సీఎం చైర్మన్‌గా వైల్డ్‌లైఫ్ రాష్ట్ర మండలి ఏర్పాటు
వైస్ చైర్మన్‌గా అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: అటవీ సంరక్షణ, వన్యప్రాణుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ‘వైల్డ్‌లైఫ్’ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైర్మన్‌గా, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న వైస్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో అటవీ ప్రాంతానికి చెందిన ముగ్గురు శాసనసభ్యులు, వన్యప్రాణుల కోసం కృషి చేస్తున్న ముగ్గురు ఎన్జీవో సభ్యులు, 10 మంది పర్యావరణ వేత్తలు, 12 మంది వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు.
మూడేళ్ల కాల పరిమితితో ఈ వైల్డ్‌లైఫ్ బోర్డు పనిచేస్తుంది. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు, అటవీ విస్తీర్ణం పెంచేందుకు చేయాల్సిన కృషి తదితర అంశాలపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. ఈ మేరకు మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి ఉత్తర్వులు జారీ చేశారు.
వైల్డ్‌లైఫ్ సభ్యులు వీరే..
ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, కె.కనకయ్య, జి.బాలరాజ్, ఎన్జీవో సభ్యులు అనిల్ కుమార్ వి ఏపూర్, ఎం.షఫతుల్లా, ఎం. ఇందిరతో పాటు పర్యావరణ వేత్తలు డాక్టర్ కార్తికేయన్, వాసుదేవన్, కె.జగన్‌మోహన్ రావు (రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్), అవినాశ్ విశ్వనాథన్, డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ వాసుదేవరావు, ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ హెచ్‌వోడీ, హైటికోస్ కార్యదర్శి ఇమ్రాన్ సిద్ధిఖీ, ఫరీదా టాంపాల్, రాథోడ్ జనార్దన్, కనక లక్కేరావు, 12 మంది అధికారులు సభ్యులుగా ఉన్నారు.