1/13
ఏదైనా ఒక రంగంలో శక్తిమేర శ్రమించి నిష్ణాతులైన వారి గురించి తరచుగా విన్నాం.. కన్నాం! కానీ ఆసక్తి ఉన్న రంగాలన్నిటిలోనూ నిపుణతను సాధించిన వాళ్ల గురించే అరుదుగా తెలుస్తుంటుంది. ఆ జాబితాలోని వ్యక్తే సాబా అజాద్. ఆమె పరిచయం..
2/13
స్వస్థలం.. ఢిల్లీ. ఇంట్లో అంతా థియేటర్ వాతావరణమే. అందులోనే పుట్టి పెరగడం వల్ల సంగీతం, అభినయం ఉగ్గుపాలతోనే ఒంటబట్టాయి. థియేటర్ మాస్టర్, సామాజిక కార్యకర్త సఫ్దర్ హష్మీ .. సాబాకు స్వయాన మేనమామ. ఆయన స్థాపించిన ‘జన నాట్య మంచ్’ థియేటర్ గ్రూప్‌తోనే నటనాప్రవేశం చేసింది.
3/13
ఒడిస్సీ డాన్స్‌లో... జాజ్ మ్యూజిక్‌లో శిక్షణ పొందింది. లైవ్ షోలు ఇచ్చింది. సుప్రసిద్ధ నటుడు నసీరుద్దిన్ షా వాళ్లబ్బాయి ఇమాద్ షా "Madboy/ Mink' మ్యూజిక్ బ్యాండ్‌లో సాబాకూ భాగం ఉంది.
4/13
థియేటర్ ఆర్టిస్ట్‌గా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్, సినీ నటుడు మకరంద్ పాండేతో కలసి పృథ్వి థియేటర్‌లో కొన్నాళ్లు పనిచేసింది. తర్వాత తానే ‘ద స్కిన్స్’ పేరుతో ఒక థియేటర్ గ్రూప్‌ను ప్రారంభించింది. ‘లవ్‌ప్యూక్’ నాటకంతో దర్శకురాలిగానూ మారింది.
5/13
ఆమె ఫిల్మ్ కెరీర్ మొదలైంది 2008లో.. ‘దిల్ కబడ్డీ’ సినిమాతో. తర్వాత రెండేళ్లకు ‘ముఝ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే’ సినిమాతో కథానాయిక అయింది. నచ్చిన పాత్ర దొరికితే అది థియేటరా స్క్రీనా అని ఆలోచించదు సాబా. ఆమె యాక్ట్ చేసిన (గురూర్, లవ్‌ప్యూక్ వంటి) షార్ట్‌ఫిల్మ్సే అందుకు నిదర్శనం.
6/13
సినిమాల్లో నటించడమే కాదు షాందార్ (షాహిద్ కపూర్), కార్వాన్ (ఇర్ఫాన్ ఖాన్, దుల్కర్ సల్మాన్), మర్ద్ కో దర్ద్ నహీ హోతా (రాధికా మదన్) వంటి సినిమాలకు సంగీత దర్శకురాలిగా పనిచేసింది.
7/13
డాన్స్, నటన, మ్యూజిక్, మోడలింగ్ బిజీగా ఉంటూనే ‘లవ్ లైక్ ఇష్క్ (నెట్‌ఫ్లిక్స్)’ ‘రాకెట్ బాయ్స్(సోనీలివ్)’ వంటి సిరీస్‌లతో ఓటీటీలోనూ అపియర్ అవుతోంది.
8/13
‘సామాజిక స్పృహ మెండుగా ఉన్న మా కుటుంబ వాతావరణం నా పర్సనల్ లైఫ్‌నే కాదు నా ప్రొఫెషనల్ లైఫ్‌నూ ఇన్స్‌పైర్ చేసింది. అది నా చుట్టూ ఉన్న సమాజాన్నే కాదు.. నేను పోషించే పాత్రల స్వభావలనూ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతోంది!’: సాబా అజాద్
9/13
రెండేళ్లుగా హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం నడుపుతోంది.
10/13
11/13
12/13
13/13