'విభజన అంశంలో ఉద్యోగులను పందులా చూడకండి'
'విభజన అంశంలో ఉద్యోగులను పందులా చూడకండి'
Published Wed, Nov 27 2013 8:32 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
రాష్ట్రాల్ని విభజించే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వాలు ప్రవర్తించే తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విభజన సమయంలో ప్రభుత్వ రంగ ఉద్యోగులను గినియా పందుల్లా చూడవద్దని తీవ్రంగా సుప్రీం మందలించింది. ఉద్యోగులు చేయని తప్పుకు వారిని బలి చేయవద్దని సుప్రీం సూచించింది. ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని బీహార్, జార్ఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది.
బీహార్ హిల్ ఏరియా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పోరేషన్(భాల్కో) ఆతర్వాత జార్ఖండ్ హిల్ ఏరియా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పోరేషన్ (జాల్కో)గా మారినా ఏళ్ల తరబడి ఉద్యోగుల బకాయిలు తీర్చడంలో అలసత్వం ప్రకటించింది. ఏన్నో ఏళ్లుగా బకాయిలను చెల్లించకపోవడం విషాదమే అన్నారు. పార్లమెంట్ చట్టం ప్రకారం రాష్ట్రాల విభజన జరిగినా బకాయిలు చెల్లించకపోవడం విషాదమే అనవచ్చని సుప్రీం వ్యాఖ్యలు చేసింది.
బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేద భాల్కో ఉద్యోగి ఆత్మహుతి చేసుకున్న సంఘటనపై సుప్రీం స్పందించింది. కేవలం రాష్ట్ర విభజన కారణంగా, అధికారుల నిర్లక్ష్యంగానే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడని జస్టిస్ మిశ్రా అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే సమస్యల్ని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొనే వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం విధానాలను రూపొందించిందన్నారు. అయితే చట్టాలను ఉల్లంఘించి, న్యాయవిరుద్దంగా ఉద్యోగులను గినియా పందుల్లా మార్చి ప్రయోగాలకు పాల్పడ్డారని సుప్రీం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ముమ్మాటికి ఈ వ్యవహారం రాజ్యాంగాన్ని కించపరచడమే. అంతేకాకుండా ఏ ఒక్కరి హక్కులకు భంగం కలిగించకూడదు అని సుప్రీం వ్యాఖ్యలు చేసింది.
Advertisement