సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగం 2014లో విప్లవాత్మక మార్పులకు కేంద్రబిందువు కానుంది. స్థిరాస్తి మోసాలకు ముకుతాడు వేసే స్థిరాస్తి నియంత్రణ బిల్లు, భూ సేకరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర లభిస్తే స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆయా బిల్లులతో భూముల విలువ గణనీయంగా పెరిగి బిల్డర్లు, డెవలపర్లు ఫ్లాట్లు, ప్లాట్ల రేట్లను పెంచే ప్రమాదం కూడా ఉంది. అందుకే బిల్డర్లు, కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని ధరలు పెరగకుండా స్థిరాస్తి నియంత్రణ బిల్లులో కొన్ని మార్పులు తీసుకురావాలి.
సంస్కరణలు ఆరంభంకావడంతో గృహరుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతాయని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా కొనుగోలుదారులు ఎప్పుడెప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయా అని వేచిచూస్తున్నారని, ఇది నిజమైతే కొనుగోలుదారులు ఇళ్లను కొనడానికి ముందుకొస్తారు.
2014లో రియల్టీ పయనమెటు?
Published Sat, Dec 28 2013 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement