PSU employees
-
పీఎస్‌యూ ఉద్యోగుల డేటా సేకరణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల వివరాలూ సేకరించడానికి రంగం సిద్ధమైంది. హెల్త్‌కార్డుల కోసమంటూ ట్రెజరీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల డేటా సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల స్థానికత, ఇతర వివరాలతో కూడిన డేటా ఇవ్వాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు లేఖలు రాసింది. ఏ ప్రాంతానికి చెందినవారు? సర్వీసు ఎంత? ఏ రాష్ట్రంలో కొనసాగించాలని భావిస్తున్నారు? తదితర ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మాను లేఖతో పాటు జత చేసింది. ఏపీఐఐసీ, మార్క్‌ఫెడ్ తదితర సంస్థల్లో ఉద్యోగుల డేటా సేకరించడం ప్రారంభమైంది. పీఎస్‌యూలకు ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయని విషయం తెలిసిందే. చాలా సంస్థల్లో రాష్ట్రస్థాయిలోనే నియామకాలు జరిగాయి. ఆయా సంస్థల సర్వీసు నిబంధనల్లో కూడా జోనల్ వ్యవస్థ ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన లేదా ఇరు ప్రాంతాల్లోని టర్నోవర్ ఆధారంగా స్టాఫ్ ప్యాట్రన్ నిర్ణయించి, ఉద్యోగుల స్థానికత, ఆప్షన్ ఆధారంగా విభజించే అవకాశం ఉంది. -
పీఎస్‌యూ ఉద్యోగులకూ ఐఆర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) త్వరలోనే అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని పేర్కొనడం తెలిసిందే. ఫలితంగా దాదాపు 80 వేల మంది పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ అందే అవకాశం లేకుండా పోయింది. ఈ అంశంపై ‘సాక్షి’ ఇటీవల వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం సంబంధిత జీవో సవరణకు చర్యలు చేపట్టింది. ఈమేరకు రూపొందించిన ఫైలుపై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సంతకం చేసి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపారని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం ఆమోదించాక జీవో వెలువడే అవకాశం ఉందన్నాయి. -
'విభజన అంశంలో ఉద్యోగులను పందులా చూడకండి'
రాష్ట్రాల్ని విభజించే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వాలు ప్రవర్తించే తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విభజన సమయంలో ప్రభుత్వ రంగ ఉద్యోగులను గినియా పందుల్లా చూడవద్దని తీవ్రంగా సుప్రీం మందలించింది. ఉద్యోగులు చేయని తప్పుకు వారిని బలి చేయవద్దని సుప్రీం సూచించింది. ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని బీహార్, జార్ఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది. బీహార్ హిల్ ఏరియా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పోరేషన్(భాల్కో) ఆతర్వాత జార్ఖండ్ హిల్ ఏరియా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పోరేషన్ (జాల్కో)గా మారినా ఏళ్ల తరబడి ఉద్యోగుల బకాయిలు తీర్చడంలో అలసత్వం ప్రకటించింది. ఏన్నో ఏళ్లుగా బకాయిలను చెల్లించకపోవడం విషాదమే అన్నారు. పార్లమెంట్ చట్టం ప్రకారం రాష్ట్రాల విభజన జరిగినా బకాయిలు చెల్లించకపోవడం విషాదమే అనవచ్చని సుప్రీం వ్యాఖ్యలు చేసింది. బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేద భాల్కో ఉద్యోగి ఆత్మహుతి చేసుకున్న సంఘటనపై సుప్రీం స్పందించింది. కేవలం రాష్ట్ర విభజన కారణంగా, అధికారుల నిర్లక్ష్యంగానే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడని జస్టిస్ మిశ్రా అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే సమస్యల్ని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొనే వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం విధానాలను రూపొందించిందన్నారు. అయితే చట్టాలను ఉల్లంఘించి, న్యాయవిరుద్దంగా ఉద్యోగులను గినియా పందుల్లా మార్చి ప్రయోగాలకు పాల్పడ్డారని సుప్రీం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ముమ్మాటికి ఈ వ్యవహారం రాజ్యాంగాన్ని కించపరచడమే. అంతేకాకుండా ఏ ఒక్కరి హక్కులకు భంగం కలిగించకూడదు అని సుప్రీం వ్యాఖ్యలు చేసింది.