కేంద్రాన్ని ప్రశ్నించిన తమ్మినేని
తెలుగుజాతికి ద్రోహం చేస్తున్న చంద్రబాబు, సోనియా
సాక్షి, హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ఏ ప్రాతిపదికన విభజిస్తు న్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థి తులపై అధ్యయనం కోసం వేసిన జస్టిస్ శ్రీకృష్ణ, రోశయ్య, ఆంటోనీ కమిటీల్లో దేని నివేదిక ఆధా రంగా రాష్ట్రాన్ని విభజించాలను కున్నారని నిల దీశారు. దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాల కోసం దాదాపు 22 డిమాండ్లు కేంద్రం వద్ద ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకు ఈ విధంగా వ్యవహ రిస్తున్నారని అడిగారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం తమ్మినేని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ కలిసి తెలుగు జాతికి తీరని ద్రోహం తలపెడు తున్నారని దుయ్య బట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయమంటూ లేఖల మీద లేఖలు రాసిన చంద్రబాబుకు, సమైక్యంగా ఉంచమని ఒక్కలేఖ రాయడానికి చేతులు రావడం లేదని మండి పడ్డారు. పైగా రాష్ట్రాన్ని కొబ్బరి చిప్పలా సమంగా విభజించాలంటూ కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇస్తున్నారని విమర్శించారు.
ఏ ప్రాతిపదికన విభజిస్తారు?
Published Fri, Dec 6 2013 5:01 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement