బార్‌లో భర్త ఎదుటే మహిళపై అఘాయిత్యం! | Woman molested in front of husband in posh Park Street bar | Sakshi
Sakshi News home page

బార్‌లో భర్త ఎదుటే మహిళపై అఘాయిత్యం!

Published Tue, Apr 4 2017 8:51 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

బార్‌లో భర్త ఎదుటే మహిళపై అఘాయిత్యం!

బార్‌లో భర్త ఎదుటే మహిళపై అఘాయిత్యం!

పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాలో మరో ఘోరం జరిగింది. అక్కడి ప్రఖ్యాత పార్క్‌స్ట్రీట్‌లోని ఓ నైట్ క్లబ్బులో భర్త కళ్లెదుటే తనపై లైంగిక దాడి జరిగిందని ఓ మహిళ ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు బాగా తాగేసి తనపై దాడి చేశారని ఆమె చెప్పారు. తాను తన భర్తతో కలిసి ఓ బార్‌కు వెళ్లినప్పుడు అక్కడి స్థలాన్ని తాము రిజర్వు చేసుకున్నామని, అక్కడికెందుకు వచ్చారంటూ కొందరు వ్యక్తులు తమతో గొడవ పడినట్లు ఆమె తెలిపారు. వాళ్లు తనను ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా తాకారని, నేల మీదకు పడేశారని అన్నారు. ఇలా వేధించిన వాళ్లలో కోల్‌కతాలోని బాగా డబ్బున్న వ్యాపారవేత్త కొడుకు కూడా ఉన్నాడని దంపతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడే ఈ దాడి వెనక ప్రధాన నిందితుడని చెప్పారు.

తన మీద దాడి చేసిన వ్యక్తి చాలా ఎక్కువగా తాగేశాడని, తనకు పెద్ద పెద్దవాళ్లు తెలుసంటూ తమను బెదిరించాడని అన్నారు. 'మా నాన్న ఎవరో నీకు తెలియదు. నాతో పెట్టుకోకు జాగ్రత్త' అని అతడు హెచ్చరించాడన్నారు. తమ స్నేహితులైన వేరే జంటతో కలిసి తాము ఆ బార్‌కు వెళ్లామని తెలిపారు. చివరకు క్లబ్బు యజమానులు, బౌన్సర్లు వచ్చి జోక్యం చేసుకోవడంతో ఎలాగోలా బయటపడినట్లు చెప్పారు. ఇటీవలే పిల్లాడికి జన్మనిచ్చిన తాను.. ఈ దాడితో ఒక్కసారిగా షాకయ్యానని, ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పారు. మహిళలకు నగరంలో రక్షణ లేదా అని ప్రశ్నించారు. పోలీసులు త్వరగా స్పందించాలని కోరారు. ఇదంతా కేవలం డబ్బుందన్న మదం తప్ప మరోటి కాదని, వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement