ముందు నుంచి చెబుతూనే ఉన్నాం: అద్వానీ
తాము మొదటినుంచి చెబుతూనే ఉన్నా, కాంగ్రెస్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టిందని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ అన్నారు. లోక్సభలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని, ఈ పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తప్ప మరే బిల్లు పెట్టడమూ సాధ్యం కాదని ఆయన చెప్పారు.
తాను 1970 నుంచి పార్లమెంటులో ఉన్నానని, పార్లమెంటు చరిత్రలోనే ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని అద్వానీ వ్యాఖ్యానించారు. అయితే, ఇక తెలంగాణ అంశం గురించి, ఈ బిల్లు గురించి తమ పార్టీ ఏం నిర్ణయిస్తుందో తనకు తెలియదని ఆయన అన్నారు. మరోవైపు, పార్లమెంటులో గురువారం నాటి సంఘటనలకు కాంగ్రెస్, యూపీఏలే కారణమని పార్టీ మరో సీనియర్ నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.