‘మిసైల్’లా దూసుకెళ్లిన మన దౌత్యనీతి | PM modi diplomacy like missile | Sakshi
Sakshi News home page

‘మిసైల్’లా దూసుకెళ్లిన మన దౌత్యనీతి

Published Sun, Jun 12 2016 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

‘మిసైల్’లా దూసుకెళ్లిన మన దౌత్యనీతి - Sakshi

‘మిసైల్’లా దూసుకెళ్లిన మన దౌత్యనీతి

ప్రస్త్తుతం ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న అణ్వాయుధ వ్యాప్తి నిరోధకానికి ఆద్యులైన అమెరికాతోపాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశాన్ని దూరంగా ఉంచి తమ లక్ష్యా లను సాధించలేమని గుర్తించాయి. గత రెండేళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరించిన దౌత్యవిధానంతో, ఒకప్పుడు మనల్ని వ్యతిరేకించిన ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, రష్యా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇంగ్లండ్‌లు.. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ పాత్రకు మద్దతుగా నిలుస్తూ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో మన దేశ సభ్యత్వాన్ని సమర్థించాయి.
 
 ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానం మరొక ఘనవిజయాన్ని సాధించింది. 26 మే, 2014న సార్క్ దేశాల నాయకుల సాక్షిగా 14వ భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విదే శాంగ విధానాలు, దౌత్యనీతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కి విశ్వపటలంపై గుర్తింపు, హోదాను సంపాదించడానికి ఈ రెండేళ్ల వ్యవధిలో మోదీ ప్రభుత్వం నిబద్ధతతో కూడిన విప్లవాత్మకమైన చర్యలు అనేకం చేపట్టింది. పర్యవసానంగానే భారత దేశానికి క్షిపణి క్షేత్రంలో అత్యంత కీలకమైన మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ (ఎంటీసీఆర్)లో సభ్యత్వం లభించింది.

 అణుపరీక్షలను నిర్వహించడం, అణ్వాయుధాల తయారీ తదితర అంశాల నుంచి భారతదేశాన్ని దూరంగా ఉంచడం కోసం, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒడంబడిక (న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ) పేరిట ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన దేశాలు.. ఇప్పుడు భేషరతుగా ఎటువంటి వ్యతిరేకత లేకుండా భారత్‌ను తమలో చేర్చుకున్నాయి. ఇప్పటికే 34 దేశాలు సభ్యు లుగా ఉన్న మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం కోసం భారతదేశం 2015లో దరఖాస్తు చేసుకున్నది. మానవ రహిత అణ్వాయుధ వాహకాలను నిరోధించేందుకుగాను కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, ఇంగ్లండ్, అమెరికాలతో కూడిన ఏడు అభివృద్ధి చెందిన దేశాలు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌ని 1987 ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేశాయి. దీనితో బ్యాలి స్టిక్ మిస్సైల్స్ తయారీ కొంతమేర తగ్గిందనే చెప్పుకోవాలి.

 అయితే అణు పరిజ్ఞానం, అణ్వాయుధాల తయారీ, సేకర ణలపై కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని భారతదేశం నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. ప్రపంచ వినాశనానికి అణ్వాయుధాల వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక దశాబ్దాలుగా ఉద్యమి స్త్తున్న భారత్ తన సార్వభౌమత్వాన్ని దేశ సమగ్రతను కాపాడు కోవడంతో పాటు అభివృద్ధి చర్యల కోసం అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్త్తున్నది. భారత్ దాదాపుగా 7,500 కి.మీ. సరిహద్దులను చైనా, పాకిస్తాన్‌లతో పంచుకుంటు న్నది. ఒకానొక సమయంలో ఈ రెండు దేశాలు భారత్‌పై దండ యాత్ర చేశాయి. ఈ రెండు సరిహద్దు దేశాల వద్ద అణ్వాయుధా లున్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారతదేశం తన పరమాణు పరిజ్ఞానాన్ని, అణ్వాయుధ బలాన్ని నిర్లక్ష్యం చేయజాలదు.

 2015లో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తును ఇటలీ ఎలాంటి కారణాలు చూప కుండానే అడ్డుకున్నది. ఆ తర్వాత మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం వివిధ దేశాలతో అనుసరించిన దౌత్యవిధానాల వల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో భారత్‌కు సభ్యత్వం లభించింది. ఈ మొత్తం చర్యలకు అమెరికా బహిరంగంగా మద్దతు పలకడం చెప్పుకోదగ్గ పరి ణామం. నిర్ణీత గడువైన 6, జూన్ 2016లోగా ఏ ఒక్క దేశం కూడా భారత సభ్యత్వానికి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇక అధికారిక ప్రకటన నామమాత్రమే.

 మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం కారణంగా అత్యంత కీలకమైన న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్‌లో (ఎన్.ఎస్.జి) భారత సభ్యత్వానికి మార్గం సుగమమైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మేలైన క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు చేరు వైంది. ఇప్పటికే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ క్షిపణి రంగంలో కీలకమైన స్థానం దక్కించుకుంటున్న భారత్‌కు ఈ పరిణామం అత్యంత శుభసూచకం. సమర్థవంతమైన క్షిపణులను కొనుగోలు చేయడానికి, అమ్మడానికి మన సాంకేతిక ైనైపుణ్యాన్ని అమ్మడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రష్యాతో కలిసి రూపొందించిన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులను ఇతర దేశాలకు అమ్మడానికి వీలు కలిగింది. మొత్తంమీద అణ్వాయు ధాల ఎగుమతి దేశాల సరసన భారత్‌కు ప్రముఖమైన స్థానం లభించింది.

 మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం కారణంగా మేటి రకం ప్రిడేటర్ డ్రోన్(మానవ రహిత యుద్ధ విమానం)లను కొనుగోలు చేయడానికి చర్యలు వేగవంతమవుతాయి. భారత వాయుసేన విభాగం మరింత బలపడుతుంది. ఈ డ్రోన్ విమా నాలు 770 కిలోమీటర్లు ప్రయాణించగలవు. శత్రుదేశాల నుంచి ఏర్పడే ముప్పులపై నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. వీటన్నింటికి మించి శాంతియుత ప్రయోజనాల కోసం అణువిజ్ఞానాన్ని వినియోగించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మరింత ఊతం లభిస్తుంది.

 అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతదేశం ఆప రేషన్ శక్తి పేరిట 1998 మే 11న రాజస్తాన్‌లోని పొఖ్రాన్‌లో అయిదు అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అంతకుముందే 1995 సంవత్సరంలోఅమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అప్పటి ప్రధాన మంత్రి ిపీవీ.నరసింహారావు అణుపరీక్షలను విరమించుకోవడం అందరికీ విదితమే. ఆ తర్వాత 1998లో అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయి ఎవరి ఒత్తిళ్లకు లొంగక దేశ అణుపాటవాన్ని, మన సామర్థ్యాన్ని విజయవంతమైన ప్రయోగాలతో ప్రపంచానికి చాటి చెప్పారు.

 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలనా కాలంలో భారత అణుప్రయోజనాలు మరుగున పడిపోయాయని చెప్పకతప్పదు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలమైన విదేశాంగ విధానా లతోపాటు, రక్షణ రంగ అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించ డంతో మన అణ్వాయుధ విధానం మరొకసారి ప్రాధాన్యతను సంతరించుకున్నది.

 ప్రస్త్తుతం ప్రపంచవ్యాప్తంగా అమలులోఉన్న అణ్వాయుధ వ్యాప్తి నిరోధకానికి ఆద్యులైన అమెరికాతోపాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశాన్ని దూరంగా ఉంచి తమ లక్ష్యాలను సాధించలేమని గుర్తించాయి. గత రెండేళ్ల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరించిన దౌత్యవిధానం కారణంగా, ఒకప్పుడు మనల్ని వ్యతిరేకించిన ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, రష్యా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇంగ్లండ్ దేశాలు ప్రస్తుత తరుణంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ పాత్రకు మద్దతుగా నిలుస్తూ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో మన దేశ సభ్యత్వాన్ని సమర్థించాయి.

 గత రెండేళ్లుగా ప్రపంచంలోని అనేక కీలక దేశాలతో పాటు అమెరికాతో సమాన స్థాయిలో మోదీ ప్రభుత్వం అనుసరించిన దౌత్యవిధానాల కారణంగానే ఈ విజయం చేకూరింది. దీని కారణంగా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌తో పాటుగా మరొక మూడు కీలకసంస్థలు - 1.న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ - 2. రసాయనిక ఆయుధాలను నిరోధించే ఆస్ట్రేలియన్ గ్రూప్- 3. కన్వెన్షనల్ ఆయుధాలను నిరోధించే 41 దేశాలతో కూడిన వాత్సెన్నార్ గ్రూప్‌లో కూడా భారత్‌కు సభ్యత్వం లభించే అవకాశాలు మెరుగయ్యాయి.

 భారత ప్రధాని నరేంద్రమోదీ అవిశ్రాంతంగా చేస్తున్న విదేశీ పర్యటనలను, బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానాలను అవహేళన, అపహాస్యం చేస్త్తున్న వారికి ఈ సంఘటన ఒక కనువిప్పు అవుతుందని ఆశ. భారత దౌత్యనీతికి ఇదొక్కటే నిదర్శనం కాదు. అనేక నిదర్శనాలలో ఇదొకటి.

- కామర్సు బాలసుబ్రహ్మణ్యం
వ్యాసకర్త బీజేపీ పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి
 మొబైల్ : 09899331113

 
 


కళాత్మక దౌత్యం

 ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన అమెరికా యాత్ర విజయవంతమైంది అని ఎవరు అన్నా అంగీకరించాలి.ఎందుకంటే తొమ్మిదేళ్ల క్రితం భారత్ నుంచి మాయమైన అద్భుత కళాఖండాల ఆచూకీ తెలియడం, వాటిని మోదీ వెంట పంపడం కూడా జరిగింది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వంద మిలియన్ డాలర్లు. 2000 ఏళ్ల నాటి కళా ఖండాలు ఇందులో ఉన్నాయి. సుభాష్ కపూర్ అనే అంతర్జాతీయ కళాఖండాల స్మగ్లర్ గుట్టును భారత అధికారుల సహకారంతో అమెరికా పోలీసులు రట్టు చేశారు. దీనితో అతడిని 2011లోనే అరెస్టు చేశారు. ప్రస్తుతం చెన్నై జైలులోనే ఉన్నాడు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక కళాఖండం అక్రమంగా తర లించిన కేసులో అతడు అరెస్టయ్యాడు. ఇప్పుడు ఈ కళాఖండాలన్నింటినీ ఆయా ఆలయాలకీ, పురావస్తు ప్రదర్శన శాలలకీ తిరిగి అప్పగిస్తారట. కపూర్ గ్యాల రీస్ పేరుతో అమెరికాలోనే ఆ కుటుంబీకులు కళా ఖండాల అమ్మకాలు సాగిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement