భారత వైమానిక దళంలో మహిళలను ఫైటర్ పైలట్లగా నియమిస్తామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా చెప్పారు.
న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విమాన, హెలికాప్టర్ల పైలట్లుగా సేవలందిస్తున్న మహిళలు.. ఇక యుద్ధ రంగంలో కూడా కదంతొక్కబోతున్నారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్లగా మహిళలను నియమిస్తామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా చెప్పారు.
'రవాణ విమాన, హెలికాప్టర్ పైలట్లుగా మహిళలు పనిచేస్తున్నారు. ఆసక్తిగల యువతులను ఫైటర్ పైలట్లుగా నియమించాలని భావిస్తున్నాం' అని రహా చెప్పారు. 83వ ఎయిర్ ఫోర్స్ డే పరేడ్లో ఆయన పాల్గొన్నారు. భారత వైమానిక దళంలో దాదాపు 300 మంది మహిళా పైలట్లు ఉన్నట్టు అధికారులు చెప్పారు.