ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచం యావత్తు గొప్ప గౌరవ భావంతో భారత్ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నల్లధనంపై పోరుకు జీ20 దేశాలు అంగీకరించాయని అన్నారు. ప్రపంచ శాంతి, సుహృద్భావ వాతావరణాన్ని నల్లధనం బలహీనపరుస్తుందన్న అభిప్రాయంతో అన్ని దేశాలు ఏకీభవించాయని పేర్కొన్నారు.
మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ పర్యటన ముగించుకుని వచ్చిన మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు. తాజా విదేశీ పర్యటనలో 38 మంది ప్రపంచ నాయకులతో భేటీ అయినట్టు తెలిపారు. 20 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నానని వెల్లడించారు. ఈ సమావేశాలు నిష్పక్షపాతంగా, సమగ్రంగా, ఫలప్రదంగా జరిగాయని మోదీ వివరించారు.
A visit where I saw renewed respect & immense enthusiasm towards India. My blog on the recently concluded visit. http://t.co/apFTvVnyo6
— Narendra Modi (@narendramodi) November 21, 2014