
పెసర పంటలో తెగుళ్ల నివారణ
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగు చేసిన పెసర పంటకు రసం పీల్చే పురుగు, తెల్ల దోమ, మసి పేను సోకిందని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్, సెల్: 8886614277 తెలిపారు. సరైన వానలు లేక కాయ ఎదుగుదల లోపించిందని చెప్పారు. ఈ సమయంలో లీటర్ నీటిలో రెండు గ్రాముల యూరియా కలిపి చేనుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. వర్షాలు లేక పంట త్వరగా పక్వానికి వచ్చిందని వివరించారు. తెల్లదోమ బెడద అధికంగా ఉంటే దీని నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ను కలిపి పంటపై పిచికారీ చేయాలని తెలిపారు. రసం పీల్చే పురుగు నివారణకు లీటర్ నీటిలో 1.5గ్రాముల ఎస్పేట్ మందును కలిపి స్ప్రే చేయాలని సూచించారు.
- జహీరాబాద్ టౌన్