war situation
-
వచ్చే ఏడాది భారత్‌లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్‌కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్‌తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్‌లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్‌స్తాన్‌లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. ‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం
అమ్మానాన్నా మాట్లాడుతున్నా సరే, వినకుండా విసురుగా వెళ్లిపోవడం వ్యంగ్యంగా మాటలు అనేయడం నాటకీయంగా కళ్లు తిప్పడం ఉన్నట్టుండి తమ గదిలోకి వెళ్లి ‘ధఢేల్’న తలుపులు వేసుకోవడం ఇలాంటివెన్నో సంఘటనలు... టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులకు తెలియని విషయమేమీ కాదు. ఒంటరి తల్లులకు పిల్లల పెంపకం మరింత కష్టంగా ఉంటుంది. పిల్లల చంచలమైన భావాలను నియంత్రించలేక తల్లులు చాలాసార్లు మౌనంగా మారిపోతుంటారు. ఇంట్లో టీనేజర్లు సృష్టించే యుద్ధ వాతావరణంలో ఎవరు గెలుస్తారో ప్రతి పేరెంట్కు తెలుసు కాబట్టి ఆర్‌ఎమ్‌ఎఫ్ మంత్రాన్ని మననం చేసుకోండి అంటున్నారు నిపుణులు. రెస్ట్ మామ్ ఫేస్ (ఆర్‌ఎమ్‌ఎఫ్) అనే ఈ మంత్రం అమ్మ ముఖకవళికలను పిల్లల ముందు ఎలా ప్రదర్శించాలి, అందుకు తగిన సాధన ఏ విధంగా చేయాలో నిపుణులు చెబుతున్నారు. ‘టీనేజ్‌లో ఉన్న మా అమ్మాయి విషయంలో చాలాసార్లు నా ప్రవర్తన ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుంది. చికాకు పరిచే సంఘటనలు ఎదురైనప్పుడు నా ఎమోషన్స్‌ని సమర్థంగా నియంత్రించలేక పోతుంటాను’ అంటుంది కార్పొరేట్ ఆఫీసులో హెడ్‌గా పనిచేసే కౌముది. ‘మా అబ్బాయితో గొడవపడటం, పదే పదే చెప్పడం, గతంలో చేసిన ్రపామిస్లను గుర్తుచేయడం అదేపనిగా జరుగుతుంటుంది. కానీ, ఆ వెంటనే తప్పనిసరై నాకు నేనే తగ్గడం, మౌనంగా ఉండటం, లేదంటే సర్దిచెప్పడం.. ఎప్పుడూ జరిగే పనే’ అంటుంది బొటిక్‌ను నడిపే వింధ్య. ‘కుటుంబ ఆకాంక్షలను పిల్లలు తీర్చాలనే లక్ష్యంగానే నేటి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటోంది. తల్లులు టీనేజ్ పిల్లల విషయంలో తమను తాము నియంత్రించు కోవడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది’ అని తెలియజేస్తుంది హోలీ గ్రెయిల్ ఆఫ్ పేరెంటింగ్ మ్యాగజైన్. ఎలాంటి భావోద్వేగాలను ముఖంలో చూపని తటస్థ స్థితిని రెస్టింగ్ మామ్ ఫేస్ సాధన చేస్తే సరైన ప్రయోజనాలను ΄÷ందవచ్చు అని చెబుతోంది. అదెలాగో చూద్దాం. తటస్థంగా.. సాధారణంగా ఎలాంటి వ్యక్తీకరణ లేని స్త్రీ ముఖాన్ని చూసిన వాళ్లు అహంకారమనో లేదా నిరాడంబరత అనో నిర్ధారించుకుంటుంటారు. సంతోషించే సమయంలోనూ వీరు ‘తటస్థ’ ముఖాలతో ఉండటం చూస్తుంటాం. చూసేవారికి వీరి ముఖాల్లో ప్రశాంతత కూడా కనిపిస్తుంటుందని పరిశోధకులు గ్రహించారు. అందరూ ఇలా ఉండలేరు. కానీ, పిల్లల ముందు తమ భావోద్వేగాలను బయటకు చూపకుండా తమని తాము నిభాయించుకుంటూ ఉండాలంటే ్రపాక్టీస్ అవసరం. విశ్రాంతికి 30 సెకన్లు అమ్మల ముఖం పిల్లల ముందు సరైన విధంగా ఉండాలంటే...ఫేస్ యోగాను సాధన చేయాలి. కోపంగా ఉన్న పిల్లలతో మాట్లాడేముందు ముఖ కండరాలకు కూడా విశ్రాంతి అవసరం అని తమకు తాముగా చెప్పుకోవాలి. రెండు పిడికిళ్లతో ముఖాన్ని రుద్దుకుంటున్నట్టు, కోపాన్ని కూల్ చేసుకుంటున్నట్టు ఊహించుకోవాలి. గాఢంగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. అయితే, అది ఎదుటివారికి నిట్టూర్పులా ఉండకూడదు. మీ ముఖ కండరాలలో చికాకు, ఆశ్చర్యం, విమర్శిం చడం ... వంటివన్నీ తీసేసి, స్పష్టంగా అనుకున్న విషయాన్ని చెప్పేయాలి. చిన్నపిల్లలు యుక్తవయసులో ఉన్నా, పెద్దవారైనప్పుడైనా ఈ ఆర్‌ఎమ్‌ఎఫ్ ఉపయోగకరంగా ఉంటుంది. నిజాయితీగా ఈ వ్యూహాన్ని అమలుపరిస్తే ప్రయోజనకరమైన మార్పులు కనిపిస్తాయి. గొడవ పడే సమయాల్లో ఎలాంటి బోధలు చేయద్దు. అలాగే శిక్షించవద్దు. పిల్లలు వారి భావోద్వేగాలను స్వీయ – నియంత్రణ చేయగలిగేలా చేయడమే లక్ష్యంగా ఉండాలి. మీ బిడ్డ తన ఆందోళనను, అసంతృప్తిని మరింత ఆమోదయోగ్యమైన మార్గాల్లో వ్యక్తపరచలేకపోతే అకస్మాత్తుగా దాడికి దిగవచ్చు. లేదంటే తనని తాను బాధించుకోవచ్చు. అందుకని సమస్యను కూల్‌గా పరిష్కరించాలి. బంధాలు పదిలం.. ‘తల్లి మెరుగైన ఆలోచనతో ఉంటే పిల్లలతో స్నేహాలను, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంచుకోగలదు. కానీ, నియంత్రణతో సరైన ప్రయోజనాలను రాబట్టలేరు’ అంటారు సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ రైటర్ అలిజా. పిల్లల ఆకలి తీరినప్పుడు వారి కోపం చల్లబడుతుంది. అందుకని వారికి ఆరోగ్యకరమైన చిరుతిండిని అందిస్తుండాలి. దీంతో పిల్లల దృష్టి మారిపోతుంది. కానీ, అన్ని విషయాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు ఆర్ఎమ్ఎఫ్ని సాధన చేయడమే మేలు అనేది నిపుణుల మాట. -
రష్యాతో నాటో ఘర్షణకు దిగితే... మూడో ప్రపంచ యుద్ధమే
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు. చర్చలకు సదా సిద్ధం ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్‌ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2030 దాకా అధ్యక్ష పీఠంపై రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి. నవాల్నీని వదిలేద్దామనుకున్నాం.. దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు. -
Farmers movement: సర్కారు ‘మద్దతు’ లేదనే..!
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న మరోసారి కన్నెర్రజేశాడు. డిమాండ్ల సాధనకు రాజధాని బాట పట్టాడు. దాంతో రెండు రోజులుగా ఢిల్లీ శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. అవసరమైతే మరోసారి నెలల తరబడి ఆందోళనలు కొనసాగించేందుకే రైతులు సిద్ధమవుతున్నారు. పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర యూపీకి చెందిన రైతులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొంంటున్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించడంతో పాటు దానికి చట్టబద్ధత కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దాంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కూడా రైతులు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఎంఎస్పీ? రైతు సంక్షేమానికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులేమిటి...? ఎంఎస్పీ కీలకం.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ది కీలక పాత్ర. ► రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే కనీస ధరే ఎంఎస్పీ. ► ఇది వారికి మార్కెట్ ఒడిదొడుకుల బారినుంచి రక్షణతో పాటు స్థిరత్వాన్ని, ఆదాయ భద్రతను కల్పిస్తుంది. ► దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధోరణులు, డిమాండ్–సరఫరా తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎంఎస్పీపై సిఫార్సులు చేస్తుంది. వాటి ఆధారంగా సీసీఈఏ తుది నిర్ణయం తీసుకుంటుంది. సీఏసీపీ 1965లో ఏర్పాటైంది. ఇలా లెక్కిస్తారు... ఎంఎస్పీ లెక్కింపు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం రైతులకయ్యే ప్రత్యక్ష, పరోక్ష ఉత్పత్తి వ్యయాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► ఎరువులు, విత్తనాలు, కూలీల వంటివి ప్రత్యక్ష వ్యయం కాగా రైతు సొంత కుటుంబం పడే కష్టం, అద్దెలు తదితరాలు పరోక్ష వ్యయం. ► వీటిని స్థూలంగా ఏ2, ఎఫ్ఎల్, సీ2గా వర్గీకరిస్తారు. ► పంట ఎదుగుదల, ఉత్పత్తి, నిర్వహణ నిమిత్తం చేసే ఎరువులు, విత్తనాలు, కూలీల వ్యయం ఏ2 కిందకు వస్తుంది. ► ఈ అసలు ఖర్చులకు కుటుంబ కష్టం తదితర పరోక్ష ఉత్పత్తి వ్యయాన్ని కలిపితే ఎఫ్ఎల్. ► ఏ2, ఎఫ్ఎల్ రెండింటికీ మూలధన ఆస్తులు, రైతు చెల్లించే అద్దెలను కలిపితే వచ్చేదే సీ2. ► వీటికి తోడు పలు ఇతర అంశాలను కూడా సీఏసీఊ పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి క్వింటా పంట దిగుబడికి అయ్యే వ్యయమూ అంతే. అలాగే మార్కెట్ ధరలు, వాటి ఒడిదొడుకులు, కూలీల వ్యయం తదితరాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. వీటన్నింటితో పాటు సదరు పంట ఎగుమతులు, దిగుమతులు, మొత్తం నిల్వలు, డిమాండ్, తలసరి వినియోగం, ప్రాసెసింగ్ పరిశ్రమ ధోరణులు తదితరాలన్నింటినీ ఎంఎస్పీ లెక్కింపు కోసం సీఏసీపీ పరిగణనలోకి తీసుకుంటుంది. స్వామినాథన్ సిఫార్సులు... ► అన్ని పంటలకూ ఎంఎస్పీ హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఎంఎస్పీ మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి (దీన్ని సీ2+50 పద్ధతిగా పిలుస్తారు). ► రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ, పరిజ్ఞానం, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులో తేవాలి. ► రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ► రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన ధర కలి్పంచాలి. ► వ్యవసాయోత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
కల్లోల ఇజ్రాయెల్‌లో ఇండియన్ సూపర్ ఉమెన్
బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు... అనుకునే భయానక పరిస్థితుల్లో ఉండి కూడా, తమకు ఏమైనా ఫరవాలేదు, నిస్సహాయులైన వృద్ధదంపతులకు ఏమీ కాకూడదని వారిని కంటికి రెప్పలా కాపాడారు ఇజ్రాయెల్‌లో హోమ్ నర్స్‌లుగా పనిచేస్తున్న కేరళకు చెందిన సబిత, మీరా మోహన్‌లు... దక్షిణ ఇజ్రాయెల్... గాజా సరిహద్దుకు రెండో కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ ఓజ్ కిల్బట్జ్ పట్టణంలో ఒక ఇంట్లో... 85 సంవత్సరాల షౌలిక్, 76 సంవత్సరాల రహెల్ దంపతులకు నలుగురు పిల్లలు. పిల్లలు వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. రహెల్ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను చూసుకోవడానికి ఆరోజు ఆ ఇంట్లో సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు హోమ్నర్స్లు ఉన్నారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో సైరన్ మోత వినిపించింది. ప్రజలు బాంబ్ షెల్టర్లలో తల దాచుకోవాలని చెప్పే సైరన్ అది. ‘ఆ ఉదయం సైరన్ మోగేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సెకండ్ల వ్యవధిలో సేఫ్టీరూమ్లోకి వెళ్లాలి. ఇంతలో రహెల్ కుమార్తె నుంచి ఫోన్ వచ్చింది. బయట పరిస్థితి భయానకంగా ఉంది అని ఆమె చెప్పింది. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటిముందు, వెనుక తలుపులకు తాళాలు వేసి అమ్మానాన్నలను తీసుకొని, పాస్‌పోర్ట్, డైపర్లు, యూరిన్ పాట్, మందులతో సెక్యూర్ రూమ్‌లోకి వెళ్లాలని ఆమె చెప్పింది. షౌలిక్, అనారోగ్యంతో ఉన్న రహేల్‌ను నడిపించుకుంటూ షెల్టర్ రూమ్‌లోకి వెళ్లాం. ఈలోపే మిలిటెంట్లు ఇంట్లోకి ప్రవేశించారు. అద్దాలు బద్దలు కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. షెల్టర్రూమ్పై కాల్పులు జరుపుతున్నారు. ఐరన్ డోర్ వెనకే మా శరీరాలను గట్టిగా ఆనించి ఎన్నో గంటలపాటు నిల్చున్నాం. అదృష్టవశాత్తు ఐరన్ డోర్ ధ్వంసం కాలేదు. ధ్వంసం అయి ఉంటే ఎవరి ప్రాణాలు మిగిలేవి కావు’ అంటూ ఆ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది 39 సంవత్సరాల సబిత. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ల సాహసం, మానవత్వం గురించి దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఇండియన్ సూపర్ ఉమెన్’ అంటూ ప్రశంసించింది. -
పశ్చిమ బెంగాల్: ఎన్నికల్లో రక్తచరిత్ర.. ఎందుకీ హింస?
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ హింస రాజుకోవడం కొత్త కాదు. కాల్పులు, బాంబుల మోత, గృహదహనాలు, రాళ్లు విసురుకోవడాలు, బ్యాలెట్ బాక్స్‌లకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు సర్వసాధారణం. రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరగడం ఒక రివాజుగా మారింది. ఏ ఎన్నికలైనా, ఎవరు అధికారంలో ఉన్నా ఒక రక్తచరిత్రను తలపిస్తూ ఉంటాయి. కుల, మతపరమైన హింస దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తే రాజకీయ పార్టీల వారీగా ప్రజల్లో ఇక్కడ విభజన ఎక్కువ. ఎన్నికల వేళ ఈ విభేదాలు మరింత ముదిరి హింసకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగడం, ఎన్నికల సంఘం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండడం ఎన్నికల హింసకు ఒక కారణమేనని రాజకీయ విశ్లేషకుడు స్నిగ్ధేందు భట్టాచార్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువని, అందుకే ఎన్నికల సమయంలో హింస రాజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో బీజేపీ బెంగాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయ కక్షసాధింపులే కేంద్రంగా ఉన్న బెంగాల్లో మైనార్టీ బుజ్జగింపు చర్యలు, మతపరమైన రాజకీయాలు తోడు కావడంతో హింస ప్రజ్వరిల్లింది. టీఎంసీ కార్యకర్త హత్యకి ప్రతీకారంగా 2021 మార్చిలో బిర్భూమ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికలకి లిట్మస్ టెస్ట్ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు విషమ పరీక్షే. కాంగ్రెస్, లెఫ్ట్‌లతో చేతులు కలిపిన టీఎంసీ ఒకవైపు, బీజేపీ మరోవైపు రెండు శిబిరాలుగా మారిపోవడంతో ఘర్షణలు మరింతగా పెరుగుతున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ టీఎంసీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. అప్పట్నుంచి టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ పోరు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎస్ఎస్సీ, బొగ్గు స్మగ్లింగ్ కేసుల్లో టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ గురిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో అమీతుమీకి ఇరుపక్షాలు సిద్ధపడడం హింసను పెంచుతోంది. భద్రత ఇలా.. ► పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మళ్లీ రక్తమోడింది. కేంద్ర బలగాలు రంగంలోకి దింపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని 61,636 పోలింగ్ స్టేషన్లలో భారీగా భద్రతా ఏర్పాట్లు, ముందస్తు అరెస్ట్‌లు, ఆయుధాల స్వా«దీనం వంటి చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇప్పుడు టీఎంసీ.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా బుల్లెట్ పేలకుండా బ్యాలెట్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. పంచాయతీల్లో రాజకీయ నాయకులు తమ ధనబలం, కండబలంతో ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పాటు సీపీఐ(ఎం) రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల హింస తారాస్థాయికి చేరుకుంది. ధనబలం.. ► ఇటీవల పంచాయతీలకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరగడం హింసకు ఒక కారణంగా మారింది. ఒక జిల్లా కౌన్సిల్ ఐదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఒక గ్రామ పంచాయతీ రూ.5–15 కోట్లు ఖర్చు పెట్టుకునే వీలుంది. ప్రతీ ఏడాది గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయిస్తుంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించడానికైనా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ► గత నెల జూన్ 8 – 27 మధ్య బెంగాల్లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 337 మందికి గాయాలయ్యాయి. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ బెంగాల్లోనే 38 వరకు మరణించారు. ► 2018లో పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు 13 వరకు జరిగాయి. అదే ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 30 మంది మరణిస్తే, 12 మంది పోలింగ్ రోజునే ప్రాణాలు కోల్పోయారు. ► 2011లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిడ్నాపూర్‌లో జరిగిన ఘర్షణల్లో 14 మంది మరణించారు. ► లెఫ్ట్ అధికారంలో ఉన్న సమయంలో 2003లో 70 మంది 2008లో 36 మంది మరణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దివాలా అంచున స్విస్ బ్యాంక్?
2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది. న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్‌తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు. అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. మూడు ముక్కలు... మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్‌లు... క్రెడిట్ స్విస్‌ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్‌లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్‌లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం! ఇదీ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇన్వెస్టర్లలో వణుకు..! గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది. -
ఉక్రెయిన్‌లో హోరాహోరీగా యుద్ధం: మరో 4 నెలలు?
కీవ్: రష్యా తెర తీసిన అకారణ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు. ‘‘డోన్బాస్లో రోజుల వ్యవధిలో చేజిక్కించుకుంటానని ఫిబ్రవరిలో యుద్ధ ప్రారంభంలో రష్యా ఆశ పడింది. నాలుగు నెలలవుతున్నా అక్కడ పోరాటం సాగుతూనే ఉంది. అక్కడ రష్యా బలగాలను సమర్థంగా అడ్డుకుంటున్న మా సేనలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’ అన్నారు. యుద్ధం తొలినాళ్లలో ఆక్రమించుకున్న దక్షిణ ఖెర్సన్ నుంచి కూడా రష్యా బలగాలను తాజాగా వెనక్కు తరిమినట్టు ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో పౌరులకు రష్యా పాస్‌పోర్టుల జారీ, రష్యా చానళ్ల ప్రసారం, రష్యా స్కూలు యూనిఫాం ప్రవేశపెట్టడం వంటివి జరుగుతుండటం తెలిసిందే. యుద్ధ లక్ష్యాలను త్వరగా సాధించలేమన్న వాస్తవాన్ని రష్యా అర్థం చేసుకుందని, అందుకే అక్టోబర్ దాకా పోరు కొనసాగించాలని నిర్ణయించుకుందని ఉక్రెయిన్ సైన్యం అంచనా వేస్తోంది. డోన్బాస్ చిక్కితే ముందుగానే ముగించొచ్చని భావిస్తోంది. చదవండి: Russia-Ukraine war: మెక్‌డొనాల్డ్స్ రీ ఓపెన్ హోరాహోరీ లుహాన్స్క్లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న చివరి పెద్ద పట్టణాలు సెవెరోడొనెట్స్క్, లిసిచాన్స్క్ల్లో హోరాహోరీ జరుగుతోంది. సెవెరోడొనెట్స్క్లోని కెమికల్ ప్లాంటులో 400 మంది దాకా ఉక్రెయిన్ సైనికులు చిక్కుపడ్డారని సమాచారం. మారియుపోల్లోనూ ఇలాగే చిక్కుబడ్డ వేల మంది ఉక్రెయిన్ సైనికులు నెలల తరబడి పోరాడి చివరికి లొంగిపోవడం, వారిని రష్యా యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తున్న పశ్చిమ దేశాలే శాంతి ప్రక్రియకు సంధి కొడుతున్నాయని చైనా మండిపడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలకు తమ మద్దతుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ వెయ్ ఫెంగ్ అన్నారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
ఇద్దరు దుష్టుల మధ్య స్నేహం ఎక్కువ కాలం నిలవదంటారు పెద్దలు. పాక్, అఫ్గాన్ మధ్య తాజా వైరం ఈ సామెతను నిజం చేస్తోంది. తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేనొకటంటానని ప్రస్తుతం రెండు దేశాలు సిగపట్లు పడుతున్నాయి. సంవత్సరం క్రితం జాన్జిగిరీలుగా ఉన్న ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. దాదాపు ఏడాది క్రితం అఫ్గాన్ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు మట్టుబెట్టి పాలనా పగ్గాలు చేపట్టారు. అ సమయంలో ప్రపంచమంతా తాలిబన్ల దాష్టికాలపై భయాందోళనలు వ్యక్తం చేస్తే పాక్ మాత్రం సంబరాలు చేసుకుంది. గిర్రున ఏడాది తిరగకముందే పాక్ సంతోషం ఆవిరైంది. తాము చెప్పినట్లు ఆడే ప్రభుత్వం అఫ్గాన్‌లో ఉంటుందని ఆశించిన పాకిస్తాన్‌కు అశనిపాతం తగిలింది. స్నేహం మాట దేవుడెరుగు ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంటోంది. ‘‘అఫ్గనిస్తాన్ బానిస సంకెళ్లు తెంచుకుంటోంది’’ అని తాలిబన్ల తిరుగుబాటు సమయంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ సంతోషంతో వ్యాఖ్యానించారు. ఆయన మంత్రుల్లో ఒకరైతే ఆగస్టు 15కు భారత్‌కు తగిన బహుమతి లభిస్తోందని ఎద్దేవా చేశారు. ఓడలు బండ్లుగా మారిన చందాన ప్రస్తుతం పాక్‌లో ఇమ్రాన్ లేడు, పాక్‌తో తాలిబన్లకు సయోధ్యా లేదు, పైగా ఇండియాతో తాలిబన్లు సమతుల్య సంబంధాలనే పాటిస్తున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత.. అని ఇదంతా పాక్ స్వయంకృతాపరాధమేనంటున్నారు నిపుణులు. ఎందుకీ వైరం? అఫ్గాన్‌లో పౌర ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆ దేశంతో పాక్‌కు సరిహద్దు వివాదం ఉంది. తమకు అనుకూల తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం సమసిపోతుందని, తాము కోరినట్లు సరిహద్దు మార్చుకోవచ్చని పాకిస్తాన్ భావించింది. దీనికితోడు పాక్‌లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే టీటీపీ (తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్)కు తాలిబన్లు పగ్గాలు వేస్తారని ఆశించింది. అయితే ఈ రెండు ఆశలు ఆడియాసలయ్యాయి. పౌర ప్రభుత్వ హయంలో కన్నా తాలిబన్ హయంలో సరిహద్దు రేఖ (డ్యురాండ్ రేఖ) వద్ద ఘర్షణలు పెరిగాయి. పాకిస్తాన్లో టీటీపీ ఉగ్రదాడులు మరింతగా పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు ఉగ్రదాడుల్లో పాక్ 100మంది సైనికులను కోల్పోయింది. డ్యురాండ్ రేఖ వద్ద పాక్ కంచె నిర్మాణాన్ని తాలిబన్లు అంగీకరించడంలేదు. అక్కడున్న పష్తూన్ జనాభాను ఈ కంచె విభజిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అమెరికా పరోక్ష పాలన సాగిన రోజుల్లో అఫ్గాన్ రహస్యాలను పాక్ అమ్ముకున్నదని అఫ్గన్లు నమ్ముతున్నారు. దీంతో అఫ్గన్‌లో ఇటీవల కాలంలో పాక్‌పై వ్యతిరేకత ప్రబలుతోంది. పాక్ అంటేనే అస్థిరతకు మారురూపమని, పాక్ స్నేహం వద్దని పలు అఫ్గాన్ నగరాల్లో ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. టీటీపీని అదుపు చేయడానికి కూడా తాలిబన్లు ఇష్టపడడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్ నిష్క్రమణ జరగింది. తాలిబన్లతో ఇమ్రాన్‌కు కొంత మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన పదవి నుంచి వైదొలగడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగించేవాళ్లు కరువయ్యారని నిపుణులు భావిస్తున్నారు. ఏం జరగవచ్చు?∙ తమ ప్రభుత్వం ఉగ్రవాదంతో పోరాడుతుందని పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. అంటే టీటీపీతో పరోక్షంగా తాలిబన్లతో వైరం కొనసాగవచ్చని ఆయన భావన. దేశంలోని టీటీపీ ఆపరేటర్లను తుడిచిపెడతామని పాక్ మిలటరీ కూడా ప్రకటించింది. అదేవిధంగా సరిహద్దులను పరిరక్షించుకుంటామని తెలిపింది. దీనిపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌లోనే పాక్ సరిహద్దులపై జరిపిన దాడుల్లో 20మంది చిన్నారులు సహా 50 మంది అఫ్గాన్లు మరణించారని తాలిబన్లు ఆరోపించారు. తమ దేశస్థుల మరణాలకు యుద్ధం తప్పదని పాక్‌ను హెచ్చరించారు. పాక్ దాడులకు ప్రతిగా సరిహద్దుల్లో 7గురు పాక్ సైనికులను మట్టుబెట్టారు. దీంతో ఇరుదేశాల మధ్య స్నేహం స్థానంలో వైరం మొదలైంది. తాజాగా పాక్ వైఖరిపై తాలిబన్లు ఐరాసలో ఫిర్యాదు చేయడం గమనిస్తే ఇరుపక్షాల మధ్య వైరం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులుండరని, ఉగ్రవాదులంటే ఉగ్రవాదులేనని పాక్‌కు టీటీపీ అంశంతో బోధపడింది. తాను పెంచి పోషించిన తాలిబన్ తండా తనకే సవాలుగా మారడంతో పాక్ పెద్దలు తలపట్టుకుంటున్నారు. ఈ వైరం మరింత ముదరవచ్చని, చివరకు ఇది మరో సుదీర్ఘ పరోక్ష యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాముకు పాలు పోస్తే... అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడికి బదులుగా వార్ ఆన్ టెర్రరిజం పేరిట రెండు దశాబ్దాల క్రితం తాలిబన్లపై యుద్ధం చేసి అఫ్గాన్‌లో పౌర ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే అటు అమెరికాకు సహాయం చేస్తున్నామంటూ నిధులు దండుకున్న పాకిస్తాన్ మాత్రం తాలిబన్లకు, ఐసిస్‌కు, ఆల్‌ఖైదాకు లోపాయికారీ మద్దతు కొనసాగిస్తూనే వచ్చింది. గతేడాది అఫ్గాన్ రక్షణ తమ వల్ల కాదని అమెరికా చేతులెత్తి మొహం చాటేయగానే, పాక్ వత్తాసున్న తాలిబన్లు తలెగరేశారు. అతి స్వల్పకాలంలోనే అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తమకనుకూల ప్రభుత్వం ఏర్పడిందని పాక్ ఆనందించింది. కానీ తాలిబన్ అనుబంధ సంస్థ టీటీపీ పాక్‌లో తరుచూ దాడులకు దిగడం, అటు సరిహద్దు వద్ద కంచెను తాలిబన్లు అడ్డుకోవడంతో పాక్‌కు తత్వం తెలిసివచ్చింది. తాను పాలు పోసి పెంచిన పాము తననే కాటేయడానికి తయారైందని గ్రహించిన పాక్ డామిట్, కథ అడ్డం తిరిగిందని నాలుక్కరుచుకుంటోంది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఆర్బీఐ పాలసీ, ఆర్థిక గణాంకాలు కీలకం
ముంబై: ద్రవ్య విధానంపై ఆర్బీఐ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్– రష్యా యుద్ధ పరిణమాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపే ప్రధాన అంశాలుగా ఉన్నాయిని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ వైరస్‌పైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని భావిస్తున్నారు. ‘‘ప్రస్తుతానికి ట్రెండ్ బుల్స్‌కు అనుకూలంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఎలాంటి ప్రతికూల వార్తలు అందకపోతే మార్కెట్ మరింత కన్సాలిడేషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది. వచ్చే వారంలో కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన అంకం ప్రారంభం నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. కొనుగోళ్లు కొనసాగితే ఈ వారంలో నిఫ్టీకి 17,725–17,800 కీలక స్థాయిలుగా ఉండనున్నాయి. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశిస్తే 17,550–17,400 మద్దతు స్థాయిలుగా ఉంటాయి’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినప్పటికీ..., గడచిన వారంలో సూచీలు మూడుశాతం ర్యాలీ చేశాయి. ఆటో, బ్యాంక్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 1,914 పాయింట్లు, నిఫ్టీ 517 పాయింట్లు లాభపడ్డాయి. గరిష్ట స్థాయిల నుంచి క్రూడాయిల్ ధరలు దిగిరావడం, దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐల అమ్మకాల తీవ్రత తగ్గడం, పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడం, రష్యా ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి తదితర పరిణామాలు సూచీల లాభాలకు కారణమయ్యాయి. మార్కెట్‌ను ప్రభావితం అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే.... ► ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమావేశం బుధవారం(ఏప్రిల్ 6న) ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం వెల్లడించున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టేందుకు వడ్డీరేట్లను పెంచమనే వ్యాఖ్యలకు కట్టుబడి రెపో రేటును యథాతథంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన ద్రవ్యోల్బణ ఆందోళనలు, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ప్రణాళికల నేపథ్యంలో ఆర్బీఐ తీసుకొనే ద్రవ్య పాలసీ నిర్ణయాల కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అలాగే దేశ ఆర్థిక వృద్ధి స్థితిగతులపై ఆర్బీఐ అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. ► స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం నేడు తయారీ రంగ డేటా, ఎల్లుండి(ఏప్రిల్ 6న) సేవా రంగ ఉత్పత్తి గణాంకాలు విడుదల విడుదల కానున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, సేవా రంగ పనితీరును ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ వారాంతాన శుక్రవారం ఆర్బీఐ మార్చి 25 వ తేదీతో ముగిసిన డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలతో పాటు ఏప్రిల్ ఒకటవ వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను వెల్లడించనుంది. ఈ స్థూల ఆర్థిక గణాంకాల ప్రభా వం సూచీలపై పడొచ్చని నిపుణులు అంటున్నారు. ► క్రూడాయిల్ కదలికలపై కన్ను ఇటీవల గరిష్టాలకు(120.65 డాలర్లు) చేరిన క్రూడాయిల్ ధరలు దిగివస్తున్నాయి. అయితే ఇప్పటికీ బ్యారెల్ చమురు ధర 100 డాలర్లపైన ట్రేడ్ అవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆరో నెలలోనూ అమ్మకాలే దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా ఆరో నెలలోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు ఈ మార్చిలో రూ.41,000 కోట్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ‘‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో పాటు ఈ ఏడాది చివరిలోపు ఉద్దీపనలను ఉపసంహరించుకుంటామనే సంకేతాలతో ఎఫ్ఐఐలు వర్ధమాన దేశాల్లో విక్రయాలకు పాల్పడుతున్నారు. క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో స్వల్పకాలం పాటు ఎఫ్ఐఐలు కొనుగోళ్లు పరిమితంగా ఉండొచ్చు’’ అని మార్నింగ్‌స్టార్ ఇండియా డెరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
దద్దరిల్లుతున్న తూర్పు ఉక్రెయిన్
కీవ్: యూరప్‌లో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. సైన్యానికి, రష్యా అనుకూల రెబెల్స్‌కు మధ్య నానాటికీ పెరుగుతున్న కాల్పుల మోతతో తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. వీటికి తోడు గత 24 గంటల్లో ఇరువైపులా కనీసం 1,500కు పైగా పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. దాంతో రెబల్స్ ఆక్రమిత ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు రష్యా బాట పడుతున్నారు. ఉక్రెయిన్‌కు మూడువైపులా రష్యా సైనిక మోహరింపులు రెండు లక్షలకు చేరాయన్న వార్తలు యూరప్ దేశాలను మరింత ఆందోళన పరుస్తున్నాయి. శనివారం నాటి అణు, సంప్రదాయ సైనిక విన్యాసాలకు కొనసాగింపుగా నల్లసముద్ర తీరంలో రష్యా జోరుగా నావికా విన్యాసాలకు కూడా దిగింది. బెలారస్‌తో ఆదివారం ముగియాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలు మరికొద్ది రోజులు కొనసాగుతాయని ప్రకటించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. విన్యాసాలను పొడిగించినట్టే ఏదో సాకుతో రష్యా యుద్ధానికీ దిగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపించారు. దాన్ని నివారించేందుకు పుతిన్‌తో ఎక్కడైనా, ఎలాంటి రూపంలోనైనా చర్చలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిద్ధమన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రత ప్రమాదంలో పడిందనే నెపంతో యుద్ధానికి దిగవచ్చని నాటో దేశాలంటున్నాయి. అక్కడ రష్యన్లను ఊచకోత కోస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ఆరోపిస్తుండటమే ఇందుకు రుజువంటున్నాయి. పుతిన్ చెప్పిన చోట చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించినా రష్యా స్పందించలేదు. రష్యా అసలు చర్చలకు సిద్ధంగా ఉందా అన్నది అసలు ప్రశ్న అని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖేల్ అన్నారు. దూకుడుగా క్షిపణి పరీక్షలు, దళాల మోహరింపులకు దిగుతున్న వాళ్లముందు చర్చల మంత్రం పఠించడం వృథా అని అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రు లు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ 24న భేటీ కానున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు యూరప్ అంతటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొం టోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తెగబడితే దానిపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించే విషయంలో యూరప్ దేశాలన్నీ కలిసి రావాలి. – అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వెనక్కు వచ్చేయండి ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారత దౌత్య సిబ్బంది కుటుంబీకులంతా వెంటనే వచ్చేయాలని కేంద్రం సూచించింది. అక్కడున్న భారతీయులంతా కూడా తక్షణం స్వదేశానికి వచ్చేయాలని మరోసారి చెప్పింది. ‘‘అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టర్డ్ ఫ్లైట్లలో బయల్దేరండి. వివరాల కోసం ఎంబసీని సంప్రదించండి.’’ అని పేర్కొంది. మంగళ, గురు, శనివారాల్లో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ఎయిరిండియా విమానాలున్నందున సిబ్బంది కుటుంబీకుల కోసం ప్రత్యేక విమానం పంపే ఆలోచనేదీ లేదని అధికారులు చెప్పారు. -
యుద్ధాన్ని మేం ఆరంభించం! అలాగని.. చూస్తూ ఊరుకోం: రష్యా ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్‌లో తొలుత తాము యుద్ధాన్ని ఆరంభించమని రష్యా విదేశాంగమంత్రి సెర్గేవ్ లావ్రోవ్ శుక్రవారం ప్రకటించారు. అలాగని పాశ్చాత్య దేశాలు రష్యా రక్షణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించవచ్చని అమెరికా, మిత్రపక్షాలు అనుమానపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లావ్రోవ్ స్పందించారు. రష్యా యుద్ధాన్ని కోరుకోదన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ సరిహద్దులకు లక్ష మంది సైనికులను రష్యా తరలించడం, నాటో పక్షాలు యుద్ధ నౌకలు మొహరించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని రష్యా పలుమార్లు ప్రకటించినా యూఎస్ నమ్మడం లేదు. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకూడాని రష్యా డిమాండ్ చేస్తోంది. కానీ నాటో, యూఎస్ ఈ డిమాండ్‌ను తిరస్కరించాయి. యూఎస్, మిత్రదేశాలు తమ విధానాన్ని మార్చుకోనప్పుడు తాము కూడా తమ విధానాన్ని మార్చుకోమని లావ్రోవ్ తెలిపారు. ప్రస్తుతం రాజీకి ఆస్కారం ఉన్నట్లు కనిపించడం లేదని హెచ్చరించారు. తాము సంవత్సరాల క్రితం ప్రతిపాదించిన అంశాలపై చర్చలకు అమెరికా ఇప్పుడు అంగీకారం చెబుతోందని ఆయన విమర్శించారు. నాటో విస్తరణను ఆపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, దీనిపై మరోమారు ఆయా దేశాలకు లేఖ రాస్తామని చెప్పారు. కొనసాగిన హెచ్చరికలు రష్యా దురాకమ్రణకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అమెరికా, మిత్రపక్షాలు చేస్తున్న హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయన్ను ఆక్రమిస్తే రష్యా నుంచి నిర్మించిన పైప్‌లైన్ నుంచి సహజవాయువు సరఫరాను జర్మనీ అడ్డుకుంటుందని యూఎస్ అధికారులు గురువారం ప్రకటించారు. ఆంక్షల బెదిరింపులపై లావ్రోవ్ స్పందిస్తూ అమెరికా జోక్యంతో అన్ని రకాల బంధాలకు ఆటంకం కలుగుతుందని విమర్శించారు. ప్రస్తుతం బాల్టిక్ సముద్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు రష్యా, ఇటు నాటో బలగాల సంరంభం పెరిగింది. సైనికుల, యుద్ధవిమానాల విన్యాసాలు ఎక్కువయ్యాయి. సంక్షోభ నేపథ్యంలో అంతా శాంతి వహించాలని ఉక్రెయిన్ నేతలు అభ్యర్ధిస్తున్నారు. రష్యా ఆక్రమణకు దిగుతుందని భావించడంలేదన్నారు. అయితే యూఎస్ అధ్యక్షుడు బైడెన్ మాత్రం రష్యాపై అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. -
అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి
కాబూల్: అఫ్గాన్ భూభాగాలను తాలిబన్ సేనలు మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ప్రావిన్స్‌లపై పట్టుకోసం అఫ్గాన్ సైన్యం, తాలిబన్ మూకల మధ్య పోరుతో దేశంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. తాజాగా మరో మూడు ప్రావిన్స్‌ల రాజధానులను తాలిబన్ దళాలు ఆక్రమించాయి. తాజాగా బదఖ్షాన్ రాజధాని ఫైజాబాద్, బాగ్లాన్ రాజధాని పోలి–ఖుమ్రీ, ఫరాహ్ ప్రావిన్స్ రాజధాని తాలిబన్ వశమయ్యాయి. దీంతో అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి వచ్చింది. కుందుజ్ ఎయిర్‌పోర్ట్‌లోని సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. దీంతో తాలిబన్లపై ప్రతిదాడులు చేసి వారు తోకముడిచేలా చేసేందుకు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రంగంలోకి దిగారు. బాల్ఖ్ ప్రావిన్స్‌లోని స్థానికసైన్యాల నేతలైన అబ్దుల్ రషీద్ దోస్తుమ్ తదితరులను సాయం కోరేందుకు అక్కడికి చేరుకున్నారు. వారం వ్యవధిలోనే ఆరు ప్రావిన్స్‌ల రాజధానులు తాలిబన్ చేతచిక్కాయి. మరోవైపు, కీలక దేశ ‘కస్టమ్స్ ఆదాయ మార్గాలను’ తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆర్థికమంత్రి ఖలీద్ పయేందా పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయారని ఆర్థికశాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ రఫీ తబే చెప్పారు. ఉపసంహరణ ఆగదు: బైడెన్ అఫ్గాన్ సైన్యానికి తోడుగా ఉండేందుకు ఆ దేశంలోనే అమెరికా సేనలు ఉండబోతున్నాయని, సేనల ఉపసంహరణకు బ్రేక్ పడుతుందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. ‘మా బలగాలు అమెరికాకు రావడం ఖాయం. ఇప్పటికే అఫ్గాన్‌లో 20ఏళ్లకాలంలో దాదాపు రూ.74లక్షల కోట్లు ఖర్చుపెట్టాం. 3లక్షల మంది అఫ్గాన్ సైనికులకు శిక్షణ ఇచ్చాం. ఇకపై అఫ్గాన్ సేనలు తమ కోసం, తమ దేశం కోసం పోరాడాల్సిందే’అని బైడెన్ వ్యాఖ్యానించారు. కాగా, దేశ సైన్యంలో మరింతగా పోరాటస్ఫూర్తిని పెంచేందుకు ఆర్మీ చీఫ్ స్టాఫ్‌గా జనరల్ హిబాతుల్లా అలీజాయ్ను రక్షణశాఖ నియమించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. Heart breaking scenes from #Kunduz province #Afghanistan 😰 pic.twitter.com/QjRzNa6XwQ — Khalid Amiri - خالد امیري (@KhalidAmiri01) August 8, 2021 -
Israel vs Hamas: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
గాజా సిటీ: ఇజ్రాయెల్ సైనిక దళాలు, పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య పోరు ఉధృతరూపం దాలుస్తోంది. ఇరువర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శాంతి స్థాపనకు కట్టుబడి ఉండాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇజ్రాయెల్, హమాస్ పెడచెవిన పెడుతున్నాయి. గాజా సిటీలో శుక్రవారం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకు పడుతుండడంతో పాలస్తీనియన్లు తమ పిల్లలు, వస్తువులను వెంట తీసుకొని శివారు ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనియన్లు బెంబేలెత్తిపోతున్నారు. గాజా సిటీ శివారులో నివసించే పాలస్తీనియన్లు ఐక్యరాజ్యసమితి నిర్వహించే పాఠశాలల్లో తల దాచుకునేందుకు తరలి వస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు తమపై భూమార్గం ద్వారా దండెత్తే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అందుకే విరుగుడు చర్యగా తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని అంటోంది. పాలస్తీనా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. 9,000 మంది రిజర్విస్ట్ సైనికులను రప్పిస్తోంది. యుద్ధ ట్యాంకులను కూడా రంగంలోకి దించుతోంది. 126 మంది పాలస్తీనియన్ల మృతి పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై 1,800 రాకెట్లు ప్రయోగించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ 600కు పైగా వైమానిక దాడులు సాగించింది. కొన్ని భవనాలను నేలమట్టం చేసింది. టాడ్ పట్టణంలో శుక్రవారం యూదు, అరబ్ అల్లరి మూకలు ఘర్షణకు దిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 126 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 31 మంది చిన్నారులు, 19 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. అలాగే 950 మంది గాయపడ్డారని వెల్లడించింది. తమ సభ్యులు 20 మంది మృతి చెందినట్లు హమాస్, ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌లు ప్రకటించాయి. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. శాంతి యత్నాలు విఫలం! ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణను నివారించేందుకు ఈజిప్టు సాగిస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. శాంతి స్థాపనకు ఖతార్, ఐక్యరాజ్యసమితి కూడా చొరవ చూపుతున్నప్పటికీ మార్పు రావడం లేదు. -
రైతు ఉద్యమంపై ట్వీట్ వార్
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తోఢిల్లీలో రైతులు సాగిస్తున్న అవిశ్రాంత పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతోంది. పలువురు ప్రముఖులు రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో కొందరు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బుధవారం రైతు అనుకూల, ప్రభుత్వ అనుకూల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాలపాటు విదేశీ వలసవాదులు అక్రమించుకున్నారు, పాలించారు, లూటీ చేశారు. దేశం బలహీనంకావడం వల్ల కాదు, ఇంటి దొంగల వల్లే ఇదంతా జరిగింది. ఇండియాను అప్రతిష్టపాలు చేసే దిశగా జరుగుతున్న అంతర్జాతీయ ప్రచారం వెనుక ఎవరున్నారో ప్రశ్నించాలి’’ – కిరణ్ రిజిజు, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ‘‘భారతదేశ శక్తి సామర్థ్యాలు పెరుగుతుండడం చూసి అంతర్జాతీయ శక్తుల్లో వణుకు పుడుతోంది. అందుకే దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రలు సాగిస్తున్నాయి’ – రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకొనే సత్తా ఉంది’’ – అనిల్ కుంబ్లే, మాజీ క్రికెటర్ ‘‘అర్ధ సత్యం కంటే మరింత ప్రమాదకరమైనది ఇంకేదీ లేదు’’ – సునీల్ శెట్టీ, బాలీవుడ్ హీరో ‘‘అరాచక శక్తులను అరాధించే అంతర్జాతీయ ముఠాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఢిల్లీలో హింసను ఎలా ప్రేరేపించారో, జాతీయ జెండాను ఎలా అవమానించారో మనమంతా చూశాం. మనమంతా ఇప్పుడు ఏకం కావాలి. ఇలాంటి శక్తులను ఓడించాలి’’ – హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ‘‘ఇండియాకు, ఇండియా విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దు’’ – అజయ్ దేవగణ్, నటుడు ‘ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి’ –సాగు చట్టాలపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లపై భారత విదేశాంగ శాఖ ‘ప్రచారంతో దేశ ఐక్యతను దెబ్బతీయలేరు. దేశం ఉన్నత శిఖరాలు అధిరోహించకుండా అడ్డుకోలేరు. దేశ భవిష్యత్తును నిర్దేశించేది అభివృద్ధే తప్ప ప్రచారం కాదు’ –కేంద్ర మంత్రి అమిత్ షా -
గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం మూడు దఫాలు చర్చలు జరిగినా సమసిపోలేదు. చైనా మరో అడుగు ముందుకు వేసి తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ తమదేనని సార్వభౌమాధికారం ప్రకటించుకొని మరింత అగ్గి రాజేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు గల్వాన్ ప్రాంతమే ఎందుకంత కీలకం? 1962 యుద్ధంలో గల్వాన్ లోయ ఎందుకు ప్రాధాన్యంగా మారింది? పర్వత సానువుల్లో భారత్ బలగాలు పటిష్టంగా ఎలా ఉన్నాయి? ఎవరి సైనిక సత్తా ఎంత? వంటివన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రెండు పక్షాలకీ వ్యూహాత్మక ప్రాంతం భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా గల్వాన్ లోయ అత్యంత కీలకం. సబ్ సెక్టార్ నార్త్ (ఎస్ఎస్ఎన్)లో గల్వాన్ లోయ ఉంది. వివాదాస్పద ప్రాంతమైన ఆక్సాయిచిన్ నుంచి భారత్‌లోని లద్దాఖ్ దాకా గల్వాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. లేహ్‌కు చెందిన అన్వేషకుడు గులామ్ రసూల్ గల్వాన్ పేరునే ఈ నదికి పెట్టారు.వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమాన నదీ పరివాహక ప్రాంతాల్లో గల్వాన్ లోయ ప్రాంతం ఎత్తు తక్కువగా ఉంటుంది. భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరుకోవాలంటే గల్వాన్ లోయ గుండా చేరుకోవడం సులభం. అంతేకాకుండా పాకిస్తాన్, చైనాలోని జిన్జియాంగ్, లద్దాఖ్ సరిహద్దులతో గల్వాన్ లోయ కలిసి ఉంది. గల్వాన్ నది టిబెట్ నుంచి ప్రవహిస్తూ షివోక్ నదిలో కలుస్తుంది. ఈ నదికి సమీపంలో ఉత్తర లద్దాఖ్‌ను కలుపుతూ ప్రధాన రహదారి ఉంది. చైనా బలగాలు దీనిని ఆక్రమిస్తే మనకి రోడ్డు ఉండదు. అందుకే గల్వాన్ ప్రాంతం భారత్‌కు అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో భారత్ మౌలిక సదుపాయాల కల్పన, షియోక్ నది వీదుగా వంతెన నిర్మాణం, లేహ్, దౌలత్ బేగ్ ఓల్దీలను కలుపుతూ 255 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం వంటివి చైనాకు కంటగింపుగా మారాయి. లద్దాఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసిన దగ్గర్నుంచి డ్రాగన్ దేశం సరిహద్దుల్లో విషం చిమ్ముతూనే ఉంది. దేశం కోసం ప్రాణత్యాగానికి జవాన్లు సిద్ధం భారత సైన్యం అత్యంత ఉత్సాహంతో ఉందనీ, గతంలో మాదిరిగానే జవాన్లు దేశం కోసం జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్ (ఐటీబీపీ)డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ పేర్కొన్నారు. చైనాతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించడం, నిములో చేసిన ప్రసంగంతో సరిహద్దుల్లో ఉన్న సైన్యంలో ధైర్యం ఇనుమడించిందని అన్నారు. పర్వత శ్రేణుల్లో మనకి లేరు పోటీ ! ప్రపంచంలో అత్యధిక సైనికులున్న మన బలగానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే, పోరాడే శక్తి ఉంది. సైనిక బలగాల సంఖ్యలో భారత్, ఉత్తర కొరియా తర్వాత స్థానమే చైనాకు దక్కుతుంది. అయితే ఆయుధాల పరంగా చైనా అత్యంత బలంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ నుంచి చెలరేగుతున్న ఘర్షణల్లో మన సైనికులు చైనాకు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. పర్వత శ్రేణుల్లో, పీఠభూముల్లో భారత్ సైనికులకు మించిన వారు లేరని స్వయంగా చైనా నిపుణులే కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి. ‘‘ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత అనుభవమైన, పటిష్టమైన సైనిక బలగాలున్న దేశం అమెరికా, రష్యా, యూరప్ కానే కాదు. అది భారత్’’అని చైనాలో మోడర్న్ వెపనరీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ హాంగ్ ఘాజి ఇటీవల తాను రాసిన ఆర్టికల్‌లో ప్రశంసించారు. వాస్తవాధీన రేఖ వెంబడి మొత్తం 12 డివిజన్లలో 2 లక్షలకుపైగా మన సైనికులు రేయింబగళ్లు గస్తీ తిరుగుతున్నారు. 1970 నుంచి భారతీయ ఆర్మీ తన పరిధిని విస్తరిస్తూ పర్వతాల్లో పెద్ద ఎత్తున సైనికుల్ని మోహరిస్తోంది. భారతీయులెవరైనా సైన్యంలో చేరాలంటే పర్వతారోహణ చెయ్యడం తప్పనిసరి. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన ప్రాంతమైన సియాచిన్‌లో వందలాది శిబిరాలను భారత్ ఏర్పాటు చేసిందని హాంగ్ తన వ్యాసంలో వివరించారు. నాటి యుద్ధంలోనూ... 1962లో భారత్, చైనా యుద్ధం కూడా గల్వాన్ లోయ ప్రాంతంలోనే జరిగింది. అప్పట్లో చైనా జిన్జియాంగ్ నుంచి టిబెట్‌కు 179 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు భారత్‌కు చెందిన ఆక్సాయిచిన్ ప్రాంతం గుండా వెళుతుంది. భారత్ అనుమతి లేకుండానే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడమే అప్పట్లో ఇరుపక్షాల మధ్య అగ్గి రాజేసింది. యుద్ధం తర్వాత కూడా చైనా ఎన్నో ప్రాంతాలను ఆక్రమించింది. ఆక్సాయిచిన్ తమదేనని ప్రకటించుకుంది. గల్వాన్ ప్రాంతంపై పట్టు సాధిస్తే భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరే అవకాశం లేదని భావిస్తున్న చైనా పథకం ప్రకారమే దాడులకు తెగబడుతోంది. పీఠభూముల్లోనూ, పర్వత శ్రేణుల్లో భారత్ సైనికులు బలంగా ఉంటే, ఆక్సాయిచిన్ ప్రాంతంలో చైనా బలంగా ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు కూడా ఆ దేశం దగ్గర ఉండడం కలవర పెట్టే అంశం. అయితే 1962తో పోల్చి చూస్తే భారత్ అన్ని రకాలుగా బలమైన దేశంగా అవతరించింది. ‘‘ఆక్సాయిచిన్‌లో చైనా బలంగా ఉంది. అయితే కరోనా వైరస్‌తో చైనా అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ దౌత్యపరంగా బలహీనంగా ఉండటం మనకు లాభం చేకూరే అంశం’’ అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఎస్డీ ముని వ్యాఖ్యానించారు. -
దేనికైనా సిద్ధం!
-
ఎల్ఏసీలో సంసిద్ధంగా వైమానిక దళం
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా సైనిక సంపత్తిని తరలించడంతో భారత్ దీటుగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, రష్యా తయారీ యుద్ధ, రవాణా విమానాలను ఈ ప్రాంతంలో వాడుతోంది. కీలకప్రాంతాల్లో నిఘా విధులతోపాటు ఫార్వర్డ్ పోస్టులకు జవాన్లను, ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రిని ఇవి తరలిస్తున్నాయి. రష్యా తయారీ అత్యాధునిక సుఖోయ్–30 ఎంకేఐలు, ఎంఐజీ–29 యుద్ధ విమానాలు ఇప్పటికే గగనతలంలో పహారాకాస్తున్నాయి. సరిహద్దులకు సమీపంలోని ఈ వైమానిక కేంద్రంలో అమెరికా తయారీ రవాణా వాహనాలు సీ–17, సీ–130జేతోపాటు రష్యా తయారీ ఇల్యుషిన్–76, ఆంటొనొవ్–32లు కూడా ఇక్కడ మోహరించారు. తూర్పు లద్దాఖ్ సెక్టార్లో యుద్ధ విధుల కోసమే ప్రత్యేకించిన అపాచీ యుద్ధ విమానాలను వినియోగించుకుంటున్నారు. ఆర్మీ, ఐటీబీపీ బలగాలను సరిహద్దుల సమీపంలోకి తరలించేందుకు చినూక్, ఎంఐ–17వీఐ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తమ్మీద ఈ ఎయిర్ బేస్ విమానాల రాకపోకలతో సందడిగా మారింది. ‘ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. యుద్ధ విధులతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరాలు అందుతుంటాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది’ ఓ అధికారి అన్నారు. -
మన సరిహద్దు క్షేమం
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనా సాగించిన దురాగతానికి యావద్దేశం గాయపడిందని, ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ శాంతిని, స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అదే సమయంలో, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అదే మనకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్ధంగా వ్యవహరిస్తోందన్నారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వాస్తవాధీన రేఖకు సంబంధించి భారత్ విధానాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు స్పష్టం చేశామని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలతో పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు అమరులై, చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని∙మోదీ శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని భేటీలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి చైనా సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణ తదనంతర పరిణామాలను, ప్రస్తుత పరిస్థితిని మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్ పార్టీల నేతలకు వివరించారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదట, చైనాతో సరిహద్దు ఘర్షణల్లో అమరులైన 20 మంది వీర జవాన్లకు ప్రధాని, మంత్రులు, పార్టీల నేతలు 2 నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులర్పించారు. జవాన్ల త్యాగం వృధా కాబోదని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్ వైపు చూసే ధైర్యం చేసినవారికి మన వీర జవాన్లు తగిన గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లోని భారత భూభాగాల్లోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వివరణ ఇచ్చారు. మన భూభాగంలో ఒక అంగుళాన్నైనా ఎవరూ ఆక్రమించుకునే ధైర్యం చేయలేనంత స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించుకున్నామన్నారు. ఈ భేటీలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్ర శేఖర రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, డీఎంకే నేత స్టాలిన్, బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం నేత సీతారాం యేచూరి పాల్గొన్నారు. చైనా పెట్టుబడులు వద్దు: మమత భారత్‌లోని మౌలిక వసతుల రంగంలో చైనా పెట్టుబడులను అంగీకరించవద్దని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమ పార్టీ కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. కమిటీ ఏర్పాటు చేస్తారా?: యేచూరి చైనాతో సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డానికి, 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి నిఘా వైఫల్యం కారణమా అని తేల్చేందుకు ఏదైనా కమిటీని నియమిస్తారా? అని సీపీఎం నేత సీతారాం యేచూరి ప్రశ్నించారు. గతంలో కార్గిల్ వార్ అనంతరం.. వైఫల్యాలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఒక కమిటీ వేసిన విషయాన్ని యేచూరి గుర్తు చేశారు. మీ సైనికులెవరూ మా ఆధీనంలో లేరు:చైనా బీజింగ్: భారతీయు సైనికులు ఎవరూ ‘ప్రస్తుతం‘తమ ఆధీనంలో లేరని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో జూన్ 15న భారత్ చైనాల మధ్య ఘర్షణలో పొరుగుదేశం మన సైనికులను బందీలుగా చేసి తీసుకెళ్లిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ మీడియాకు ఈ విషయం తెలిపారు. నిఘా వైఫల్యమా?: సోనియా సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల్లో 20 మంది భారత జవాన్ల మృతికి నిఘా వైఫల్యం కారణమా? అని సోనియాగాంధీ ప్రశ్నించారు. గాల్వన్ లోయలో యథాతథ స్థితి నెలకొంటుందని, చైనా వెనక్కు వెళ్తుందని హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరారు. భేటీ ప్రారంభంలో సోనియా పలు ప్రశ్నలను సంధించారు. చైనా దళాలు తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగంలోకి వచ్చాయా? వస్తే ఎప్పుడు వచ్చాయి? ఆ ప్రాంతంలో చైనా దళాల అసాధారణ కదలికలపై మన నిఘా సంస్థలు సమాచారం ఇవ్వలేదా? అని ఆమె ప్రశ్నించారు. తదుపరి కార్యాచరణ ఏమిటన్నారు. సైనికుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన మే 5 నుంచి జూన్ 6 వరకు విలువైన కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని ఆరోపించారు. మమ్మల్ని ఆహ్వానించరా? ఈ భేటీకి ఆహ్వానించకపోవడంపై ఆప్, ఆర్జేడీ, ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్‌యాదవ్, ఆయన కూతురు మీసాభారతి, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బిహార్‌లో తమది ప్రధాన ప్రతిపక్షమని, ఈ భేటీకి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. అయితే, అన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్‌సభలో ఐదుగురు, లేదా ఆపై ఎంపీలున్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేబినెట్లో మంత్రులున్న పార్టీలను మాత్రమే భేటీకి ఆహ్వనించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లేహ్‌లో ఐఏఎఫ్ చీఫ్ భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో.. భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా లేహ్, శ్రీనగర్‌ల్లో పర్యటించారు. ఎయిర్‌ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. -
ఆ దేశాల మీదుగా వెళ్లేటప్పుడు జాగ్రత్త!!
న్యూఢిల్లీ: ఇరాన్‌లోని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ దేశానికి చెందిన విమానం కూలిపోయిన నేపథ్యంలో..ఇరాన్, ఇరాక్, ఒమన్, పర్షియన్ గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ఎయిర్‌లైన్స్‌లు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ డీజీసీఏ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా పర్షియన్ గల్ఫ్ మీదుగా అమెరికన్ విమానాలను నిలిపివేయాలని ఆదేశించింది. -
కూలిన విమానం
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్లో ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన పౌర విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్, కెనడా దేశస్తులే అత్యధికంగా ఉన్నారు. ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. రెండు నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు (యూఐఏ) చెందిన పీఎస్ 752 విమానం టెహ్రాన్ విమానాశ్రయంనుంచి ఉదయం 6:10 గంటలకి టేకాఫ్ అయింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే రాడార్‌తో సంకేతాలు తెగిపోయాయి. టెహ్రాన్ విమానాశ్రయానికి వాయవ్య దిశగా 45 కి.మీ. దూరంలో షారియార్లోని పంట పొలాల్లో విమాన శిథిలాలు కనిపించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న 176 మందిలో ఎవరూ జీవించే అవకాశమే లేదు. ఇరాన్ మీడియా ప్రసారం చేసిన వీడియోలో విమానం కూలిన ప్రాంతంలో మంటలు, దట్టమైన పొగ అలము కొని ఉన్నాయి. సహాయ సిబ్బంది మృతదేహాలను, ప్రయాణికుల వస్తువులను మోసుకొస్తున్న దృశ్యాలు అందరి హృదయాల్ని కలిచివేశాయి. కూలిపోయిందా ? కూల్చేశారా ? ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోకుండా, వేరే ఏదైనా కుట్ర కోణం ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెంస్కీ హెచ్చరించారు. సందేహాలు ► ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ఇరాన్ క్షిపణులకి పొరపాటున తగలడం వల్లే విమానం ప్రమాదానికి గురైందన్న అనుమానాలున్నాయి. ► బోయింగ్ 737 విమానం 2016లో తయారు చేశారు. ప్రమాదానికి గురైన రెండు రోజుల ముందే దానిని తనిఖీ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఈ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటి సారి. విమానం పూర్తిగా పనిచేసే సామర్థ్యంలోనే ఉందని యూఐఏ అధ్యక్షుడు యెవగనీ వెల్లడించారు. తాము నడిపే విమానాల్లో ఇదే అత్యుత్తమమైనదనీ కన్నీళ్ల మధ్య చెప్పారు. ► విమానం కుప్పకూలాక మంటల్లో చిక్కుకుం దని ఇరాన్ మీడియా వెల్లడించింది. కానీ గాల్లోనే విమానం మంటల్లో చిక్కుకున్నట్టుగా ప్రమాద దృశ్యాల్లో కనిపిస్తోంది. ► విమానంలో టిక్కెట్ బుక్ చేసుకొని ఆఖరి నిముషంలో ఇద్దరు ప్రయాణికులు రద్దు చేసుకున్నారని ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ ఒలెక్సీ డేనిలవ్ అంటున్నారు. ► ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్ సంస్థకు కానీ, అమెరికాకి కానీ ఇరాన్ ఇంకా ఇవ్వలేదు. విమాన ప్రమాదంపై విచారణ ఏ దేశం చేస్తుందో స్పష్టత లేదని అందుకే ఇవ్వలేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ► ఈ విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉన్నట్టుగా తాము భావించడం లేదని బోయింగ్ సంస్థ చెబుతోంది. అంతకు ముందు ఇరాన్లో ఉక్రెయిన్ దౌత్యకార్యాలయం తన వెబ్సైట్లో ఈ ప్రమాదం వెనుక ఎవరి హస్తం లేదని, ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఇంజిన్ వ్యవస్థ పనిచేయకపోవడమే కారణమని భావిస్తున్నట్టు వెల్లడించింది. -
ఆ క్యాంప్‌ల కహానీ
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాక్‌లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులకు దిగామంటూ ఇరాన్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అగ్రరాజ్యం ముఖం మీద చెంపదెబ్బకొట్టినట్టుగా రెండు స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేని వ్యాఖ్యానించడంతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న అమెరికా స్థావరాలేవి? ఎందుకు వాటికంత ప్రాధాన్యత ? అల్ అసద్ స్థావరం పశ్చిమ బాగ్దాద్‌కు 100 మైళ్ల దూరంలో ఎడారి మధ్యలో 1980 సంవత్సరంలో ఇరాక్ మిలటరీ ఈ వైమానిక స్థావరాన్ని నిర్మించింది. ఇరాకీయుల విముక్తి కోసం 2003లో వచ్చిన అమెరికా సైన్యానికి అదే అతి పెద్ద సైనిక స్థావరంగా మారింది. ఈ స్థావరంలో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాయి. చిన్న టౌన్ మాదిరిగా అమెరికా ఈ స్థావరాన్ని తీర్చిదిద్దింది. 2009–10లో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాక తిరిగి ఇరాక్ స్వాధీనంలోకి వచ్చింది. అరబ్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడానికి 2014లో అమెరికా బలగాలు తిరిగి ఇరాక్‌కి వచ్చాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడంలో ఈ స్థావరమే కీలక పాత్ర పోషించింది. గత రెండేళ్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇద్దరూ ఆకస్మికంగా ఈ స్థావరాన్ని సందర్శించారు. ఇర్బిల్ స్థావరం కుర్దిస్తాన్ ప్రాంతంలో ఇర్బిల్ స్థావరం ఉంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేతకు అమెరికా ఈ స్థావరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుంది. 2018 క్రిస్మస్ సెలవుల్లో ట్రంప్ అనూహ్యంగా ఇరాక్‌కు వచ్చి ఈ స్థావరాన్ని సందర్శించారు. డెల్టా ఫోర్స్ కమాండోలు ఈ స్థావరాన్నే ప్రధాన కేంద్రంగా చేసుకొని నిర్వహించిన ఆపరేషన్‌లో గత ఏడాది అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది హతమయ్యాడు. అమెరికా బలగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ నుంచే వీక్షించారు. 2015లో ఐసిస్ తీవ్రవాదులు పలుమార్లు ఈ స్థావరాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. 13 దేశాలకు చెందిన సంకీర్ణ బలగాలు, ఇతర సిబ్బంది ఇక్కడ ఉన్నారు. ఇరాక్‌లో మొత్తం అమెరికా బలగాలు: 6,000 అల్ అసద్ స్థావరంలో అగ్రరాజ్యం సైనికులు: 1,500 ఇర్బిల్ స్థావరంలో బలగాలు: 3,000 జనరల్ సులేమానీ హత్య తర్వాత ఇరాక్ పార్లమెంటు అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవాలంటూ తీర్మానించింది. కానీ అల్ అసద్ స్థావరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడానికి అమెరికా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని, వాటిని తిరిగి చెల్లించే వరకు ఇరాక్ నుంచి కదిలే ప్రసక్తే లేదని ట్రంప్ అంటున్నారు. -
సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో
పారిస్: అమెరికా–ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో ఇరుదేశాలకు యునెస్కో కీలక సూచన చేసింది. దేశాల్లోని చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలను ఇరు దేశాలు పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్ ఇరాన్ దౌత్యవేత్తతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్, అమెరికాలు 1972లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సాంస్కృతిక కట్టడాలకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని చెప్పారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే ఇరాన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.