
తెలుగు హీరోల్లో నాని సమ్ థింగ్ డిఫరెంట్. సినిమాలు కూడా అలానే ఉంటాయి

ఈ రోజు నాని పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయిన నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు

సినిమాలపై ఇష్టంతో బాపు దగ్గర సహాయ దర్శకుడిగా 'రాధా గోపాలం' మూవీ కోసం పనిచేశాడు

కానీ తర్వాత కొన్నాళ్లు రేడియో జాకీగా పనిచేస్తున్న టైంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దృష్టిలో పడి 'అష్టాచెమ్మా'తో హీరో అయ్యాడు.

తర్వాత ఒక్కో సినిమాతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు

ఇకపోతే నాని.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తొలి పారితోషికంగా రూ.4 వేలు అందుకున్నాడట

ఇప్పుడేమో ఒక్కో సినిమా చేసేందుకు రూ.25 కోట్లకు పైనే తీసుకుంటున్నాడట

నటుడిగా కొన్నాళ్ల క్రితం స్టార్ దర్శకులతో పనిచేశాడు గానీ పెద్దగా కలిసిరాలేదు

ఎప్పుడైతే యువ దర్శకులతో కలిసి పనిచేశాడో కెరీర్ పరంగా నానికి అద్బుతమైన సినిమాలు పడ్డాయి

ప్రస్తుతం హిట్ 3, ప్యారడైజ్ తదితర చిత్రాలతో నాని బిజీగా ఉన్నాడు

హీరోగా ఓ వైపు ఆకట్టుకుంటూనే మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంటున్నాడు

హిట్ 3 సినిమాలో హీరోగా నటిస్తూ నిర్మిస్తుండగా.. 'కోర్ట్' అనే కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ తీశాడు

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మూవీని నానినే నిర్మించబోతున్నాడు

వ్యక్తిగత విషయానికొస్తే వైజాగ్ అమ్మాయి అంజనాని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అర్జున్ అనే కొడుకు ఉన్నాడు



