1/8
సంధ్యాసమయం.. అప్పటివరకు కిలకిలరావాలతో ఎక్కడెక్కడికో వెళ్లిన పక్షులన్నీ ఒక్కొక్కటిగా గూటికి చేరుకుంటున్నాయి. ఆ పయనంలో ఈ గువ్వ కాస్తంత విశ్రాంతి తీసుకుంటానంటోంది.ఫొటో- అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్
2/8
అతడిది జీవన పోరాటం.. వాళ్లది అభం శుభం తెలియని బాల్యం. పనిమీద నాన్న తీసుకెళ్తుంటే.. పసివాళ్లు అలసి సొలసి.. ఇలా ఓ కునుకు తీస్తున్నారు. ఫొటో- మాధవరెడ్డి, తిరుపతి
3/8
శ్రీవారి నామం.. బహుసుందరం. తలనీలాలు సమర్పించుకుని, ఆ వేంకటేశ్వరుని నామాలు నుదుట ధరించిన ఈ చిన్నారుల రూపం కూడా బహుసుందరం.ఫొటో - మోహనకృష్ణ, తిరుమల
4/8
మీకు కాంతులిస్తాం.. మా ప్రాణాలు పణంగా పెడతాం అంటున్నారు ట్రాన్స్ కో సిబ్బంది. కర్నూలు సమీపంలో హైటెన్షన్ లైన్లకు సరఫరా ఆపకుండానే మరమ్మతులు చేస్తున్నదీ దృశ్యం ఫొటో - హుస్సేన్, కర్నూలు
5/8
ఇదేదో పెద్ద రాళ్లగుట్టలా అనిపిస్తోంది కదూ. కాస్తంత జాగ్రత్తగా చూడండి.. ఇవన్నీ విద్యుత్ మీటర్లు. కొత్తగా డిజిటల్ మీటర్లు వస్తుండటంతో పాతవాటిని తీసేసి ఇలా గుట్టలా పారేశారు.ఫొటో- భజరంగ్ ప్రసాద్, నల్లగొండ
6/8
అగ్గి రాజుకుందంటే ఎంత పెద్ద చెట్టయినా బుగ్గి కావాల్సిందే. అప్పటివరకు తియ్యటి ఈత పళ్లు, దాంతో పాటే ఈత కల్లు కూడా ఇచ్చిన ఈ చెట్టు.. వెనక వస్తున్న మంటలవేడికి తాళలేకపోతోంది.ఫొటో- జిలానీ బాషా, ఆదిలాబాద్
7/8
కార్తీకదీపం.. పరమపవిత్రం. అందులోనూ తిరుమల కొండమీద, శ్రీవేంకటేశ్వరుని ఆలయం ఎదురుగా వెలిగిస్తే.. ఆ పవిత్ర దీపం ఇలా కనిపిస్తుంది.ఫొటో - మోహనకృష్ణ, తిరుమల
8/8
మంచి ముత్యాలే కాదు.. మంచు ముత్యాలు కూడా చూసేందుకు చాలా అందంగా కనిపిస్తాయి. తెల్లవారుజామున ఇలా కొమ్మకొమ్మకూ పూసే పూలలా మంచు ముత్యాలు సుమనోహరంగా కనిపిస్తాయి.ఫొటో- అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్