షాజహాన్‌పూర్: సుమారు 12 సంవత్సరాల వయసులో తనపై అత్యాచారానికి పాల్పడ్డవారిపై 27 సంవత్సరాల తర్వాత ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తన తండ్రెవరని ఆమె కుమారుడు ఆమెను ప్రశ్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 27 సంవత్సరాల క్రితం తన సోదరితో కలిసి నివసిస్తుండగా, స్థానికంగా ఉండే నకి హసన్ అనే వ్యక్తి ఇంట్లోకి జొరపబడి అత్యాచారం జరిపాడని, అనంతరం అతని సోదరుడు గుడ్డు అనే వ్యక్తి కూడా అత్యాచారం చేశాడని, హసన్, గుడ్డు ఆ తర్వాత పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొనట్లు పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో ఆమెకు 12సంవత్సరాలున్నట్లు తెలిపారు. ఈ దుశ్చర్య ఫలితంగా 13ఏళ్లకే ఆమె గర్భం దాల్చి 1994లో ఒక బాలుడికి జన్మనిచి్చంది. తొలుత పోలీసులు ఈ కేసు నమోదుకు అంగీకరించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించి ఫిర్యాదును రిజిస్టర్ చేయించారు.
చదవండి:
దారుణం: ఇంటికి నిప్పు.. అత్యాచార బాధితురాలు మృతి
Comments
Please login to add a commentAdd a comment