సినిమా కాదు రియల్‌; ఆమె.. 11 మంది భర్తలు! | Woman who duped 11 husbands nabbed | Sakshi
Sakshi News home page

సినిమా కాదు రియల్‌; ఆమె.. 11 మంది భర్తలు!

Published Sun, Dec 18 2016 9:12 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

సినిమా కాదు రియల్‌; ఆమె.. 11 మంది భర్తలు!

సినిమా కాదు రియల్‌; ఆమె.. 11 మంది భర్తలు!

నోయిడా: మ్యాట్రిమనీ ద్వారా పెళ్లి పేరుతో సంపన్నులకు వల వేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు వారితో కాపురం చేయడం.. సమయం చూసుకుని డబ్బులు, నగదుతో ఉడాయించడం.. తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోవడం.. ఇదీ తంతు. చివరకు భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి విచారించగా, అసలు విషయం బయటపడింది. సినిమా కథను తలపించేలా ఉన్న ఈ క్రైం స్టోరీకి దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలో ముగింపు పడింది. నిందితురాలయిన 28 ఏళ్ల మేఘ భార్గవ్‌ను శనివారం నోయిడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె నుంచి డబ్బు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కోచికి చెందిన లోరెన్‌ జస్టిన్‌ అనే వ్యక్తి గత అక్టోబరులో తన భార్య మేఘ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేఘతో పాటు 15 లక్షల రూపాయల డబ్బు, బంగారు ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేరళ పోలీసుల బృందం నోయిడా పోలీసుల సాయంతో విచారణ చేసి.. రెండు నెలల తర్వాత మేఘతో పాటు ఆమె సోదరి ప్రాచి, సోదరి భర్త దేవేంద్ర శర్మలను అదుపులోకి తీసుకున్నారు. మేఘ.. జస్టిన్‌ కంటే ముందు కేరళకు చెందిన మరో ముగ్గురిని పెళ్లి చేసుకుని వారిని మోసం చేసినట్టు విచారణలో తేలింది. మేఘ మ్యాట్రిమనీ ద్వారా విడాకులు తీసుకున్న, ఒంటరిగా ఉన్న సంపన్నులను గుర్తించి పెళ్లి చేసుకుందని, కొన్ని నెలల తర్వాత సమయం చూసుకుని ఇంట్లోని విలువైన వస్తువులు, డబ్బు తీసుకుని పారిపోయిందని పోలీసులు తెలిపారు. వధువు కావాలని ప్రకటన ఇచ్చిన చాలా మంది ఆమె మాయలో పడ్డారని చెప్పారు. మేఘ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌. ఆమె సోదరి భర్త దేవేంద్ర సాయంతో పెళ్లి పేరుతో 11 మందిని మోసం చేసింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement