
అందాల చెరువు.. : ఉట్నూర్ మండలం లక్కారం చెరువు మత్తడి పారుతూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలతో నిండుగా నీరు ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది. – ఉట్నూర్ రూరల్

పెన్‌గంగ.. ఉధృతంగా.. : సిర్పూర్(టి) మండలంలో పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు నాటు పడవలో ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. – సిర్పూర్(టి)

పర్యాటకుల సందడి.. : నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. పై నుంచి జాలువారే నీటిలో స్నానం చేస్తూ ఆనందంగా గడిపారు. – నేరడిగొండ

ఏరువాక..: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్–యు మండలం భీంజికుంట, మార్లవాయి గ్రామాల్లో గిరిజన మహిళలు నెత్తిపై గుల్లలో సద్దిమూట, సంకలో చంటిపాప, మేకలతో పొలం బాట పట్టారు. – ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

ఏరువాక..: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్–యు మండలం భీంజికుంట, మార్లవాయి గ్రామాల్లో గిరిజన మహిళలు నెత్తిపై గుల్లలో సద్దిమూట, సంకలో చంటిపాప, మేకలతో పొలం బాట పట్టారు. – ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

పడవ ప్రయాణం.. : ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలో కురిసిన వర్షాలకు నీల్వాయి వాగు ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ప్రజలు ఇలా నాటు పడవల్లో ప్రయాణించాల్సి వచ్చింది.

వావ్ సూపర్.. : ఇటీవల కురిసిన వర్షాలకు బెజ్జూర్ మండలంలోని గొల్లబాయి చెరువు ఉప్పొంగి ప్రవహించింది. సుందర దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబర్చారు. – బెజ్జూర్

వరద గోదావరి.. : ఇటీవల కురిసిన వర్షాలకు కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో గేట్లు ఎత్తి వరద నీటిని గోదావరి నదిలోకి వదిలారు. – కడెం