తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌కు సిడ్నీ నగరంలో ఏటీఎస్‌ఏ సభ్యులు, టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శ్రేణుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌కు సిడ్నీ నగరంలో ఏటీఎస్‌ఏ సభ్యులు, టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శ్రేణుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తనకు భారీ ఎత్తున స్వాగతం తెలిపిన ఆస్ట్రేలియాలోని తెలంగాణ వాసులకు ఎంపీ వినోద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
జూన్ ౩వ తేదీన సిడ్నీ నగరంలో ఏటీఎస్‌ఏ ఆధ్వర్యంలో, 4న టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ హాజరు కానున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెరాస ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై జరిగే చర్చా కార్యక్రమాలలో, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీల ప్రతినిదులతో జరిగే సమావేశాలలో ఎంపీ పాల్గొంటారని, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు.