
మౌనంగా ఉండడమే మంచిది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి సంబంధంలేని విషయాలపై మీడియాలో వచ్చే కథనాల పట్ల మౌనం వహించాలని ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలకు సూచించారు. హస్తినలో బంఫర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తమపై మీడియాలో ఒక వర్గం బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ఇందులో భాగంగా తమ పార్టీపై వదంతులు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆప్' అప్రదిష్ట పాలు చేసేందుకు మీడియాలో ఒక వర్గం ప్రయత్నిస్తోందని వాపోయారు. కుమార్ విశ్వాస్ తో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు వదంతులు పుట్టించారని ఆప్ మహిళా కార్యకర్త ఆరోపించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ సూచనలు చేశారు.