Women pilots
-
సౌదీ ఏవియేషన్ చరిత్రలో తొలిసారి..
Women-only Crew Operates: గల్ఫ్ దేశాల్లో మహిళలకు ఎలాంటి ఆంక్షలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి సౌదీ అరేబియాలో తొలిసారిగా ఒక విమానాన్ని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. అందులో మొత్తం మహిళా సిబ్బందే పనిచేస్తారు. ఇది మహిళా సాధికారతకు ఒక పెద్ద నిర్వచనంగా చెప్పవచ్చు. ఈ విమానాన్ని ఇటీవలే ప్రారంభించామని ఒక చిన్న దేశీయ ప్రయాణాన్ని కూడా చేసిందని సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు ఎర్రసముద్ర తీరం నుంచి జెడ్డా వరకు విమానాన్ని నడిపారని కూడా తెలిపారు. ఫ్లైడీల్ ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తుండగా, సౌదీ విమానయాన చరిత్రలో తొలిసారిగా సరికొత్త ఏ 320 విమానాన్ని మొత్తం మహిళా సిబ్బందితో నడిపించిందని అన్నారు. అంతేకాదు ఈ విమానాన్ని నడిపిన మహిళా ఫైలెట్ కూడా అత్యంత పిన్న వయసురాలు కావడం మరో విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో ఎక్కువ శాతం మహిళల భాగస్వామ్యం ఉండేలా కృషి చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ విమానాన్ని పూర్తిగా మహిళలే నిర్వహించేలా చేసింది. For the first time in Saudi aviation history!🇸🇦 #flyadeal operated the first flight with all-female crew, majority of which are Saudis by the newest A320 aircraft. Flight 117, flew from #Riyadh to #Jeddah ✈️💜 pic.twitter.com/fWo08hYMd7 — طيران أديل (@flyadeal) May 20, 2022 (చదవండి: వైరల్ వీడియో.. ఎయిర్‌పోర్టులో కన్వేయర్ బెల్ట్‌పై మృతదేహం?) -
గగన నేత్రాలు.. ముగ్గురు మహిళా పైలట్లు
మారిటైమ్ రికానిసెన్స్! పెద్ద బాధ్యత. సముద్ర గగనతలం నుంచి నలు దిక్కుల్లో నిఘా! అంతటి కీలకమైన విధుల్లోకి గురువారం ముగ్గురు మహిళా లెఫ్టినెంట్లు కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ (ఎస్.ఎన్.సి.) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని వచ్చారు. ఆ ముగ్గురూ దివ్యాశర్మ, శుభాంగి స్వరూప్, శివాంగి. నేవీ ఫస్ట్ బ్యాచ్ మహిళా పైలట్లు. ‘డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్’ (డి.ఓ.ఎఫ్.టి.)ను విజయవంతంగా పూర్తి చేసిన ఈ మహిళల చేతికి నేవీ ఇప్పుడు డోర్నియర్ నిఘా విమానాలు నడిపే బాధ్యతను అప్పగించబోతోంది! ‘పాసింగ్ అవుట్ పరేడ్’ కు ముఖ్య అతిథిగా హాజరైన రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జి.. ‘నేవీకి ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని దివ్య, శుభాంగి, శివాంగిలను అభినందించారు. నేవీ పైలట్లుగా దివ్య (ఢిల్లీ), శుభాంగి (యు.పి.), శివాంగి (బిహార్) మొదట ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రాథమిక శిక్షణ పొందారు. గత ఏడాది డిసెంబరులో శివాంగి, ఈ ఏడాది ఆరంభంలో మిగతా ఇద్దరు ఎయిర్ ఫోర్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం నేవీ ఈ ముగ్గురిని కొచ్చిలో డి.ఓ.ఎఫ్.టి. శిక్షణకు పంపింది. వీళ్లతోపాటు మరో ముగ్గురు పురుషులు ఆ ట్రైనింగ్ తీసుకున్నారు. నెల రోజులు గ్రౌండ్ ట్రైనింగ్, ఎనిమిది నెలలు ఫ్లయింగ్ ట్రైనింగ్. గ్రౌండ్ ట్రైనింగ్‌లో లెఫ్టినెంట్ శివ, ఫ్లయిట్ ట్రైనింగ్‌లో లెఫ్టినెంట్ దివ్య ప్రథమ స్థానంలో నిలిచారు. ఎయిర్‌ఫోర్స్‌లో ముందుగా శిక్షణ పూర్తి చేసుకున్న శివాంగి స్వస్థలం ముజఫర్‌పుర్. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్. తల్లి గృహిణి. శివాంగి మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎంటెక్‌లో చేరారు. నేవీలో అవకాశం రావడంతో మధ్యలోనే ఆపేశారు. శుభాంగి స్వరూప్ స్వస్థలం యూపీలోని బరేలీ. భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్. 2017లో ఎళిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఆఫీసర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. తమిళనాడులోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ చేశాక, హైదరాబాద్‌లోని ఎయిర్స్‌ఫోర్స్ అకాడమీ నుంచి శిక్షణ పొంది, తర్వాత నేవీలోకి మారారు. కరాటే ఛాంపియన్ కూడా. శుభాంగి తండ్రి నేవీ అధికారి. తల్లి నేవీ స్కూల్లో టీచర్. దివ్య, శుభాంగి, శివాంగి.. ఈ ముగ్గురు పైలట్లు డోర్నియర్ బాధ్యతలను స్వీకరించనుండటంతో నేవీలో సందడి నెలకొంది. గత నెలలో కూడా రితీసింగ్, కుముదినీ త్యాగీ అనే నేవీ సబ్లెఫ్టినెంట్లు ‘అబ్జర్వర్’ కోర్సును పూర్తి చేసి యుద్ధనౌకల్లోని ఫైటర్ హెలికాప్టర్ల తొలి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించారు. -
మూడో వంతుకు మహిళా పైలట్లు: స్పైస్ జెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’ తాజాగా మహిళా పైలట్ల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ ఆరంభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం పైలట్లలో మహిళల వాటాను మూడో వంతుకు పెంచుకోవాలని స్పైస్‌జెట్ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 800 మంది పైలెట్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య 140. బోయింగ్ 737, బొంబార్డియర్ క్యూ400 విమానాల కోసం మహిళా పైలట్లను నియమించుకుంటామని కంపెనీ తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగుస్తుంది. ఇప్పటికే 175కు పైగా దరఖాస్తులు వచ్చాయని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్ యువ మహిళా కెప్టెన్లు కాబుల్ వంటి క్లిష్టమైన ఎయిర్ఫీల్డ్స్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారని సంస్థ డైరెక్టర్ శివాని సింగ్ కొనియాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పూర్తి మహిళా సిబ్బందితో ఉన్న మూడు ప్రత్యేక విమానాలను సంస్థ నడుపుతోంది. -
ఐఏఎఫ్ ఫైటర్ పైలట్లుగా మహిళలు
న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విమాన, హెలికాప్టర్ల పైలట్లుగా సేవలందిస్తున్న మహిళలు.. ఇక యుద్ధ రంగంలో కూడా కదంతొక్కబోతున్నారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్లగా మహిళలను నియమిస్తామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా చెప్పారు. 'రవాణ విమాన, హెలికాప్టర్ పైలట్లుగా మహిళలు పనిచేస్తున్నారు. ఆసక్తిగల యువతులను ఫైటర్ పైలట్లుగా నియమించాలని భావిస్తున్నాం' అని రహా చెప్పారు. 83వ ఎయిర్ ఫోర్స్ డే పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. భారత వైమానిక దళంలో దాదాపు 300 మంది మహిళా పైలట్లు ఉన్నట్టు అధికారులు చెప్పారు.