వాట్సాప్ క్రేజీ ఫీచర్.. ఇండియాలో లాంచింగ్
Published Tue, Nov 15 2016 6:18 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరో సూపర్ ఫీచర్‌ను యూజర్లకు అందిస్తోంది. వాట్సాప్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వీడియో కాల్స్ ఫీచర్‌ను భారత్‌దేశంలో అధికారికంగా మొదట ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 180 దేశాల్లో ఈ సేవలను అందించేందుకు మాతృసంస్థ ఫేస్‌బుక్ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు వాయిస్ కాల్ సదుపాయాన్ని అందిస్తూ వచ్చిన వాట్సాప్ ఇప్పుడు వీడియోకాల్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, విండో ఫోన్ యూజర్లు ఇప్పుడు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. త్వరలో అధికారికంగా ప్రారంభించనున్న ఈ ఫీచర్‌ను యూజర్లు ఇప్పటినుంచే పరీక్షించవచ్చు. లెటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా కాల్ సెక్షన్‌లోకి వెళ్లి వీడియో కాల్ ను చేసుకునే వీలుంటుందని తెలుస్తోంది.
వాట్సాప్‌లో వాయిస్ కాల్ ఆప్షన్‌తోపాటు దాని పక్కన వీడియోకాల్ ఆప్షన్ కూడా ఉంటుందని సమాచారం. వీడియో కాల్ అందుబాటులోకి వస్తే ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతోపాటు, బ్యాక్ కెమెరాతో కూడా ఈ ఫీచర్‌ను వాడుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా అవసరం లేకుంటే మ్యూట్ చేసుకొనే సదుపాయం, మిస్డ్‌కాల్ వస్తే తెలియజేసే సౌకర్యం కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది.
వాట్సాప్ గత ఫీచర్ల మాదిరిగానే ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గూగుల్ కంపెనీ వీడియో కాల్స్ కోసం డ్యువో ఆప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు స్నాప్‌చాట్ వంటి యాప్‌లు కూడా పోటీని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ మరిన్ని మెరుగైన ఫీచర్లతో తన యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
భారత్‌పై ఫోకస్
మరో విశేషమేమిటంటే న్యూఢిల్లీలో వాట్సాప్ తన వీడియో కాల్ ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేయబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకుపైగా యూజర్లు ఉన్న వాట్సాప్ ప్రధానంగా భారత్‌పై దృష్టి పెట్టింది. ఇక్కడ యూజర్లను గణనీయంగా పెంచుకోవాలనే దృష్టితోనే ఢిల్లీలో ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తున్నట్టుభావిస్తున్నారు.
Advertisement
Advertisement