జూలో విద్యార్థి ప్రాణాలు తీసిన పులి
న్యూఢిల్లీ: ఓ యువకుడు కొంతమంది స్నేహితులతో కలిసి జంతువుల్ని చూద్దామని జూకు వెళ్లాడు. కాసేపు జూలో బాగానే ఉన్నా. అతనికి అకస్మాత్తుగా ఏమనిపించిందో ఏమో గానీ.. ఉన్నట్టుండి జంతువుల బోనులోకి దూకాడు. ఇక అంతే పులి చేతిలో పడ్డాడు. ఈ దారుణమైన ఘటన ఢిల్లీలోని జూ పార్కులో మంగళవారం చోటు చేసుకుంది.
కొంతమంది విద్యార్థులు ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. ఆ క్రమంలోనే ఆ విద్యార్థులు జూలోని జంతువులపై రాళ్లు విసరడం ఆరంభించారు. అనంతరం హిమంశు అనే ఇంటర్ విద్యార్థి పులి ఫోటో తీద్దామని భావించి ఎన్ క్లోజర్ ఎక్కాడు. అయితే అదుపుతప్పి అక్కడ్నుంచి సరాసరి బోనులో పడ్డాడు. ఇంకేముంది పులి నోటికి చిక్కాడు. అతన్ని పులి పూర్తిగా ఛిద్రం చేసింది. అతను స్వీయ తప్పిదంతోనే జంతువులు ఉండే బోనులోకి పడినట్లు ఓ జూ అధికారి తెలిపారు.