silly issue
-
వింత కారణాలతో ఆగిపోతున్న పెళ్లిళ్లు!
దేశంలో ఇటీవలికాలంలో చిత్రవిచిత్ర కారణాలతో వివాహాలు రద్దవుతున్నాయి. అబ్బాయి భయస్తుడనీ, అమ్మాయి సరిగ్గా మాట్లాడటం లేదని సాకులు చెబుతూ పెళ్లిపీటలు ఎక్కకుండానే ఆగిపోతున్నారు. తాజాగా వాట్సాప్‌లో నిండా మునిగిపోయిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్‌లో కాబోయే భర్త షాకిచ్చాడు. వాట్సాప్‌లో గంటల తరబడి గడుపుతూ కాబోయే అత్తమామలకు భారీగా సందేశాలు పెట్టడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఈ ఘటన యూపీలోని ఆమ్రోహీ జిల్లాలో చోటుచేసుకుంది. ఆమ్రోహీ జిల్లాలోని నౌగావ్సాదత్ గ్రామానికి చెందిన ఉరోజ్ మెహందీ కుమార్తెకు ఫకీర్పురాకు చెందిన ఖమర్ హైదర్ కుమారుడితో పెళ్లి నిశ్చయమైంది. అయితే అప్పటి నుంచి అమ్మాయి వాట్సాప్‌లో కాబోయే అత్తమామలకు ఇష్టానుసారం సందేశాలు పెట్టడంతో ఈ నెల 5న వివాహ మండపానికి వరుడి కుటుంబ సభ్యలెవరూ రాలేదు. దీంతో అమ్మాయి తండ్రి ఫోన్ చేయగా తాము వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వరుడి తండ్రి తెలిపాడు. అమ్మాయి ఎప్పుడూ వాట్సాప్‌లో ఉంటూ సందేశాలు పంపడంతో తమ కుమారుడు ఆమెతో పెళ్లికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశాడు. దీంతో వధువు తండ్రి ఉరోజ్ పోలీసులను ఆశ్రయించారు. వరుడి కుటుంబం అడిగిన రూ.65 లక్షల కట్నాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నాటకం ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి చిత్రవిచిత్ర కారణాలతో చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. ♦ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ వరుడు తాము కోరిన మాంసాహారాన్ని వధువు కుటుంబ సభ్యులు వడ్డించలేదన్న కోపంతో పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ♦ విందులో పెళ్లి కొడుకు సోదరుడికి ఇంకో రసగుల్లా ఇవ్వడానికి వధువు తరఫు బంధువులు నిరాకరించడంతో ఉత్తరప్రదేశ్‌లోనే మరో పెళ్లి ఆగిపోయింది. ♦ ఇక యూపీలోని షాజహాన్‌పూర్ కు చెందిన ఓ యువతి ఊరేగింపు సందర్భంగా పెళ్లికొడుకు చేసిన నాగిన్ డ్యాన్స్‌తో చిరాకుపడి వివాహాన్నే రద్దు చేసుకుంది. ♦ బిహార్‌లోని సరన్‌లో మరింత విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపుగా వస్తున్న పెళ్లికొడుకు ఉరుము శబ్దానికి అదిరిపడటంతో అంత పిరికివాడిని తాను పెళ్లి చేసుకోలేనని మరో యువతి తేల్చిచెప్పింది. దీంతో పీటల దగ్గరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. -
హాట్ టాపిక్‌గా మంత్రి వ్యవహారం
-
హాట్ టాపిక్‌గా మంత్రి రాజీనామా వ్యవహారం
లండన్ : సాధారణంగా ఎవరైనా కాస్త ఆసల్యం అయితే క్షమాపణలు చెప్పి సరిపెడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ మంత్రి తన పదవికే రాజీనామా చేయటం బ్రిటన్‌లో కలకలం రేపింది. మంత్రి మైకేల్ బేట్స్ తన పదవికి రాజీనామా చేసి అర్థంతరంగా సభ నుంచి నిష్క్రమించారు. ఈ ఉదంతం బ్రిటన్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బుధవారం హౌస్ ఆఫ్ లార్డ్స్(ఎగువ సభ) సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఆ సమయంలో లేబర్ పార్టీ నేత బరోనెస్ రుత్ లిస్టర్ ఓ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. అయితే దానికి సమాధానం చెప్పాల్సిన మంత్రి మైకేల్ బేట్స్(డీఎఫ్ఐ శాఖ) తన సీట్లో లేరు. సభకు ఆయన కాస్త ఆలస్యంగా వచ్చారు. హుటాహుటిన తన కుర్చీ వద్దకు వచ్చిన బేట్స్... ‘సభకు ఆలస్యంగా వచ్చినందుకు సిగ్గు పడుతున్నా.నా రాజీనామా లేఖను ప్రధానికి అందజేస్తా. లిస్టర్‌కు నా క్షమాపణలు’’ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆయన వెళ్తున్న సమయంలో కొందరు సభ్యులు వద్దని ఆయన్ని ఆపే యత్నం చేయగా.. మరికొందరు అదంతా ఆయన సరదాగా చేస్తున్నారని నవ్వుకున్నారు. కానీ, అవేం పట్టన్నట్లు బేట్స్ బయటికి వెళ్లిపోయి మళ్లీ తిరిగి లోపలికి రాలేదు. ఇదంతా కేవలం నిమిషం వ్యవధిలో జరగటం విశేషం. ఇంత చిన్న విషయానికి క్షమాపణలు చెబితే సరిపోయేదని.. రాజీనామా వ్యవహారం మరీ అతిగా ఉందని తోటి సభ్యులు చెబుతున్నారు. దీనిపై లిస్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అలా చేసి ఉండాల్సింది కాదన్న ఆమె.. తక్షణమే రాజీనామా ఉపసంహరణ చేసుకోవాలని బేట్స్ కు సూచించారు. అయితే ఆయన రాజీనామా తిరస్కరణకు గురైందని.. పదవిలో కొనసాగుతారని లార్డ్స్ ఆఫ్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. బేట్స్ 2008 నుంచి లార్డ్స్ ఆఫ్ హౌజ్ లో సభ్యుడిగా ఉన్నారు. 2016 నుంచి ఆయన మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్లలో ఏనాడూ తాను సభకు ఆలస్యం కాలేదని ఆయన తర్వాత తోటి సభ్యుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈయనగారి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
'వ్యాపమ్ స్కామ్ సిల్లీ ఇష్యూ'
ఉదయ్ పూర్: మధ్యప్రదేశ్ లో మృత్యుగీతం ఆలపిస్తున్న వ్యాపమ్ కుంభకోణంను 'సిల్లీ ఇష్యూ'గా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వర్ణించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, సంబంధిత శాఖల మంత్రులతో పాటు తమ పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా కూడా దీనిపై స్పందించారని గుర్తు చేశారు. అన్ని అంశాలకు సమాధానాలిచ్చారని చెప్పారు. ప్రతి చిన్న విషయానికి ప్రధాని జవాబు చెప్పాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజయోనాలకు సంబంధించిన సీరియస్ విషయమైతే స్పందించాలని ప్రధాన మంత్రిని విజ్ఞప్తి చేయవచ్చని చెప్పారు. వ్యాపమ్ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన నేపథ్యంలో సదానంద గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు.