దేశంలో ప్రతిభకు కొదవ లేదు. ఏమూలకు వెళ్లినా అద్భుతమైన ప్రతిభావంతులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. కానీ, వారికి తగినంత గుర్తింపు లేదు. ఢిల్లీలోని విలాసవంతమైన కనౌట్ ప్లేస్‌లో బెలూన్లు అమ్ముకొని జీవనం సాగించే ఈ పిల్లాడిలోనూ అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. గుర్తించే వారే లేరు.
రద్దీ ప్రదేశంలో ఎవరూ పట్టించుకోకపోయినా సంగీతం వినిపిస్తే చాలు అద్భుతమైన స్టెప్పులతో అదరగొడతాడు ఈ బాలుడు. అతని దుమ్మురేపే డ్యాన్స్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి హసిబా బీ ఆమిన్ అతని డ్యాన్స్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ నుంచి ఇంగ్లిష్ పాట వస్తుండగా.. ఆ పాటకు అనుగుణంగా కళ్లుచెదిరేరీతిలో డ్యాన్స్ చేశాడు అతడు. అతని డ్యాన్స్ చూసి చాలామంది స్టన్ అయ్యారు. అయితే, అతను ఈ స్టెప్పులు వేసింది డబ్బులు అడుకోవడానికి కాదు. బెలూన్లు అమ్మి పొట్టపోసుకుంటేనే తనకు నచ్చిన పాట వచ్చినప్పుడు ఇలా స్టెప్పులు వేస్తుంటాడు. ‘సరైన అవకాశాలు కనుక వచ్చి ఉంటే ఇతను ఎక్కడ ఉంటాడో ఊహించుకోండి’ అంటూ ఆమిన్ పెట్టిన ఈ వీడియోను ట్విట్టర్‌లో ఇప్పటికే 1600మందికి పైగా షేర్ చేశారు. అతని డ్యాన్స్ ప్రతిభను ప్రోత్సహించేందుకు పలువురు ముందుకొచ్చారు.
బెలూన్లు అమ్మే పిల్లాడు దుమ్మురేపాడు!
Published Sun, Oct 30 2016 9:47 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement