కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తోఢిల్లీలో రైతులు సాగిస్తున్న అవిశ్రాంత పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతోంది. పలువురు ప్రముఖులు రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో కొందరు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బుధవారం రైతు అనుకూల, ప్రభుత్వ అనుకూల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘‘భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాలపాటు విదేశీ వలసవాదులు అక్రమించుకున్నారు, పాలించారు, లూటీ చేశారు. దేశం బలహీనంకావడం వల్ల కాదు, ఇంటి దొంగల వల్లే ఇదంతా జరిగింది. ఇండియాను అప్రతిష్టపాలు చేసే దిశగా జరుగుతున్న అంతర్జాతీయ ప్రచారం వెనుక ఎవరున్నారో ప్రశ్నించాలి’’
– కిరణ్ రిజిజు, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
‘‘భారతదేశ శక్తి సామర్థ్యాలు పెరుగుతుండడం చూసి అంతర్జాతీయ శక్తుల్లో వణుకు పుడుతోంది. అందుకే దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రలు సాగిస్తున్నాయి’
– రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్
‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకొనే సత్తా ఉంది’’
– అనిల్ కుంబ్లే, మాజీ క్రికెటర్
‘‘అర్ధ సత్యం కంటే మరింత ప్రమాదకరమైనది ఇంకేదీ లేదు’’
– సునీల్ శెట్టీ, బాలీవుడ్ హీరో
‘‘అరాచక శక్తులను అరాధించే అంతర్జాతీయ ముఠాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఢిల్లీలో హింసను ఎలా ప్రేరేపించారో, జాతీయ జెండాను ఎలా అవమానించారో మనమంతా చూశాం. మనమంతా ఇప్పుడు ఏకం కావాలి. ఇలాంటి శక్తులను ఓడించాలి’’
– హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
‘‘ఇండియాకు, ఇండియా విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దు’’
– అజయ్ దేవగణ్, నటుడు
‘ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి’
–సాగు చట్టాలపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లపై భారత విదేశాంగ శాఖ ‘ప్రచారంతో దేశ ఐక్యతను దెబ్బతీయలేరు. దేశం ఉన్నత శిఖరాలు అధిరోహించకుండా అడ్డుకోలేరు. దేశ భవిష్యత్తును నిర్దేశించేది అభివృద్ధే తప్ప ప్రచారం కాదు’
–కేంద్ర మంత్రి అమిత్ షా
రైతు ఉద్యమంపై ట్వీట్ వార్
Published Thu, Feb 4 2021 3:33 AM | Last Updated on Thu, Feb 4 2021 6:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment