న్యూఢిలీ: హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ గురువారం ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన నిందితుడు కర ణ్‌పై ఐపీసీలోని 302, 149, 147,148 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. కేసు విచారణలో పథకం ప్రకారమే హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో శిక్షతోపాటు రూ. 5,000 జరిమానా కూడా ఖరారు చేసినట్లు అడిషన ల్ సెషన్స్ జడ్జి సవితారావు తెలిపారు.
2007లో కరణ్ అతడి స్నేహితులు కలిసి కత్తితో దాడి చేయడంతో ముకేష్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పరిశీలించిన మీదట పథకం ప్రకారమే హత్యచేసినట్లు భావించినట్లు జడ్జి తీర్పులో పేర్కొన్నారు.