స్వచ్ఛ భారత్‌కు సాయం చేస్తాం
బిల్ గేట్స్ హమీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పారిశుధ్య సేవలను అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి సహకారాన్ని అందిస్తామని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హమీ ఇచ్చారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ అయిన బిల్ గేట్స్ శుక్రవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడుతో సమావేశమై పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ అమలు తీరుపై చర్చించారు. నాణ్యత కలిగిన మరుగుదొడ్ల సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తేవాలని గేట్స్ సూచించారు.
క్లీన్ ఇండియా ఒక్క రోజులో సాధ్యం కాదని, అయితే ఆ దిశగా శుభారంభం అయిందని వెంకయ్య అన్నారు. బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.