
నిందితుడిని చూపిస్తున్న పోలీసులు
కందుకూరు : వికలాంగురాలిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ కథనం ప్రకారం వివరా లు... మండల పరిధిలోని నేదునూరుకు చెందిన ఓ వికలాంగురాలైన అవివాహితæ(43) తన తల్లిదండ్రులు, పెద్ద వదినతో (పెద్ద అన్న మరణించాడు) కలిసి గ్రామంలోనే ఉంటోంది. కాగా ఈ నెల 16న తన వదినకు జ్వరం రావడంతో హస్తినాపు రంలోని కుమారుడి ఇంటికి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పటి నుంచి బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉం టోంది. కాగా ఈ నెల 20న రాత్రి పది గంటల సమయంలో గే టు కొట్టిన చప్పుడు రావడంతో మెల్లగా ఆమె తలుపు తీసు కుని బయటికి వచ్చింది. అదే సమయంలో ఇంటి సమీపంలో ఉండే గుమ్మడి వెంకటరమణారెడ్డి అలియాస్ వెంకటకిషన్‌రెడ్డి(20) ప్రహరీ దూకి లోనికి వచ్చాడు. తెలిసిన వ్యక్తి కావడంతో లోనికి వెళ్లింది. ఇదే అదనుగా అత ను ఇంట్లోకి చొరబడి తలుపులు మూసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తనకు జరిగిన ఘోరంపై కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు లించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందుతుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో గురువారం స్థానిక పీఎస్‌లో సీఐ భాస్కర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కె.జంగయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ముచ్చర్ల నర్సింహ మాట్లాడుతూ.. అభాగ్యురాలైన వికలాంగ మహిళపై జరిగిన లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment