపమ్ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన నేపథ్యంలో సదానంద గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు.